March 2016
ఉదయ కుంకుమ నోము
పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడికి నలుగురు కుమార్తెలు ఉండేవారు. ఆ బ్రాహ్మణుడు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయగా వారి భర్తలు చనిపోయి వాళ్ళు విధవరాళ్ళు అయ్యారు. కుమార్తెలను చూసి ఆ బ్రాహ్మణ దంపతులు బాధపడుతూ ఉండేవారు.
శరత్పూర్ణిమ నోము
శరత్ ఋతువు మొదలయిన (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి)నాడు నోము పట్టాలి. ఆరుబయట చంద్రకాంటిలో వెండితో చేసిన అమ్మవారి ప్రతిమను అర్చించి, ఆనాటి చంద్రకళవంటి వెండి ప్రతిమను, బియ్యాన్నీ, తెల్లని వస్త్రన్నీ, ఒక ముత్యాన్నీ, దక్షిణ తాంబూలాలతో ఒక ఆకర్షణీయమైన బ్రాహంన ముత్తైదువకు వాయనం ఇవ్వాలి.
సంతానం కోసం రేగుపళ్ళ నోము
పూర్వకాలం నుండి హిందూ సాంప్రదాయాలలో వ్రతాలు నోములు చేయడం జరిపించడం జరిపించడం తరతరాలుగా వస్తుంది. దీనిలో ముఖ్యంగా సంతానం కోసం అనేక నోములు వ్రతాలు చేస్తుంటారు. సంతానం కోసం ప్రత్యేకమైనది రేగులనోము.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజునకు అధిష్టాన దైవం....
సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.
ఉమా మహేశ్వర వ్రతం
గణపతి పూజ:
ఓం శ్రీగురుభోన్నమః మహాగణాదిపతయే నమః, మహా సరస్వతాయే నమః హరిహిఓమ్, దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నువష్టుతైతు! అయంముహూర్త సుమోహుర్తోఅస్తూ!! యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగాళా! తయోసంస్మర నాత్పుమ్సాం సర్వతో జయమంగళం!!
శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
శివరాత్రి నోము
పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతను ఎంతటి విద్యాసంపన్నుడో అంతటి దారిద్ర్యం అతన్ని వేధిస్తూ ఉండేది. ఎంత ప్రయత్నించినా చేతికి నయాపైసా లభించేది కాదు. దీనితి తోడు అతడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రమే. ఈ దుర్భర పరిస్థితులలో మరొకరిని యాతన పెట్టడం ఇష్టం లేక వివాహం కూడా చేసుకోలేదు.
పంచాక్షరి మంత్రం ప్రాముఖ్యత?
శివపంచాక్షరీ మంత్రంలోని ఐదు బీజాక్షరాలు 'న-మ-శి-వా-య' లో నుండి పంచభూతాలు, వాటి నుండి సమస్త జగత్తు పుట్టిందని పురాణాలలో తెలియజేయడమైంది.
దిశ పేరు మండలం బీజాక్షరం నిర్వహణ
ఏ లింగాలను పూజిస్తే ఏమి ఫలితం?
త్రిమూర్తులలో శివుడికి అత్యంత ప్రీతికరమైనది లింగార్చన, లింగ అభిషేకం. శివలింగాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటికి అర్చిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది.
వజ్రలింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.
ముత్యం లింగానికి అర్చన చేస్తే రోగాలు నశిస్తాయి.
శ్రీ శంకరాచార్య విరచిత శివపంచాక్షర నక్షత్రమాలా స్తోత్రమ్
శ్రీ ఆదిశంకరాచార్యులవారు ఈ స్తోత్రములోని అన్ని శ్లోకాలలో నాలుగు పాదములలో చివర శివపంచాక్షరమంత్రము ఏర్పరిచారు. ఇందులో స్తోత్రముతో కలిసి ఉచ్చరించిన శివస్తుతితో పాటు శివపంచాక్షరమంత్రము 332 సార్లు జపించినట్లు అవుతుంది.
శ్రీమదాత్మనే గుణైకసింధవే నమః శివాయ
ధామలేశ ధూతకోకబంధవే నమః శివాయ