మాఘ మాసం శ్యామలాదేవి నవరాత్రులు 2023 జనవరి 22న ప్రారంభమై జనవరి 30న ముగుస్తాయి..వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజ గోప్యంగా చేసుకోవాలి..
సాధారణంగా ప్రతి సంవత్సరం మనకు హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగు నవరాత్రులు వస్తుంటాయి..అవి ఏవిటంటే..
1. మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు.
2. ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు.
3. ఆషాడ మాసంలో వారాహి నవరాత్రులు.
4. చైత్రమాసంలో వసంత నవరాత్రులు.
ఈ 2023 వ సంవత్సరంలో మాఘమాసం మనకి జనవరి 22 శుద్ధ పాఢ్యమి ఆదివారం నాడు ప్రారంభమై, ఫిబ్రవరి 20 అమావాస్య సోమవారం నాడు ముగుస్తుంది. శ్యామలా నవరాత్రులను మాఘమాస శుద్ధ పాఢ్యమి నుండి నవమి వరకు 9 రోజులపాటు జరుపుకుంటారు..
ఈ సంవత్సరం శ్యామలా నవరాత్రులు జనవరి 22 ఆదివారం మాఘశుద్ధ పాఢ్యమి తిథితో ప్రారంభమై, జనవరి 30 సోమవారం మాఘశుద్ధ నవమి తిథితో ముగుస్తాయి.
మొదటి రోజు "జనవరి 22, ఆదివారం" నాడు అమ్మవారిని "లఘు శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
రెండవ రోజు "జనవరి 23, సోమవారం" నాడు అమ్మవారిని
"వాగ్వాధినీ శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
మూడోరోజు "జనవరి 24 , మంగళవారం" నాడు అమ్మవారిని "నకుల శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
నాల్గవ రోజు "జనవరి 25, బుధవారం" నాడు అమ్మవారిని "హాసంతి శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
ఐదవ రోజు "జనవరి 26, గురువారం" నాడు అమ్మవారిని "సర్వసిద్ధి మాతంగి" రూపంలో పూజిస్తారు.
ఆరవ రోజు "జనవరి 27, శుక్రవారం" నాడు అమ్మవారిని "వాస్యమాతంగి" రూపంలో పూజిస్తారు.
ఏడవ రోజు "జనవరి 28, శనివారం" నాడు అమ్మవారిని "సారికా శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
ఎనిమిదవ రోజు "జనవరి 29, ఆదివారం" నాడు అమ్మవారిని "శుక శ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
తొమ్మిదవ రోజు "జనవరి 30, సోమవారం" నాడు అమ్మవారిని "రాజమాతంగి లేదా రాజశ్యామలాదేవి" రూపంలో పూజిస్తారు.
శ్యామలాదేవికి నిత్యపూజాతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశోపచార నామాలతో కుంకుమార్చన చేసుకోవాలి. వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయ కవచం, సహస్రనామాలు మొదలగువాటిని పారాయణ చేస్తు పూజలు చేసుకోవాలి.ఎరుపు రంగు పూవులతో అమ్మవారికి అలంకరణ చేసి , పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి..వీలైతే ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి..
శ్రీ మాత్రే నమః