నేడు
నృసింహ ద్వాదశి 21-03-2024
నృసింహ
ద్వాదశి
ఓం
నమో నృసింహా…
ఫాల్గుణ
శుద్ధ ద్వాదశిని నృసింహ
ద్వాదశి అంటారు.
నరసింహ
అవతారం దాల్చింది విష్ణువే
కాబట్టి ఈ రోజును గోవింద
ద్వాదశి అని కూడా అంటారు.
భారత దేశంలోని
అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున
విశేషంగా ఉత్సవాలు జరుపుతారు.
ఈ రోజున,
గంగా,
సరస్వతి,
యమునా,
గోదావరి
వంటి పవిత్ర నదులలో స్నానాలు
ఆచరిస్తారు.
సూర్యోదయానికి
ముందే లేచి నదుల్లో స్నానాలు
చేస్తారు.
ఈ నదులు
అందుబాటులో లేనివారు ఏ
సరస్సులోనైనా,
నదుల దగ్గర
కూడా స్నానాలు చేయవచ్చు.
అలా
చేస్తున్నప్పుడు గంగా దేవి,
విష్ణువులను
స్మరించుకోవాలి.
ఈ రోజు
భక్తులు గోవింద ద్వదశి వ్రతం
ఆచరిస్తారు.
ఉపవాసాలు
కూడా పాటిస్తారు.
ఈ రోజున
భక్తులు సాయంత్రం విష్ణు
దేవాలయాలను సందర్శించి అక్కడ
జరిగే పూజల్లో,
ప్రత్యేక
కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ రోజున
విష్ణు నామ స్మరణ,
శ్రీ నరసింహ
కవచం పఠించడం విశేష ఫలితాలనిస్తుంది.
శ్రీమహావిష్ణువు
దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామిని
ఈ రోజున పూజించే వారికి
అప్లైశ్వర్యాలు చేకూరుతాయి.
ద్వాదశి
నాటి గంగాస్నానం పాపాలను
నశింపజేస్తుందని పురాణ వచనం.
ఆలయాల్లో
ప్రత్యేక పూజలు,
అభిషేకాలు
నిర్వహించడం,
మహిళలు
సీతామాత పూజ,
విష్ణుపూజ
చేయడం వలన సకల సంపదలు
చేకూరుతాయి.
నృసింహ
ద్వాదశి వ్రతమాచరించే భక్తులకు
స్వామివారు ధైర్యం,
నమ్మకం,
భద్రత
కల్పిస్తారని విశ్వసిస్తారు.
నరసింహస్వామి।
శ్లోకాలు రోజంతా చదువుకుంటూ
ధ్యానం చేస్తే విశేషంగా లబ్ది
పొందుతారు.
వ్రతం
చేసుకునే వారు వేకువఝామునే
నిద్రలేవాలి.
పారే నదిలో
కానీ చెరువులో లేదా బావి వద్ద
శిరస్నానం చేయాలి..
ఇలా చేస్తే
దేహంశుద్ది అవడమే కాకుండా
పూజపై మనసు లగ్నమవుతుందని
పెద్దలు చెబుతారు.
నరసింహస్వామి
దేవాలయంలో కానీ,
ఇంటివద్ద
స్వామి వారి పటం పెట్టుకొని
వివిధ రకాల పూలు,
పండ్లు
ఉంచి నరసింహస్వామి శ్లోకాలను
భక్తి శ్రద్దలతో చదువుతూ పూజ
చేయాలి.
స్వామివారిని
తులసిమాలతో అలంకరించి,
వడపప్పు,
పానకం
నైవేద్యంగా సమర్పించాలి.
నరసింహాగాయత్రిని
కానీ,
శ్రీలక్ష్మి
నరసింహ కరావలంబ స్తోత్రం,
నరసింహ
అష్టోత్తరం,
నరసింహ
సహస్రనామాలను గానీ పఠిస్తే
చాలామంచిదని పురాణాలూ
చెబుతున్నవి.
"ఓం
నమో నృసింహాయ నమః"
అని 108
సార్లు
స్వామి వారిని ధ్యానించినా
విశేష ఫలితం లభిస్తుంది.
అలాగే ఈ
రోజున నరసింహ -
స్వామివారి
దేవాలయాను దర్శిస్తే వారి
కృపకు పాత్రులవుతారు.