తోర పూజ
తోరము అమ్మవారి వద్ద వుంచి అక్షలతో ఈ విధంగా పూజించాలి
కమలాయై నమః ప్రథమగ్రంధిం పూజయామి
రమాయై నమః ద్వితీయగ్రంధిం పూజయామి
లోకమాత్రే నమః తృతీయగ్రంధిం పూజయామి
విశ్వజనైన్య నమః చతుర్థగ్రంధిం పూజయామి
వరలక్ష్మై నమః పంచమగ్రంధిం పూజయామి
క్షేరాబ్దితనయాయ నమః షష్టమగ్రంధిం పూజయామి
విశ్వసాక్షినై నమః సప్తమగ్రంధిం పూజయామి
చంద్రసహోదరై నమః అష్టమగ్రంధిం పూజయామి
వరలక్ష్మై నమః నవమగ్రంధిం పూజయామి
శ్లోకాన్ని చదువుతూ తోరణాన్ని కుడిచేతికి కట్టుకోవాలి
శ్లో బాధ్మామి దక్షిణే హస్తే నమసూత్రం శుభప్రదం !
పుత్రపౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే !!
వాయన దానం : వాయనం ఇస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతూ వాయనం ఇవ్వాలి
వాయనం అంటే : ముత్తైదువులకు పసుపు కుంకుమ, జాకెట్టు గుడ్డ, దక్షిణ, పళ్ళు, పుస్తకం పళ్ళెంలో పెట్టి దానం ఇవ్వాలి
శ్లో ఇందిరా ప్రతిగ్రుహ్యాతు ఇందిరా వై దదాతి చ !
ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమోనమః !!
ఈ శ్లోకంతో వాయనం ఇచ్చి అక్షతలు తీసుకుని వ్రత కథను చదవాలి
వరలక్ష్మీవ్రత పూజావిధానం | ఇక్కడ క్లిక్ చేయండి - వరలక్ష్మి వ్రతకథ |
Note: HTML is not translated!