Magamasam

Magamasam 

పరమపవిత్రం భీష్మాష్టమి

 

మాఘమాసంలో వచ్చే మాఘ శుద్ధ సప్తమి, రథసప్తమి మొదలుకొని ఏకాదశి వరకు అయిదు రోజులను 'భీష్మ పంచకం; అని అంటారు. రథసప్తమి మరుసటి రోజు అష్టమినే 'భీష్మాష్టమి' అని అంటారు. ఈ పుణ్య ఘడియల కోసం భీష్మాచార్యుడు 46 రోజులపాటు అంపశయ్య మీద ఉన్నాడు. యుద్ధ సమయంలో సంధ్యాసమయం దాటిపోతుందని అస్త్రాలను విడిచి నేలమీదకు దిగి ఇసుకనే జలధారగా స్వీకరించమని సూర్యునికి నమస్కరించి ఇసుకతో అర్ఘ్యం ఇచ్చి సంధ్యావందనం చేసిన మహా ధర్మాత్ముడు భీష్మాచార్యుడు. 

 

భీష్మ ఏకాదశి విశిష్టత ?

 

పగలుశుక్లపక్షంఉత్తరాయణం ఈ మూడు కాంతి మార్గాలు అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ తెలిపాడుమాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన రోజుభీష్మ పితామహుడు నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కాబట్టి ఈ రోజును భీష్మ ఏకాదశి అని తన పేరిట బహుమానంగా పొందిన పురాణ పురుషుడుభీష్మ పితామహుడు తన తండ్రి శంతన ద్వారా స్వచ్చంద మరణం వరాన్ని పొందాడు

Showing 11 to 12 of 12 (2 Pages)