Devotional
devotional
Subcategories
ఆశ్వియుజ పూర్ణిమ :
ఆశ్వీయుజ పూర్ణిమకే 'శరత్ పూర్ణిమ' అని పేరు. అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. సాధారణంగా అందరూ దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమనాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువల్ల ఈరోజు చంద్రుడిని పూజిస్తే ఎంతో పుణ్యం. ఈ శరత్ పూర్ణిమ రోజున చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. ఈ కిరణాలు శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువల్ల చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చం..
అక్టోబరు 17న సత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలుసత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో అక్టోబరు 17వ తేదీ పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం అక్టోబరు 16వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.ఇందులో భాగంగా అక్టోబరు 17వ తేదీన ఉదయం 7.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాల..
తిరుమలలో కన్నుల పండుగగా ”భాగ్ సవారి”తిరుమల, 2024 అక్టోబరు 13: శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన ”భాగ్సవారి” ఉత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తి అయిన మరుసటిరోజు ”భాగ్సవారి” ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీఅనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారువారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షణ దిశ..
ధర్మరాజు దుర్గాస్తుతిపాండవుల వనవాసము పూర్తయి అజ్ఞాత వాసము చేయడానికి విరాటనగరం పొలిమేర
చేరారు. ధర్మ రాజు ఆయుధాలను శమీ వృక్షముపైన భద్రపరచమని తమ్ములకు సూచించాడు. అజ్ఞాత
వాసం విజయవంతంగా పూర్తిచేసి తమ రాజ్యాన్ని తిరిగి పొందేలా వరమీయమని దుర్గాదేవిని స్తుతించాడు
ధర్మరాజు.పశు ప్రవృత్తిని రూపుమాపి ధర్మ స్థాపన చేయుటకు ఈ విశ్వం లో సనాతన
స్త్రీ శక్తి మూర్తి అయిన దుర్గాదేవి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. సోదరులు, ద్రౌపది
ముకుళిత హస్తాలతో ధర్మరాజును అనుసరించగా దుర్గామాతను ఈవిధంగా స్తుతించారు.చతుర్భుజే చతుర్వక్రేపీనశ్రోణి పయోధరే|మయూర పింఛవలయే కేయూరాఙ్గద ధారిణి||భాసిదేవి యథా పద్మానారాయణ పరిగ్రహః||స్వరూపం బ్..
రేపటి నుండి మూడు రోజులు దేవి త్రిరాత్ర వ్రతం ప్రారంభం , ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అంటే ఏమిటి ?అమ్మ దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణా పారీణ. ఆ తల్లి అమృతహృదయ. ఆమె చల్లని చూపులకోసం అఖిలాండాలు ఎదురు చూస్తుంటాయ. అందుకే ఆరాధించడానికి తిథి వార నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వీయుజమాసాన వచ్చే శుద్ధ పాడమి మొదలుకుని నవమి వరకు ఆ తల్లిని కొలిచినవారికి కోటిజన్మలలోని పాపరాశి భస్మమవడమే కాదు తుదిలేని పుణ్యరాశి లభ్యవౌతుందట. అందుకే సజ్జను లందరూ ఈ జగాలనేలే జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వేయ్యి కనులతో ఎదురు చూస్తుంటారని అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని..
️ శ్రీ మహాలక్ష్మీ
దేవి “లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగం ధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ
వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్థ విభవద్ర్చహ్మేంద్ర గంగాధరాం త్వాం
త్రైలోక్యం కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం” శరన్నవరాత్రి
మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీ గా దర్శనమిస్తారు.కమలాలను రెండు
చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మీ
రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి. జగన్మాత మహాలక్ష్మీ
స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్న..
నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు:-1. శైలపుత్రి:-
ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే
''శైలపుత్రి''.2. బ్రహ్మచారిణి:-
నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో),
మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే "బ్రహ్మచారిణి" తత్వం.3. చంద్రఘంట:-
ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి
'త్రినేత్ర దృష్టి' ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే
"చంద్రఘంట".4. కూష్మాండ:-
విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే
"కూష్మాండ".5. స్కంద మాత:-
సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయ..
ఈ రోజు ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవి అలంకరణమూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు "ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీనారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీసాక్షాత్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీభిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ"కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది , కాశీ విశ్వనాధుడు. వీటితో
పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీ దేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలంద..
నవరాత్రులు సందర్భంగా ప్రతిరోజు ఈ నామాలు స్మరణ చేయండి1. సింహాసనేశ్వరీ 2. లలితా 3. మహారాజ్జీ4. పరాంకుశా (దీనికి మరికొన్ని పాఠాంత రాలలో వరాంకుశా కూడా ఉంది. ఏది అనుకున్నా తప్పులేదు.) 5. చాపినీ 6. త్రిపురా 7. మహాత్రిపురసుందరీ 8. సుందరీ 9. చక్రనాథ 10. సామ్రాజ్ఞి 11. చక్రిణీ 12.*చక్రేశ్వరీ* 13. మహాదేవీ 14.*కామేశీ* 15. పరమేశ్వరీ 16. కామరాజప్రియా, 17. కామకోటికా 18. చక్రవర్తినీ 19. మహావిద్యా 20. శివానంగవల్లభా 21. సర్వపాటలా 22. కులనాథా. 23. ఆమ్నాయనాథ 24.*సర్వామ్నాయనివాసినీ* 25. శృంగారనాయికా...
ఏడాదికి ఒకసారి ఈ విగ్రహానికి చెమటలు పడుతాయి అని తెలుసా?సిక్కర్ సింగరవేలన్ దేవాలయం హిందువులకు ప్రముఖ పుణ్యక్షేత్రం.మీరెప్పుడైనా దేవుడు విగ్రహానికి చమటలు పట్టడం చూశారా? ఒకవేళ లేదు అనేది మీ సమాధానమైతే తమిళనాడులోని సిక్కల్ సింగార్ వేలన్ దేవాలయానికి వెళ్లండి. అక్కడి మూలవిరాట్టు విగ్రహం నుంచి చమట వస్తుందని చెబుతారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం.రాక్షసరాజైన సురపద్మ అనే అతడు ప్రజలను, మునులను, దేవతలను తీవ్రంగా హింసించేవాడు. అతని ఆగడాలను సహించలేని ప్రజలు శివుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకొంటాడు. అతడి నుంచి తమను కాపాడమని విన్నవించుకొంటారు.అయితే శివుడు సురుపద్ముడికి వరం ఇచ్చినందువల్ల ఆ త్రినేత్ర..