Sri Ramalingeswara Swamy temple,Keesaragutta temple


హైదరాబాద్‌ నగరానికి 30కిలో మీటర్ల దూరంలోని ఈ ఆలయం పురాతనమైనదిగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది.  ఈ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట 


సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేతుల మీ దుగా మలిచిన ఆ పరమ శివుడు ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.


క్షేత్ర పురాణం..


బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించిన అనంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయల్దేరాడు. బ్రాహ్మణ హత్యా పాపాన్ని పోగుట్టుకునేందుకు రుషుల సూచనల మేరకు శ్రీరాముడు పలు ప్రాంతాల్లో శివలింగ ప్రతిష్ఠాపనలు చేయ సం కల్పిస్తాడు. శ్రీరాము డు ఈ ప్రాంతం గుండా వెళ్తూ.. ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్దుడై ఇ క్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకుని ముహూర్తంపై మహర్షులను కోరాడు. శివలింగాన్ని కాశి నుంచి తే వాల్సిందిగా శ్రీరాముడు హనుమంతుడిని ఆజ్ఞాపించాడు. అక్కడికి వెళ్లిన హనుమంతుడికి ఈశ్వరుడు నూటొక్క శివలింగాల రూపంలో దర్శనమిచ్చాడు.


హనుమంతుడు వాటిల్లో దేన్నీ ఎంచుకోలేక పరమేశ్వరుడిని ప్రార్థించి నూ టొక్క లింగాలతో ఆకాశ మార్గాన కీసరగుట్టకు బయల్దేరా డు. మహర్షులు నిర్ణయించిన ముహుర్తానికి హనుమంతు డు రాకపోవడంతో సీతారామచంద్రులు పరమశివుడిని ప్రార్థించారు. వారికి పరమేశ్వరుడు శివలింగరూపంలో ద ర్శనమివ్వగా సీతారామంచంద్రులు ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువల్లనే శ్రీరామలింగేశ్వస్వా మి ఆలయంగా పేరు వచ్చింది. ఇంతలో హనుమంతుడు నూటొక్క శివలింగాలతో వచ్చాడు. స్వామీ.. వీటిలో మీకు కావాల్సిన శివలింగాన్ని ప్రతిష్ఠించండి. మిగతా వాటిని కా శీలో యథా స్థానంలో ఉంచి వస్తా. అని రాముడితో  అనగా.. హనుమా.. నీ రాక ఆలస్యమవడంతో పరమేశ్వరున్ని ప్రార్థించాను. స్వామి లింగరూపుడుగా ప్రత్యక్షం  కాగా ప్రతిష్ఠించాను. అని శ్రీరాముడు హనుమంతునికి  చెప్పాడు. తాను తెచ్చిన శివలింగాల్లో ఏ ఒక్కటీ నా స్వా మికి ఉపయోగపడలేదనే కోపంతో హనుమంతుడు నూటొక్క శివలింగాలను తన తోకతో చుట్టి విసిరేశాడు.  అవి ఈ పరిసరాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. అప్పుడు రా ముడు హనుమంతుడిని శాంతిపజేసి ఈ క్షేత్రం ఇప్పటి నుంచి ఆ చంద్రతారార్కం నీ పేరుతో కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుంది. అని వరమిచ్చాడు. క్షేత్రపాలకుడుగా మారి న హనుమంతుడు తాను విసిరిన శివలింగాల్లో ఒకదాన్ని స్వామి వారి వామ భాగంలో ప్రతిష్ఠించాడు. దాన్నే ఇప్పు డు మారుతీ కాశీవిశ్వేశ్వర ఆలయం అంటున్నారు..


మహిమగల రామలింగేశ్వరుడు..కీసరగుట్టలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం పశ్చి మ అభిముఖంగా ఉండటం ఇక్కడ విశేషం. గర్భాలయంలోని మూల విరాట్టుకు నిత్యం భక్తులు పాలు, పెరుగు, పంచామృతాలు, శుద్ధ జలంతో చేసే అభిషేక పదార్థాలు స్వామివారి కుడి భాగం వైపునకు వెళ్తాయి. ఈ పదార్థాలన్నీ ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికీ ఎవ్వరికి తెలియదు.

ఇది మహా శివుడిని స్మరించే గొప్ప మంత్రం సృష్టిలో ముఖ్యమైన దేవుళ్లైన  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన  అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు. 


ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి  చాలా ప్రత్యేకమైనది. హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు. శివ భక్తులు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడిని ఓం నమః శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు.

ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల.. శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. ఆధ్యాత్మిక వేత్తలు సూచిస్తున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత, మానసిక సంతోషం కలుగుతుంది. 

అంతేకాదు శివ భక్తులు వీలైనప్పుడల్లా  ఓం నమః శివాయ అని స్మరించుకుంటూ ఉంటే.. అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చట. మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..


వాస్తవాలు


ఓం నమః శివాయ అనే మంత్రంలో న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాలున్నాయి. 

ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి, నీళ్లు, అగ్ని, గాలి, విశ్వాన్ని సూచిస్తాయి.


స్మరణ


యజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు.ప్రయోజనాలు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధా భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంత