ఈ రోజు 16-11-2022 బుధ అష్టమి



బుధ అష్టమి అనునది హిందువులకు అతి పవిత్రమైనది. ఈ అష్టమి అనగా 8 వ తిథి , శుక్ల పక్షమున గాని , కృష్ణ పక్షమున గాని , బుధవారము నాడు సంభవించినచో   ఆ అష్టమిని “బుధాష్టమి” అని అంటారు.ఈ బుధాష్టమి పరమ శివుని పూజకు , అమ్మ పార్వతి దేవి పూజకు మిక్కిలి శ్ఱేష్టము. ఈ దినమున భక్తులు మిగుల భయ భక్తులచే పార్వతి , పరమేశ్వరులను ఆరాదించెదరు. 

మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారము , ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసము ఉండి , శివారాధన , పార్వతిదేవి ఆరాధన చేస్తారో , అట్టి వారు , వారి మరణానంతరం నరకమునకు పోవరట. ఈ బుధాష్టమి వ్రతము సలుపు వారు స్వచ్చమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితంలో సకాల అభివృద్ధి పొందుతారు. 


ఈ బుదాష్టమి వ్రతమును ఉత్తర దేశమున , అనగా గుజరాత్ యందును , మహారాష్ట్ర యందును ఎక్కువగా ఆచరిస్తారు.


బుధాష్టమి వ్రత విధానము:

ఈ దినమున అనగా బుదాష్టమి నాడు భక్తులు నవగ్రహాలలో ఒకడైన బుదుడిని ఆరాదించి , ఆయన అనుగ్రహమును పొందుతారు. ఈ దినము భక్తులు ఉపవాసముండి బుదుడికి ప్రత్యేక నైవేద్యమును నివేదించుతారు. వ్రత పూజ పిదప ఆ ప్రసాదమును మాత్రము తీసుకొన వలయును. ఈ వ్రతమునకై బుధ విగ్రహము కానీ , బంగారు , వెండి కాసులో చిత్రీకరీంచిన బుధరూప కాసు ను కానీ , ఉపయోగించెదరు. ఈ బుధుడి ముందు నీటితో నింపిన కలశమును పెట్టి కొబ్బరి బోండామును ప్రతిష్టించెదరు. పిదప భయ భక్తులచే వివిధ పూజలను చేసి , ఆ నైవేద్య ప్రసాదమును అందరికీ పంచి ఇస్తారు.ఈ వ్రతము ప్రారంబించినవారు వరుసగా 8 మార్లు ఆచరించవలెను. 


ఈ విధముగా ఆచరించిన పిదప , కడపటి బుధాష్టమి నాడు నీరు పేదలకు , భోజనాలు పెట్టి , తోచిన వస్త్ర దానం చేయవలెను. వారికి నెలకు సరిపడ బియ్యం , నూనె , పప్పులు దానము చేయవలెను , ఈ విధముగా బుధ అష్టమి వ్రతమును చేసిన వారికి , వారి సకల దోషములు తోలగి , పుణ్యం లభించి నరక లోకమునకు పోక కైవల్య ప్రాప్తి పొందుతారు. 

కొందరు ఈ దినమున శివ పార్వతులకు పూజలు కూడా నిర్వహిస్తారు.


ఈ బుధాష్టమి విశిష్టత:


ఈ బుధాష్టమి యొక్క విశిష్టత బ్రహ్మాండ పురాణము నందు వివరింప బడివున్నది. ఈ వ్రతం చేసిన వారికి ప్రస్తుత , పూర్వ , జన్మ పాపముల నుండి విముక్తి లభించును. శివ , పార్వతి ఆరాధన ఈ బుధాష్టమి నాడు చేసిన అంతటి ఫలితం లభించును. ఈ వ్రతమాచరించిన వారికి బుధ గ్రహ దోషములు నివారింపబడి , బుధ గ్రహ బాధలనుండి విముక్తి లభించును.


శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం


బుధో బుధార్చితః సౌమ్యః సౌమ్యచిత్తః శుభప్రదః

దృఢవ్రతో దృఢబలః శ్రుతిజాలప్రబోధకః || ౧ ||


సత్యవాసః సత్యవచాః శ్రేయసాంపతిరవ్యయః

సోమజః సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః || ౨ ||


వేదవిద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞానభాస్వరః

విద్యావిచక్షణ విభుర్ విద్వత్ప్రీతికరో బుధః || ౩ ||


విశ్వానుకూలసంచారీ విశేషవినయాన్వితః

వివిధాగమసారజ్ఞో వీర్యవాన్ విగతజ్వరః || ౪ ||


త్రివర్గఫలదోఽనంతః త్రిదశాధిపపూజితః

బుద్ధిమాన్ బహుశాస్త్రజ్ఞో బలీ బంధవిమోచకః || ౫ ||


వక్రాతివక్రగమనో వాసవో వసుధాధిపః

ప్రసాదవదనో వంద్యో వరేణ్యో వాగ్విలక్షణః || ౬ ||


సత్యవాన్ సత్యసంకల్పః సత్యబంధుః సదాదరః

సర్వరోగప్రశమనః సర్వమృత్యునివారకః || ౭ ||


వాణిజ్యనిపుణో వశ్యో వాతాంగీ వాతరోగహృత్

స్థూలః స్థైర్యగుణాధ్యక్షః స్థూలసూక్ష్మాదికారణః || ౮ ||


అప్రకాశః ప్రకాశాత్మా ఘనో గగనభూషణః

విధిస్తుత్యో విశాలాక్షో విద్వజ్జనమనోహరః || ౯ ||


చారుశీలః స్వప్రకాశః చపలశ్చ జితేంద్రియః

ఉదఙ్ముఖో మఖాసక్తో మగధాధిపతిర్హరః || ౧౦ ||


సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకరః సుఖీ

సింహాధిరూఢః సర్వజ్ఞః శిఖివర్ణః శివంకరః || ౧౧ ||


పీతాంబరో పీతవపుః పీతచ్ఛత్రధ్వజాంకితః

ఖడ్గచర్మధరః కార్యకర్తా కలుషహారకః || ౧౨ ||


ఆత్రేయగోత్రజోఽత్యంతవినయో విశ్వపావనః

చాంపేయపుష్పసంకాశః చారణః చారుభూషణః || ౧౩ ||


వీతరాగో వీతభయో విశుద్ధకనకప్రభః

బంధుప్రియో బంధముక్తో బాణమండలసంశ్రితః || ౧౪ ||


అర్కేశానప్రదేశస్థః తర్కశాస్త్రవిశారదః

ప్రశాంతః ప్రీతిసంయుక్తః ప్రియకృత్ ప్రియభాషణః || ౧౫ ||


మేధావీ మాధవాసక్తో మిథునాధిపతిః సుధీః

కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః || ౧౬ ||


బుధస్యైవం ప్రకారేణ నామ్నామష్టోత్తరం శతమ్ ||


బుధ కవచం


అస్య శ్రీబుధకవచస్తోత్రమంత్రస్య , కశ్యప ఋషిః ,

అనుష్టుప్ ఛందః , బుధో దేవతా , బుధప్రీత్యర్థం జపే వినియోగః |

అథ బుధ కవచమ్

బుధస్తు పుస్తకధరః కుంకుమస్య సమద్యుతిః |

పీతాంబరధరః పాతు పీతమాల్యానులేపనః || 1 ||

కటిం చ పాతు మే సౌమ్యః శిరోదేశం బుధస్తథా |

నేత్రే ఙ్ఞానమయః పాతు శ్రోత్రే పాతు నిశాప్రియః || 2 ||

ఘ్రాణం గంధప్రియః పాతు జిహ్వాం విద్యాప్రదో మమ |

కంఠం పాతు విధోః పుత్రో భుజౌ పుస్తకభూషణః || 3 ||

వక్షః పాతు వరాంగశ్చ హృదయం రోహిణీసుతః |

నాభిం పాతు సురారాధ్యో మధ్యం పాతు ఖగేశ్వరః || 4 ||

జానునీ రౌహిణేయశ్చ పాతు జంఘే ??ఉఖిలప్రదః |

పాదౌ మే బోధనః పాతు పాతు సౌమ్యో ??ఉఖిలం వపుః || 5 ||

అథ ఫలశ్రుతిః

ఏతద్ధి కవచం దివ్యం సర్వపాపప్రణాశనమ్ |

సర్వరోగప్రశమనం సర్వదుఃఖనివారణమ్ || 6 ||

ఆయురారోగ్యశుభదం పుత్రపౌత్రప్రవర్ధనమ్ |

యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్ || 7 ||



ఇతి శ్రీబ్రహ్మవైవర్తపురాణే బుధకవచం సంపూర్ణమ్