Veda Patashala

కనుమరుగైతున్న బ్రాహ్మణ్యాన్ని రక్షించేది బ్రాహ్మణ్యమే...సమస్థ హిందూ ధర్మాన్ని కాపాడేది మన పురోహిత,అర్చక,వేదపండితులే. పిల్లనివ్వకున్నా పెళ్ళేకాకున్న తమ బాల్యంనండే పన్నెండేళ్ళు అన్నీ వేదాల్లో ఘనాంతం నేర్చుకొని మానవుల్లో దైవత్వాన్ని కాపాడుకుంటూ అనాదిగా  దేవుళ్ళ కాలంనుండే పురోహితులుగా కొనసాగుతున్నారండి. ప్రతీ శుభాశుభ కార్యాల్లో అడుగడుగునా దర్శణమిచ్ఛేది బ్రాహ్మడే....మన కులంలో ఇంతగొప్ప స్థానంలో ఉన్న పురోహితులకు అసలు ఎవ్వరూ పిల్లనివ్వక వివక్ష కు గురిచేస్తున్నారు.

ఎన్నో వేల సంఖ్యలో పురోహితులూ,అలాగే మిగితా బతుకుదెరువు రంగాల్లో జీవిస్తున్న వారెవరికి పెల్లేకాక బ్రహ్మచారులగ జీవనం సాగిస్తూ తనువుచాలిస్తున్నరు...ఇది బాధాకరం...రాస్తూ నాకళ్ళకే నీళ్ళొస్తున్నాయండి. ఇక సహించేదిలేదు వీళ్ళలో ఉద్యమం మొదలవ్వాలె...రక్త సంబంధీకుల పురోహితమే చెయ్యాలె,ఏపెల్లిల్లకూ పేరంటాల్లకూ,అశుభాలకు అస్సలే వెల్లద్దు ...బ్రాహ్మడు లేక పెళ్ళెట్ల చేసుకుంటారో చూద్దాం !!! ఛస్తే           ఖర్మకాండలకు బ్రాహ్మడే రాక భీష్మించి కూర్చుంటే పీనుగెట్ల జర్గుతదో చూద్దాం. తిరగబడితేనే పురోహితుల విలువ తెలుస్తది...ఇకమీదట వేదపాఠశాలల్లోనూ మన పిల్లలకు వేదంతో పాటు టేలరింగ్, ఎంబ్రైడరీ,మగ్గం వర్క్ లలో,  హౌజ్వైరింగ్ ,అలాగే మిగితా మెకానికల్ వృత్తుల్లో భవిశ్యత్తు దృష్ఠిలో పెట్టుకొని శిక్షణ ఇప్పించాలె.  ఖచ్చితంగ వేదపాఠశాలల్లో వేదంతో పాటు బతుకుదెరువు పనులు నేర్పించాల్సిన అవసరం ఉన్నది. బ్రాహ్మణ్యం వర్ధిల్లాలె. జై బ్రాహ్మణ్ జైజై బ్రాహ్మణ.