Devotional

devotional

Subcategories

నవకైలాస క్షేత్రాలు చూశారా? హిందూ ధర్మంలో తొమ్మిదికి విశిష్ట స్థానం ఉంది. నవగ్రహాలు, నవ నందులు, నవ తిరుపతులు, ఇలా అనేక పుణ్యక్షేత్రాలు తొమ్మిది అంకెతో ముడిపడి ఉన్నాయి. అదే విధంగా నవ కైలాస క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ నవ కైలాస క్షేత్రాల్లో ప్రధాన దైవం ఆ పరమశివుడే. జీవితంలో ఒక్కసారైనా ఈ నవ క్షేత్రాలను సందర్శిస్తే, మోక్షం ఖచ్చితమని శైవధర్మాన్ని అనుసరించే వారి నమ్మకం. ఈ నేపథ్యంలో ఆ నవ కైలాస దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి. వాటి విశిష్టతలు ఏమి, తదితర వివరాలన్నీ మీ కోసం..ఈ నవ శైవ క్షేత్రాలను సందర్శిస్తే మోక్షమే.ఈ నవ కైలాస క్షేత్రాలకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. దీని ప్రకారం పూర్వం అగస్త్య మహాముని వ..
లలితా సహస్రనామాలకు పుట్టినిల్లు తిరుమీయచ్చూర్.తిరువారూర్ జిల్లాలో మైలాడుదురైకి 12 కి.మీ దూరంలో తిరుమీయచ్చూరు ఉంది. మైలాడుదురై నుంచి బస్సు సౌకర్యం ఉంది. పేరాలం నుంచి 2. కి.మీ, తిరువారూరు నుండి 25 కి.మీ, కుంభకోణం నుంచి 33 కి.మీ దూరంలో ఉన్న తిరుమీయచ్చూర్కి బస్సు లేదా టాక్సీలలో చేరుకోవచ్చు.తమిళనాడులోని తిరువారూర్ జిల్లా తిరుమీయచ్చూర్లోని లలితాంబికాదేవి దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతోంది. మేఘనాథస్వామి పేరుతో పరమేశ్వరుడు, లలితాంబిక పేరుతో పార్వతీదేవి ఇక్కడ కొలువైవున్నారు. లలితాంబిక కొలువైన ఆలయ ప్రాంగణం ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది...
సాధారణంగా దేవతార్చనలో మనం ఏదేవతను ఆరాధించినా సహస్రనామార్చన, అష్టోత్తర శతనామార్చన అన్నది విశేషంగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ నామాలు చెప్పడంలో అనేక ఆంతర్యాలున్నాయి. ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రము. ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఈనామాలన్నీ అర్థం చేసుకుంటే ఆ దేవతకు సంబంధించిన జ్ఞానం వస్తుంది. అందుకు ఆ దేవతా జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో నిబద్ధించి ఋషులు అందించారు. నామాల అర్థాలన్నీ కూడా మేళనం చేసి మనం చూస్తే ఆ దేవతకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానం అవగాహనలోకి వస్తుంది. అందుకు ఈ నామాలను ఋషులు అందించారు.    అంతేకాదు సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు ఇవి రెండూ అనంతత్త్వాన్ని తెలియజేసేటటువంటి నామాలు. అనంతమ..
ఈరోజు అట్ల తద్ది 19/10/2024సౌభాగ్యదాయిని ‘అట్లతద్ది’అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. ఉండ్రాళ్ళ తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు , ముత్తయిదువులు గోరింటాకు అందంగా అలంకరించుకుంటారు. మరునాడు వేకువ జామునే లేచి తలస్నానం చేసి , పూజా మందిరంలో పీఠమును పనుపు , కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో చేసిన గౌరీ దేవిని పూజిస్తారు. గంధం , పసుపు , పువ్వులతో పూజిస్..
ఆశ్వియుజ పూర్ణిమ :   ఆశ్వీయుజ పూర్ణిమకే 'శరత్ పూర్ణిమ' అని పేరు. అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. సాధారణంగా అందరూ దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమనాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువల్ల ఈరోజు చంద్రుడిని పూజిస్తే ఎంతో పుణ్యం. ఈ శరత్ పూర్ణిమ రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. ఈ కిరణాలు శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువల్ల చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చం..
అక్టోబరు 17న సత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలుసత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో అక్టోబరు 17వ తేదీ పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం అక్టోబరు 16వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.ఇందులో భాగంగా అక్టోబరు 17వ తేదీన ఉదయం 7.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాల..
తిరుమలలో కన్నుల పండుగగా ”భాగ్ సవారి”తిరుమల, 2024 అక్టోబరు 13: శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన ”భాగ్సవారి” ఉత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశ..
ధర్మరాజు దుర్గాస్తుతిపాండవుల వనవాసము పూర్తయి అజ్ఞాత వాసము చేయడానికి విరాటనగరం పొలిమేర చేరారు. ధర్మ రాజు ఆయుధాలను శమీ వృక్షముపైన భద్రపరచమని తమ్ములకు సూచించాడు. అజ్ఞాత వాసం విజయవంతంగా పూర్తిచేసి తమ రాజ్యాన్ని తిరిగి పొందేలా వరమీయమని దుర్గాదేవిని స్తుతించాడు ధర్మరాజు.పశు ప్రవృత్తిని రూపుమాపి ధర్మ స్థాపన చేయుటకు ఈ విశ్వం లో సనాతన స్త్రీ శక్తి మూర్తి అయిన దుర్గాదేవి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. సోదరులు, ద్రౌపది ముకుళిత హస్తాలతో ధర్మరాజును అనుసరించగా దుర్గామాతను ఈవిధంగా స్తుతించారు.చతుర్భుజే చతుర్వక్రేపీనశ్రోణి పయోధరే|మయూర పింఛవలయే కేయూరాఙ్గద ధారిణి||భాసిదేవి యథా పద్మానారాయణ పరిగ్రహః||స్వరూపం బ్..
రేపటి నుండి మూడు రోజులు   దేవి త్రిరాత్ర వ్రతం ప్రారంభం ,  ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అంటే ఏమిటి ?అమ్మ దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణా పారీణ. ఆ తల్లి అమృతహృదయ. ఆమె చల్లని చూపులకోసం అఖిలాండాలు ఎదురు చూస్తుంటాయ. అందుకే ఆరాధించడానికి తిథి వార నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వీయుజమాసాన వచ్చే శుద్ధ పాడమి మొదలుకుని నవమి వరకు ఆ తల్లిని కొలిచినవారికి కోటిజన్మలలోని పాపరాశి భస్మమవడమే కాదు తుదిలేని పుణ్యరాశి లభ్యవౌతుందట. అందుకే సజ్జను లందరూ ఈ జగాలనేలే జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వేయ్యి కనులతో ఎదురు చూస్తుంటారని అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని..
️ శ్రీ మహాలక్ష్మీ దేవి “లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగం ధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్థ విభవద్ర్చహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం” శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీ గా దర్శనమిస్తారు.కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని.  మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్న..
Showing 21 to 30 of 971 (98 Pages)