ఉదయ కుంకుమ నోము
పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడికి నలుగురు కుమార్తెలు ఉండేవారు. ఆ బ్రాహ్మణుడు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయగా వారి భర్తలు చనిపోయి వాళ్ళు విధవరాళ్ళు అయ్యారు. కుమార్తెలను చూసి ఆ బ్రాహ్మణ దంపతులు బాధపడుతూ ఉండేవారు. ఈ లోపల చిన్న కుమార్తె ఉక్తవయస్కురాలు అయింది. ఆమెకు వివాహం చేయాలని ఉన్నా ఆ పిల్ల అక్కలకు ప్రాప్తించిన వైధవ్యం ఈమెకు కూడా వైధవ్యం పోతుందేమో అని పాధపడుతూ ఉండేవాళ్ళు. ఆ బ్రాహ్మణుడు నిరంతరం భగవంతుడిని తలచుకుంటూ ఈ బిడ్డను అయినా సుమంగళిగా ఉంచమని మొరపెట్టుకునేవాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడికి గౌరీదేవి కలలో కనిపించి నీవు నీ కుమార్తె చేత ఉదయ కుంకుమ నోము నోయించు అని చెప్పింది. ఆమె మాటలలో నమ్మకం కలిగి అలా చేయడం వలన తమ కుమార్తెకు వైధవ్యం తొలగిపోతుండానే నమ్మకం కలిగిన ఆ దంపతులు తమ ఆఖరి కుమార్తె చేత ఉదయ కుంకుమ నోమును నోయించారు. వ్రత ప్రభావం వలన ఆమెకు పూర్ణాయుష్కుడైన, అందమైనవాడు భర్తగా లభించాడు. ఈ ఉదయ కుంకుమ నోముని నోచుకుని గౌరీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించిన వారికి మాంగళ్యం, సిరిసంపదలు ప్రాప్తిస్తాయి. ఈ నోముకు ఉద్యాపన ఇలా చేయాలి … సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి బొట్టూకాటుక పెట్టుకుని పసుపు గౌరీదేవిని చేసి ఫల, పుష్పాలతో, ధూపదీప నైవేద్యాలతోనూ పూజించాలి. పూజ పూర్తయిన తరువాత ఒక ముత్తైదువకు గౌరీదేవి పేరుమీద పసుపు పువ్వులు, రవికెల గుడ్డ, తాంబూలం ఇచ్చి ఆమె ఆశీస్సులు పొందాలి. ఈ ఉదయ కుంకుమ నోము కన్నెపిల్లలు చేసుకుని తీరవలసిన నోములు.
Note: HTML is not translated!