In which Trees and Flowers Sri Laxmidevi stays

 లక్ష్మీదేవి ఏ చెట్లు, పువ్వులలో నివశిస్తుందో తెలుసా?

కొబ్బరి, అరటి, మామిడి, బిల్వ, బంతి, తులసిలలో నివశిస్తుంది. కొబ్బరి చెట్టుకి ఎటువంటి ప్రత్యేక పోషణలు తీసుకోవలసిన అవసరం ఉండదు. ఆ చెట్టు ఎటువంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది. అలాగే కొబ్బరిచెట్టులోని ప్రతి వస్తువు మానవాళికి ఉపయోగపడేదే. అరటిచెట్టు కూడా ఎంతో ఉపయుక్తమైనది. అరటి ఆకులో భోజనాలు, అరటిపళ్ళు, అరటికాయ, అరటిపువ్వు ఇలా అరటిచెట్టులో ఉపయోగపడేవి. ఇంట్లో ఎటువంటి దైవశుభాకార్యాలలో అయినా అరటిపండు లేకుండా ఉండడు. వసంతంలో వచ్చే మామిడిపూత లక్ష్మీపుత్రుడు అయిన మన్మథుడికి ఎంతో ప్రీతికరమైనది. మామిడి ఆకులతో ఇంటి వుమ్మాలకు తోరణాలు కడతాము. తులసీ దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం అనిపించుకోదు. గుమ్మాలకు బండిపువ్వుల మాలలను కట్టి శ్రీలక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాము. మరొక విశిష్టమైనది మారేడు పండు, మారేడు పండులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. పరమేశ్వరుడికి వెయ్యి కలువపువ్వులతో పూజ చేస్తానని శ్రీ మహాలక్ష్మీదేవి సంకల్పించుకుందట. పరమశివుడు లక్ష్మీదేవి భక్తిని పరీక్షించదలచి ఒక పువ్వును మాత్రమే స్వీకరించాడట. లక్ష పువ్వులలో ఒక పువ్వు తక్కువ అయిందని గ్రహించిన లక్ష్మీదేవి ఒక్క పువ్వు కోసం భూలోకంమంతా వెతికినా ఎక్కడా దొరకలేదట. అప్పుడు లక్ష్మీదేవి తన స్తానాన్ని కలువ పువ్వుగా సమర్పించదలచిందట. ఆమె సాహసానికి సంతుష్టుడైన పరమశివుడు అమ్మవారి స్తనాన్ని మారేడుపండుగా మార్చి తనకి మారేడు పత్రాలతో పూజ చేస్తే ప్రీతి పొందుతాను అని తెలిపాడట.

 

 

Products related to this article

Little Krishna Accessories

Little Krishna Accessories

Little Krishna Costume Accessories'The set includes the fallowing Items: Fancy Crown,Flute, Necklace,Peacock feather,Waist belt andWrist bandsAccessories like flute and waistbelts are available i..

₹701.00

0 Comments To "In which Trees and Flowers Sri Laxmidevi stays "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!