లక్ష్మీ దేవి నివాస స్థానాలను

లక్ష్మీ దేవి నివాస స్థానాలను తెలుసుకుని, ఆమెను తేలికగా ప్రసన్నం చేసుకునే మార్గాలు ఇపుడు చూద్దాము.

 ఏనుగు కుంభస్థలం, గో పృష్ఠము, తామర పువ్వులు, బిల్వదళము, సువాసిని పాపటి ఈ ఐదూ లక్ష్మీ దేవి ఆవాస స్థానాలు. మనకు లక్ష్మీ దేవి అనుగ్రహం కావాలి అనుకుంటే, ఆమె ఉన్న ఈ ఐదు స్థానాలను మొదట గుర్తించాలి.

 ఏనుగు కుంభస్థలం మనం ఏనుగు దగ్గరకు వెళ్ళి, దాని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయడం కుదరదు. దీనికి తేలిక అయిన మార్గం గజముఖుడైన వినాయకుని పూజించడం.  ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేయడం చాలా తేలిక.  ఇక్కడ మన ఇష్టం వచ్చినంత సేపు లక్ష్మీ దేవి స్థానాన్ని చూస్తూ చక్కగా పూజచేసుకోవచ్చు.

 గోమాత శరీరంలో అందరు దేవుళ్ళు కొలువై ఉంటారన్న సంగతి మనకు విదితమే. ఆవు యొక్క వెనుక భాగము (పృష్ఠము) లక్ష్మీ దేవి ఆవాస స్థానం. అందుకే మనం గృహప్రవేశం, గోదానం ఇత్యాది కార్యక్రమాలలో, ముందుగా గోవు యొక్క వెనుక భాగానికి పూజ చేస్తాము.

 బిల్వము లక్ష్మీ దేవిచే సృజింప బడినది. ఆ చెట్టుకిందే ఆమె తపస్సు చేసింది. ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది. వాటి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. బిల్వాలతో శివ పూజ చేస్తే, త్వరగా శివానుగ్రహం కలుగుతుంది.

 తామర పువ్వులు విశిష్టమైనవి, వీటితో లక్ష్మీ దేవికి పూజచేస్తే విశేష ఫలితం వస్తుంది. కారణం అవి ఆమె నివాస స్థానం.

 సువాసినులు తమ పాపటి మొదటిలో ధరించే కుంకుమ బొట్టు, లక్ష్మీ స్థానం.  ఆ విధంగా ముసలి వారైన స్త్రీలు మాత్రమే చేస్తారన్న అపోహలో కొందరిలో ఉంది. అది తప్పు.  వివాహమైన ప్రతి స్త్రీ తన పాపటి యందు, తప్పని సరిగా కుంకుమ ధారణ చేయాలి.  దాని వల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి, ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది.  ఆ ఇంటిలో ఎప్పుడూ సంపదలకు కొరత ఉండదు.

ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః

 

Products related to this article

 Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)

Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)

 Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)..

₹3,000.00

 Ayodhya Ram Lala Padukalu

Ayodhya Ram Lala Padukalu

Explore the divine craftsmanship with Pure Silver 999 Ayodhya Ram Lala Padukalu. These intricately designed silver padukalu are crafted with purity and devotion, symbolizing the divine presence of Lor..

₹795.00