Srisailam Maha Shivratri Brahmotsavam

శ్రీశైలం పుణ్య క్షేత్రం నందు శ్రీ భ్రమరాంబికదేవీ సమేత  శ్రీ మల్లిఖార్జున స్వామివారి  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ..

తేదీ : 14.02.2023 , మంగళవారం  సూర్యాస్తమయం అనంతరం , మయూర వాహనంపై ఆది దంపతులు



శ్రీశైలం మహాజ్యోతిర్లింగంగా, శక్తిపీఠంగా, ప్రపంచకేంద్రంగా, వేదాలకు నిలయంగా,  భూమిపై కైలాసంగా వెలసిన ఘనత అంతా సుబ్రహ్మణ్యస్వామికి మరియు 

సుబ్రహ్మణ్య స్వామివారి వాహనమైన  మయూరానికే దక్కుతుంది. గణాధిపత్యం దక్కలేదని అలిగి శ్రీశైల క్షేత్రానికి తన మయూర వాహనంపై 

శ్రీశైలక్షేత్రానికి రావడంవల్ల పార్వతీ పరమేశ్వరులు కూడా  తన బిడ్డయైన సుబ్రమణ్యస్వామివారి కోసం  ఈ భూకైలాసంలో వెలసి భక్తుల అభీష్టాలు నెరవేరుస్తూ విరాజిల్లుతున్నారు.

అటువంటి సుబ్రమణ్యస్వామివారి వాహనమైన మయూర వాహనంపై విహరించే ఆది దంపతులను దర్శించినవారికి కష్టాలు మరియు సర్పదోషాలనుండి

విముక్తి పొంది, బ్రహ్మజ్ఞానాన్ని కూడా పొంద శ్రీభ్రమరాంబికాదేవి సమేత శ్రీమల్లికార్జునస్వామి వార్ల సంపూర్ణ ఆశీస్సులు పొందుతారు.