Dr. NTR శత జయంతి ఉత్సవాల సందర్భంగా, తెలుగు విశ్వవిద్యాలయంలో శూన్య ఛాయా దినము పరిశీలన - అధ్యయనము - విశ్లేషణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, నాంపల్లి, హైదరాబాద్: సూర్య సిద్ధాంతం ప్రకారం, భూప్రదక్షిణ సమయంలో, భూ అక్షాంశ, రేఖాంశల రీత్యా సూర్య గమనం గణన చేసినప్పుడు, కొన్ని ప్రాంతాలలో సూర్యుడు సరిగ్గా 90 డిగ్రీలలో నిలిచినపుడు శూన్య ఛాయ ఏర్పడుతుంది. అంటే ఆ సమయంలో నిలువుగా ఉన్న వాటి చాయ కొన్ని సెకన్ల/నిమిషాలపాటు నేలపై పడదు అని శృంగేరీ ఆస్థాన జ్యోతిష పండితులు శ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు తెలిపారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీ జ్యోతిష విభాగం లో తాను, వారి కుమారుడు శంకరమంచి శాయి శివ శ్రీనివాస్ ఇద్దర్రు Ph.D., లో బంగారు పతకం సాధించామని, అందుకే వైస్ చాన్సెలర్ ఆచార్య తంగెడ కిషన్ రావ్ గారి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.
మంగళవారం, 9-5-2023 మద్యాహ్నం 12గం|| 12 ని||
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో ఏర్పడిన ఈ ప్రత్యేక సమయం హైదరాబాద్ లో 3 రోజులు 3 వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పడుతున్నదని తమ గణనలద్వారా లెక్క కట్టామని శంకరమంచి శివ అందుకు సంబంధించిన గణనలను చార్ట్ల ద్వారా వివరించారు.
విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సెలర్ ఆచార్య తంగెడ కిషన్ రావ్ గారు మాట్లాడుతూ, జ్యోతిష శాస్త్రం ద్వారా ఖగోళంలోని ఈ ప్రత్యేకతను మన విశ్వవిద్యాలయంలో ప్రజలకు అర్ధమయ్యేలా తెలియజేయడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమం చేపట్టిన జ్యోతిష పండితులు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి, శంకరమంచి శివకు అభినందనలు తెలిపి, శాలువ మరియు జ్ఞాపికతో సత్కారం చేసారు. ప్రముఖ సంగీత విద్వాంసులు పులిపాక పూర్ణ చంద్ర రావ్ గారు ఆత్మీయ అతిథి గా విచ్చేసి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు కావడం ఎంతో గర్వ కారణంగా ఉందని కార్యక్రమ నిర్వాహకులు epoojastore CEO సోమేశ్వర్ శర్మ తెలిపారు.