అవతారం అంటే ఏమిటి..?


విష్ణువు రాముని గా భూమిపై అవతరించాడని అంటారు కదా!, మరి రామునిగా భూమిపై ఉన్న ఆ కాలం లో వైకుంఠమ్ లో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా?అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు. దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశు పక్షి మనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని అనేక మతాలవారి నమ్మకం. 


విష్ణువు మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తెనని హిందువులు, పరమ విజ్ఞానము బుద్ధుడుగానూ, బోధిసత్వులుగానూ అవతారమెత్తిందని బౌద్ధులు, ఈశ్వరుని రెండవ అంశగా చెబుతారు

ఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం.ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుండు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం. ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం.ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్షణ చేయటం చాలామటుకు అవతారకథల ప్రధాన ఇతివృత్తం.


అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలేదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చు.ప్రస్తుతం మనం రామునిగా విష్ణువు అవతరించాడు కదా! మరి అవతార పరిసమాప్తి అయ్యేంత వరకు వైకుంఠమ్ లో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా? అని కదా తెలుసుకోవాలనుకుంటున్నాము..... ఈ విషయం తెలుసుకొనే ముందు ఒక ఉదాహరణ పరిశీలిద్దాము...ఉదాహరణకు పది సమానమైన ప్రమిదలు లో సమానమైన వత్తులు నింపి, సమానమైన నూనె పోసి ఒక ప్రమిదను వెలిగించి, 


ఆ ప్రమిద తో మిగిలిన ప్రమిదలు వెలిగించి ఆ ప్రమిదల వరుసలలో పెట్టి; వేరొకరిని …; ఈ ప్రమిదల వరుసలోని ఏ ప్రమిద తో నేను దీపం వెలిగించానో చెప్పగలవా అంటే ఆ వ్యక్తి చెప్పగలడా!.... ఆ వ్యక్తే కాదు ఏ వ్యక్తి కూడా చెప్పలేడు; కారణం మిగిలిన ప్రమిదలను వెలిగించిన తొలి ప్రమిద వెలుగు తగ్గిపోదు; మిగిలిన ప్రమిదల వలె ప్రకాశిస్తుంది...కాని ఆ మిగిలిన ప్రమిదలకు తెలుసు; తనను వెలిగించిన ఆ దీపం ఏదో....

ఆధునిక శాస్త్ర పరిశోధనల లో ని ‘క్లోనింగ్’ ప్రక్రియ గురించి మనకు అందరికీ తెలుసు కదా!.... అలాగే నారాయణుడు అవసరమైనప్పుడు తన కు ప్రతి రూపమైన అవతారాన్ని భూమిపైన అవతరింప జేస్తూ ఉంటాడు.


విష్ణువు ఎన్ని అవతారాలు ఒకేసారి ఎత్తినా; విడి విడి గా ఎత్తినా తన అస్తిత్వం కోల్పోడు; తన అసలు రూపం తో వైకుంఠమ్ లో దర్శన మిస్తూనే ఉంటాడు... విష్ణువు నుండి ఉద్బవించిన ఈ అవతారములు తమ అవతార పరిసమాప్తి చెందిన తరువాత తమ మూల అవతారమైన శ్రీమన్నారాయణుడి లో (విష్ణువు ) లో ఐక్య మందుతాయి... ఒకసారి ఐక్య మందినా కూడా భక్తుల కోరిక మేరకు మరల, మరల అవే రూపాలతో అవసరమైనప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయి.

ఈ విధంగా అయ్య గారే (విష్ణు మూర్తే) కాకుండా; అమ్మగారు కూడా ( లక్ష్మి దేవి), భూలోకం పై అవతరించారు; అవతరిస్తారు. 

అలాగే శివ పార్వతులు, మిగిలిన దేవతలు సందర్భాన్ని బట్టి భూలోకం పై అవతరిస్తూ ఉంటారు.