ప్రపంచంలోని అతి ప్రాచీన గణపతి దేవాలయం.
పశువుల కాపరి వేషంలో వినాయకుడు...
.ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన వినాయక దేవాలయం, తమిళనాడు రాష్ర్టంలోని తిరుచ్చి (తిరుచురాపల్లి) పట్టణంలో, కావేరీనదీ తీరానికి దగ్గరగా ఉన్న
ఒక చిన్న కొండమీద ఉంది. 83 మీటర్లు ఎత్తుగా ఉండే ఈ కొండమీద ఉన్న
ఈ వినాయక దేవాలయాన్ని సుమారు ఏడవ శతాబ్దంలో పల్లవ రాజులు పునర్నిర్మించారని చరిత్రకారులు చెప్తారు.
ఈ ఆలయాన్ని ‘ఉచ్చ పిళ్ళైయార్’ ఆలయం అంటారు. తమిళ భాషలో ‘ఉచ్ఛ’ అంటే ‘ఎత్తున’అని అర్థం.
ఇక ‘పిళ్ళై..యర్’ అంటే ‘పిల్లవాడు ఎవరు’ అని అర్థం.
శివుడు పార్వతీదేవి మందిరంలో ప్రవేశించబోతున్న సమయంలో, పార్వతీదేవి కాపలాగా ఉంచిన బాలుడు అడ్డగించగా, శివుడు కోపగించి ఆ బాలుని తల ఖండించి లోపలకు వెళ్ళడు.
శివుడు, పార్వతిని కలవగానే అడిగిన మొదటి ప్రశ్న ‘పిళ్ళైయార్’. అంతవరకూ ఈ బాలునకు పేరే లేదు. ఆన…