When is Ayyappa Swamy's birthday 2023?

స్వామి శరణం 


అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు ఎప్పుడు?


ఈ మధ్యకాలంలో చాలామంది అయ్యప్ప భక్తులు స్వామి వారి పుట్టినరోజు ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు ...వాస్తవానికి కేరళ పంచాంగానికి మన పంచాంగానికి చాలా తేడాలు ఉంటాయి ..


ఉదాహరణకు మన తెలుగు సాంప్రదాయ పంచాంగం ప్రకారం మరి కేరళ సంప్రదాయ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం చాలా రోజులు తేడాగా ఉంటుంది కేరళ పంచాంగం లో అధిక మాసాలు సందర్భంగా ఉదాహరణకు మనకు ఉగాది ఈనెల అనగా మార్చి నెల 22వ తారీఖు నాడు వస్తుంది కానీ కేరళలో ఉగాది ఈ సంవత్సరము ఏప్రిల్ 15వ తారీకు వస్తుంది.


 స్వామివారి జయంతి వేడుకలు కేరళలో ట్రావెన్కోర్ దేవస్థానం ఆధ్వర్యంలో శబరిమల స్వామివారి సన్నిధానంలో తిరు ఉత్సవం పేరుతో 26 మార్చి రోజు దేవాలయం తెరిచి 5 ఏప్రిల్ 2023 రోజున దేవాలయం మూసివేస్తారు.

 ముఖ్యంగా శబరిమలలో స్వామి వారి పుట్టినరోజుకు సూచనగా ప్రతి సంవత్సరం పంబ ఆరట్టు ఉత్సవం నిర్వహిస్తారు .

ఈ సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖున స్వామివారు ఏనుగు పై కూర్చొని పంబ నదికి వచ్చి అక్కడ స్నానం చేసి తిరిగి సాయంకాలము శబరిమల చేరుకుంటారు .

రాత్రి పడిపూజ హరిహరాసనం తరువాత దేవాలయాన్ని మూసివేస్తారు .శబరిమల లో ఏ విధంగా అయితే స్వామివారి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు మనము కూడా అదే రోజు పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలి.


 స్వామి వారి పుట్టినరోజు వేడుకల కోసం శబరిమల దేవాలయం తెరిచి ఉంటున్న రోజుల్లో శబరిమలలో పంబ ఆరట్టు రోజున ప్రతి సంవత్సరం స్వామి వారి జన్మదిన వేడుకలు శబరిమల ఆచారాల ప్రకారం ఉత్తమం.

  ఈనెల మన తెలుగు పంచాంగం ప్రకారం మార్చి 8న అంటే ఈరోజు వస్తుంది కానీ శబరిమల దేవాలయం ఈరోజు మూసి ఉంటుంది గమనించగలరు.

 శబరిమలలో ఏ రోజు అయితే స్వామివారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారో.. అదే రోజు మనము జరుపుకోవాలి .

ప్రతి నెల ఉత్తరా నక్షత్రం రోజున స్వామి వారిని పూజిస్తే స్వామివారి ఆశీస్సులు మన పైన ఉంటాయి 


స్వామి శరణం