Valmikipura Sri Pattabhiramaswamy Brahmotsavalu

ఏప్రిల్ 3 నుండి 11వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2025 మార్చి 14: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 3 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.

వాహనసేవల వివరాలు :

తేదీ

03-04-2025

ఉదయం – ధ్వజారోహణం(ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు),

రాత్రి – గజవాహనం

04-04-2025

ఉదయం – ముత్యపుపందిరి వాహనం,

రాత్రి – హనుమంత వాహనం

05-04-2025

ఉదయం – కల్పవృక్ష వాహనం,

రాత్రి – సింహ వాహనం

06-04-2025

ఉదయం – సర్వభూపాలవాహనం,

రాత్రి – పెద్దశేష వాహనం

07-04-2025

ఉదయం – సూర్యప్రభ వాహనం,

రాత్రి – చంద్రప్రభవాహనం, మోహినీ అవతారం

08-04-2025

ఉదయం – తిరుచ్చి ఉత్సవం,

రాత్రి – కల్యాణోత్సవం రాత్రి 8 నుండి 10 గంటల వరకు),

గరుడ వాహనం (రాత్రి 11 గంటలకు)

09-04-2025

ఉదయం – రథోత్సవం(ఉదయం 9.30 గంటలకు)

రాత్రి – ధూళి ఉత్సవం( సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు)

10-04-2025

ఉదయం – తిరుచ్చి ఉత్సవం,

రాత్రి – అశ్వవాహనం, పార్వేట ఉత్సవం

 

11-04-2025

ఉదయం – వసంతోత్సవం (ఉదయం 8 గంటలకు), చక్రస్నానం ( మధ్యాహ్నం 12.05 గంటలకు)

రాత్రి – హంస వాహనం( రాత్రి 8 నుండి 10 గంటల వరకు), ధ్వజావరోహణం(రాత్రి 10 గంటలకు)

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 8న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Products related to this article

 Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)

Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)

 Ganesha Idol on Brass Swing with Diyas (11 Inchs)..

₹3,000.00