ఈ శివుని ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని ప్రతీతి.
తీర్థరాజం
దేశంలోని పుణ్యక్షేత్రాలలో అమరకంటక్ ప్రముఖమైనది. దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. దీనిని 'తీర్థరాజం' అని కూడా పిలువబడుతున్నది. యాత్రాస్థలాలకు రాజు అని కూడా అంటుంటారు. మధ్యప్రదేశ్ -ఛత్తీస్ ఘర్ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆగ్నేయభాగంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది.అమరకంటక్ చుట్టూ సాత్పూరా , మైకల్ పర్వత శ్రేణులు నెలకొని ఉన్నాయి. పురాణాల్లో అమరకంటక్ ను రిక్ష పర్వతం అని పేర్కొనబడినది. హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రంగా అమరకంటక్ 12 కిలోమీటర్ల చుట్టుకొలతతో అలరారుతోంది. మహత్తరమైన నర్మదా మరియు సోనె నదులు ఇక్కడ ఆవిర్భవిస్తాయి. కాళిదాసు తన మేఘసందేశం రచనలో అమరకంటక్ ను అమరకూటంగా పేర్కొనబడినట్లు చెబుతారు.
అమర్ కంటక్ హిందువులు పవిత్రంగా భావించే నర్మదా నది జన్మ స్థలం. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలో కలదు. ఉవెత్తున ఎగిసి పడే జలపాత అందాలతో, అద్భుత శిల్పకళ లతో ఉట్టిపడే దేవాలయాలతో అమర్ కంటక్ అలరారుతున్నది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే దట్టమైన అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది.
పురాణ గాథల ప్రకారం:
శివుడు త్రిపురను దహించివేసినప్పుడు మూడు నిప్పులలో ఒకటి అమరకంటక్ లో పడింది. అది వేలాది శివలింగాలుగా మారిపోయాయి. వాటిలో ఒక శివలింగం ఇప్పటికీ జ్వాలేశ్వర్ లో పూజింపబడుతున్నది.
Shop Now For Sravana Masam Special : https://rb.gy/8i7ad
స్వర్గప్రాప్తి:
అమరకంటక్ ను సందర్శించిన శివుని ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. అలాగే అమరకంటక్ పర్వతాన్ని అధిరోహించిన వారికి పది మార్లు అశ్వమేధయాగం చేసినంత ఫలం లభిస్తుందని పద్మపురాణం ఆది కాండంలో తెలుపబడినది. భక్తులు పవిత్రమైన నర్మదా నదిలో మునిగి జ్వాలేశ్వరుని సందర్శిస్తారు.
మన దేశంలో ఉన్న పుణ్యనదులలో నర్మదానది 5వ స్థానంలో ఉంది. ఎక్కువగా ఈ నది గురించి హైందవ పురాణాలు, రామాయణం, మహాభారతాలలో నర్మాదానది ప్రస్థావన ఉంది. నర్మదానదిలో లభిస్తున్న రాళ్ళను చాలా వరకు శివలింగాలుగా భావిస్తూ పూజిస్తున్నారు. ఈ రాళ్లను బణలింగాలు అంటారు. అవి సాధారణంగా స్థూపాకారంలో శివలింగాకృతిలో ఉంటాయి. జోహిలాకు చెందిన జ్వాలవంతి, మహానది, అమోద్ నదులు అమరకంటక్ పీఠభూమిలో ఆవిర్భవించాయి.