కార్తీక మాస విధులు
కార్తీకము బహుళార్థసాధకముగా శివ కేశవ జగన్మాతలను, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని యధాశక్తి పూజించుట
ప్రధానము.
ఆసక్తి, శక్తి కలిగినవారు.... ఈ మాసమంతా దీక్ష అవలంబించడం,
మాసమంతా నక్త భోజన వ్రతమును ఆచరించటం ఉత్తమము.
ఈ మాసమంతా......
1) సూర్యోదయానికి పూర్వమే కార్తీకస్నానం సంకల్పయుతముగా..
2) కార్తీక దీప ప్రజ్వలన ప్రాతః సాయంకాల ఉభయ సంధ్యలలో.
3) శక్తిమేరకు శివ అభిషేకమో, ఇష్టదేవతా అనుష్ఠానమో, అర్చనో, జపమో,
పూజ నామపారాయణమో, అవశ్యం దానము అనుసరణీయమే.
4) "కార్తిక్యామిందువారేతు:స్నాన దాన జపాదికం |
అశ్వమేధ సహస్రాణాం ఫలం ప్రోప్న్యాత్యసంశయః ||"
అని శాస్త్రము.
*భావం:*
కార్తీకమాసమంతా ఆచరించలేని
వారు కనీసం, కార్తీక సోమవారం నాడు అయినా ఆచరించినట్లైతే
వేలకొలదీ అశ్వమేధయాగ ఫలాలు పొందగలరు.
5) అర్హత కలిగిన వారు తప్పనిసరిగా కార్తీక మాసంలో నిత్యం పితృతర్పణాలనివ్వాలి.
కారణమేమంటే.......
"యావన్తః కార్తికేమాసి వర్తన్తే పితృతర్పణే!
తిలాస్తత్సంఖ్యకాబ్దాని పితరః స్వర్గవాసినః!!"
*భావం:*
కార్తిక మాసములోని తిలతర్పణాలలోని తిలలసంఖ్య ఉన్నన్ని సంవత్సరాలు
పితరులు స్వర్గవాసులవుతారు. కర్తకి ఇది మహా
పుణ్యం.
6) ఈ మాసమంతా ఎవరైతే,
"శుచి-శుభ్రముగా, దీక్షగా గోసేవలో పాల్గొంటారో, గోమాతను పూజిస్తారో, గో స్తుతి
పారాయణాలు చేస్తారో, కార్తీకమాసం అంతా నిత్యము
గోమాతకు తగిన ఆహారాన్ని, గ్రాసాన్ని సమర్పిస్తారో వారు సర్వ దేవీదేవతా మరియు పితృదేవతా
అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
7) ఈ కార్తీకమాసంలో ఎవరైతే తులసి యందు మరియు చంద్రుని, రాధాకృష్ణులను
ధ్యానిస్తారో వారి భాగ్యమే భాగ్యము.
8) కార్తీక మాసమంతా.........
"కార్తీక దామోదర త్రయంబకేశ్వరాయ నమః" అనే నామమంత్రాన్ని
యధాతథంగా జపించాలి.
☝️ ( స్వతంత్రించి
ఈ మంత్రానికి ఎలాంటి అక్షరాలు లేదా బీజాక్షరాలు జత చెయ్యకూడదు )
కార్తిక మాసంలో ప్రధానమైన ఇంకొక మంత్రం ఉన్నది