మహా మృత్యుంజయ మంత్రం


ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం !

ఉర్వారుక మివ బంధనాత్ మృత్యోర్‌ ముక్షీయ మామృతాత్‌!! 


భావం:-


‘‘అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన శివుణ్ణి మేము పూజిస్తున్నాం. తొడిమ నుంచి పండు వేరు పడే విధంగా, మేము కూడా మరణం నుంచి, మర్త్యత్వం నుంచి విడుదల పొందాలి.’’

మహా మృత్యుంజయ మంత్రం పరమ మహిమాన్వితమైనది. దీని పఠనం దీర్ఘ అనారోగ్యాలనూ, అపమృత్యు భయాన్నీ దూరం చేస్తుంది

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. 

తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. 



ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.


ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రమ్ అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. 

ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.

ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో "మూడు" కు ఎంతో ప్రాధాన్యం ఉంది. 


ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా?

అందులో సందేహమేముంది. 


ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు.