సూర్యగ్రహణం
ఆశ్వయుజ బహుళ అమావాస్య అనగా ది . 25.10.2022 వ తేదీ మంగళవారం సాయంత్రం
కేతు గ్రస్త , కృష్ణ వర్ణ , పాక్షిక సూర్యగ్రహణం
స్పర్శ కాలం (పట్టు) సాయంత్రం గం 05 : 02 ని//లు
మధ్య కాలం సాయంత్రం గం 05 : 33 ని//లు
మోక్షకాలం (విడుపు) సాయంత్రం గం 06 : 32 ని//లు(కనిపించదు)
గ్రహణం ఆద్యంతపుణ్యకాలం గం 00 : 31 ని//లు
01) ఈ గ్రహణం స్వాతి నక్షత్రం మరియు తులా రాశినందు సంభవించుచున్నది కావున స్వాతి నక్షత్ర జాతకులు మరియు తులా రాశివారు గ్రహణం
చూడరాదు అలాగే గ్రహణ అనంతరం యధావిధిగా గ్రహణ శాంతి చేసుకొనవలెను.
02) శుద్ధ మోక్షమైన తరువాత విడుపు స్నాన మాచరించి ప్రత్యాబ్దికమును పెట్టవలెను అలాగే నిత్యభోజనాదులు మధ్యాహ్నం 12 గంటలలోపు పూర్తి చేయుట మంచిది .
గ్రహణశాంతి
స్వాతి నక్షత్ర జాతకులు మరియు తులా రాశి వారు జన్మ రాశి , జన్మ నక్షత్ర గ్రహణ దోష నివృత్యర్ధం శుభఫల ప్రాప్తికొరకు బంగారంతో సూర్యబింబాన్ని ,
వెండిచే నాగబింబాన్ని చేయించి కేజీ గోధుమలు, కేజీ ఉలవలు,వస్త్రము,దక్షిణ,నేతితో నింపిన రాగి పాత్రతో దానమీయవలెను ఈ విధంగా చేయలేనివారు
మహాన్యాస పూర్వక ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం చేయించిన గ్రహణశాంతి కలుగగలదు.
గ్రహణ గోచారం
01) ధనుస్సు – మకరం – వృషభం - సింహం రాశులవారికి శుభఫలం
02) కుంభం – మేషం – మిధునం - కన్య రాశులవారికి మద్యమఫలం
03) తులా – వృశ్చికం – మీనం - కర్కాటకం రాశులవారికి అధమఫలం