శ్రీ ఎండల మల్లిఖార్జునస్వామి ఆలయము

కార్తీక మాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము..

ఈరోజు విశేషామైన  ఆలయం.....

శ్రీ ఎండల మల్లిఖార్జునస్వామి

ఆలయము , రావివలస  గ్రామం,

శ్రీకాకుళం......!!

 పరమశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఆలయానికి పైకప్పు, ద్వారం లాంటివి లేవు. ఇంకా ఇక్కడి శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంగా గుర్తింపు పొందింది.

 మరి ఇక్కడి శివలింగాన్ని ఎండల మల్లికార్జునుడు అని ఎందుకు పిలుస్తారు,ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకాకుళం జిల్లా, టెక్కలికి కొంత దూరంలో రావి వలస గ్రామంలో ఎండల మల్లికార్జునుడు అనే పెద్ద శివలింగం కలదు. మల్లెపూలతోనూ... జింక చర్మంతోనూ... కప్పబడిన శివలింగం కాబట్టి మల్లిఖార్జునుడుగా పిలవడం పరిపాటి...

 అతిపెద్ద ఈ శివలింగం గర్భగుడిలో ఎప్పుడు ఎండ తాకిడిని నిలిచి పైకప్పు లేదు కాబట్టి ఎప్పుడు ఎండలోనే ఉంటుంది. అందుకే ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అని పిలుస్తారు.

 ఈ ఆలయంలోని శివలింగం ఎత్తు సుమారు 20 అడుగులు. శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంది. నంది విగ్రహం పక్కనే మరొక చిన్న శివలింగం ఉంది. 

 స్థల పురాణం ప్రకారం, త్రేతాయుగంలో రాముడు రావణుడిని చంపి, అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు, వారి వైద్యుడైన సుషేణుడు సుమంచ పర్వతం వద్ద తిరిగి శివుని కోసం తపస్సు చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. 

చుట్టుపక్కల ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారిని ఆదుకోవాలని ఉంది. కొంత కాలం గడిచిన తరువాత రాముడు సుషేనుడి గురించి విచారించడానికి హనుమంతుడిని పంపాడు. 

 హనుమంతుడు రాగానే సుషేణుడు పోయినట్లు చూశాడు. సుషేనుడి దేహాన్ని చూసి దుఃఖించి, శరీరాన్ని జింక చర్మాన్ని (సంస్కృతంలో అజినా) కప్పి, దాని పైన కొన్ని మల్లెపూలను, శ్రీరాముడికి వార్తను తెలియజేయడానికి వెళ్ళాడు. 

రాముడు, సీత మరియు లక్ష్మణుడు తమ నివాళులర్పించేందుకు అక్కడికి వస్తారు మరియు వారు జింక చర్మాన్ని తొలగించినప్పుడు, ఒక శివలింగం పెరగడం జరిగింది.

 స్వయంభూ లింగం దగ్గర ఉన్న పుష్కరిణి(చెరువు)లో స్నానం చేసి పూజలు చేసి వెళ్లిపోయారు. లింగం క్రమంగా పెరిగింది. శివలింగం వచ్చినప్పటి నుండి, ప్రజలు వారి ఆరోగ్యం కోలుకోవడం. 

ఈ స్వామిని మల్లికాజిన స్వామి అని పిలిచేవారు. మల్లిక(జాస్మిన్ ఫ్లవర్) మరియు అజినా(జింక చర్మం). అందుకే మల్లికాజిన స్వామి అని పిలిచేవారు. అదే క్రమంగా మల్లికార్జున స్వామి గా మారింది.

 ద్వాపరయుగంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు ఈ స్వామిని పూజించాడని, అందుకే మల్లికార్జున స్వామిగా పిలవబడ్డాడని చెబుతారు.

 1870 ప్రాంతంలో టెక్కలి జమిందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగదేవ్ మల్లికార్జున స్వామివారికి ఆలయం నిర్మించగా అది కూలిపోయిందట. 

ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆలయ నిర్మాణం గావించ ప్రయత్నించగా 

ఆ స్వామి కలలో కన్పించి ఆలయం వద్దు ఎండలో ఎండి వానలో తడవడమే నా అభీష్టం, అదేలోక కళ్యాణం అని చెప్పగా అప్పటి నుండి మల్లికార్జునుడు ఎండల మల్లికార్జునుడుగా ప్రాచుర్యం పొందాడు. 

 లోకకళ్యాణార్థo సమస్త జనావాళిని కాపాడడానికి కార్తీక మాసంలో శివుడు రావి వలసలో ఆశ్వత్థ వృక్షం కిందవుంటాడని భక్తుల నమ్మకం. అందువల్లనే రావివలస కార్తీక కైలాసంగా ఖ్యాతినార్జించింది.

 ప్రతి సంవత్సరం కార్తెకమాసంలో ఇక్కడ కల సీతాకుండములో స్నానం చేసి భక్తితో స్వామిని కొలిస్తే సర్వవ్యాధులు నివారించబడుతాయని విశ్వసిస్తారు.

 కార్తీకమాసంలో ఇక్కడ కల అశ్వర్ధ వృక్షం క్రింద గడిపేందుకు, స్వామిని దర్శించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఉత్తరాంధ్ర జిల్లాల నండి చాలా మంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తూ ఉంటారు. రాష్ట్రము నలుమూలల నుండి కూడా యాత్రికులు వస్తుంటారు

 శ్రీకాకుళం జిల్లా ఎండల మల్లికార్జున స్వామి దేవాలయంలో  ఏడాది కోసారి ఇక్కడి శివలింగం చిన్న ధాన్యం గింజ పరిణామంలో పెరుగుతుందట.

సూర్యలింగంగా ఈ లింగాన్ని అభివర్ణిస్తారు. ఈ శివలింగాన్ని స్పృశిస్తూ వచ్చే గాలిని ఆస్వాదిస్తే సర్వరోగాలు పోతాయని ప్రతీతి. స్వామి తీర్ధప్రసాదాలు, దర్శనం చేసుకుంటే అన్ని కోరికలు తీరుతాయని నమ్మకం. 

 ఇదివరకు ఇలాంటి ఘటనలు జరిగాయని.. శివభగవానుడి దయవల్ల పుట్టిన ఆ పిల్లలకు మల్లన్న, మల్లమ్మా అని పేర్లు పెట్టుకోవడం కూడా జరిగిందని ఇక్కడి అర్చకులు చెబుతారు... స్వస్తి..


Products related to this article

Nara Pattu Dhothi With Rudraksha Border

Nara Pattu Dhothi With Rudraksha Border

Nara Pattu Dhothi With Rudraksha Border 3 + 2 MetersProduct Description:Material: Nara PattuAngavastram: Length 3 MetersUttareeyam: Length: 2 Meters..

₹800.00

Nara Pattu Dhothi with out Angavastram

Nara Pattu Dhothi with out Angavastram

               Nara Pattu Dhothi with out  AngavastramProduct Description:Product Name:Nara Pattu DhothiWidth: 2.25 MetersLength:4.5 Meters..

₹575.00