శఠగోపము , తీర్ధం ఎలా తీసుకోవాలి?
చాలామంది గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు. తీర్థానికి కాని, శఠగోపానికి కాని ప్రాధాన్యం ఇవ్వరు. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం, శఠగోపం తప్పక తీసుకోవాలి.
చాలామంది దేవుడ్ని దర్శనం చేసుకున్నాక వచ్చిన పనై పోయిందని చక చకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి, శఠగోపం పెట్టించుకుంటారు.
శఠగోపం అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే శఠగోపం. మానవునికి శత్రు వులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇకనుండి దూరముగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.
సహజంగా చిల్లర లేకపోవటం వల్ల శఠగోపంను ఒక్కోసారి వదిలేస్తుంటాం. ప్రక్కగా వచ్చేస్తాం. అలా చెయ్యకూడదు.పూజారి చేత శఠగోపం పెట్టించుకొని, మనసు లోని కోరికను స్మరించుకోవాలి.
ఈ శఠగోపంను రాగి, కంచు, వెండిలతో తయారుచేస్తారు. పైన విష్ణుపాదాలుంటాయి. ఈ శఠగోపమును తలమీద ఉంచినపుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగి లినపుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్ బైటికెళుతుంది. తద్వారా శరీరంలో ఆందోళనా, ఆవేశమూ తగ్గుతాయి.
#తీర్ధం ఎలా తీసుకోవాలి?
మనం గుడిలో పూజారి తీర్ధమిచ్చినప్పుడో ,లేదా ఇళ్లలో పూజలు,వ్రతాలు చేసినప్పుడో తీర్ధం తీసుకుంటూ ఉంటాము.చాలామంది తీర్ధం తీసుకున్నాకాచేతిని తలకు రాసుకుంటారు.నిజానికి తీర్ధం ఎలా తీసుకోవాలి? తీర్ధం తీసుకునే విధానం ఇది.
ముందుగా ఒక వస్త్రాన్ని నాలుగు మడతలుగా చేసి,ఎడమ చేతి మీద వేసుకోవాలి ,కుడిచేతిని దాని మీద ఉంచి ,తీర్ధాన్ని మూడు సార్లు తీసుకోవాలి.ఒక్క చుక్క కూడా కింద పడకుండా తీర్ధాన్ని తీసుకోవాలి.ఒక చుక్క కింద పడినా అంతకు ఎనిమిది రెట్లు పాపం చుట్టుకుంటుంది.తీర్ధమిచ్చే సమయంలో ముందుగా తాను తీసుకొని తరువాత ఇతరులకు ఇవ్వాలి.
తీర్ధాన్ని మూడుసార్లు తీసుకోవడానికి కారణం...మొదటిది ఆధ్యాత్మికం, రెండవది అధిభౌతికం,మూడవది అధిదైవికం .
తీర్ధాన్ని తీసుకునే సమయంలో గుడిలో అయితే నిలబడి తీసుకోవాలి.ఇంట్లో అయితే కూర్చుని తీసుకోవాలి.తీర్ధం తీసుకున్న తరువాత చేతిని తలకు తుడుచుకోకూడదు. బట్టకు తుడుచుకోవాలి.(ఉచ్చిష్టం అంటే ఎంగిలి కనుక).