How Many Types of Shani's are there ? What are the Remedies to get very good results ?


ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమశని, జాతకరీత్యా శని దశలు, అంతర్దశలు నడిచే వారు ప్రతి రోజు వీలైనన్ని సార్లు పఠిస్తే చాలా మంచి ఫలితం వుంటుంది. గ్రహబాధ తొలగి 


మనశ్శాంతి తప్పక లభిస్తుంది.


శని స్తోత్రం

నమస్తే కోణ సంస్థాయ పింగల్యాయ నమోస్తుతే

నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే

నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ

నమస్తే యమసంజ్ఞాయ నమస్తే శౌరయేవిభో

నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే

ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్య చ ||


ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది.

నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ 


వైభవం కలిగింది.

Guru Transit to Mesha Rashi (Aries) To Get Good Sign, Need to perform Rudrabhishekam & Maha Pasupatha Homam

https://bit.ly/45gbUeZ

నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ”క్రోడం నీలాంజన ప్రఖ్యం..” అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, 

"క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్

ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్

నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార

వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ

ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ

కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ

శుద్ధబుద్ధి ప్రదాయనే

య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్

మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి" ||

తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి, 

"శన్యారిష్టే తు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్   

శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే"||


శని అష్టోత్తర శతమామావళి - మంగళాష్టకం

ఓం శనైశ్చరాయ నమః    ఓం సుందరాయ నమః 

ఓం ఘనాయ నమః

ఓం ఘనరూపాయ నమః 

ఓం ఘనాభరణధారిణే నమః 

ఓం ఘనసారవిలేపాయ నమః

ఓం ఖద్యోతాయ నమః 

ఓం మందాయ నమః 

ఓం మందచేష్టాయ నమః

ఓం మహనీయగుణాత్మనే నమః 

ఓం మర్త్యపావనపాదాయ నమః

ఓం మహేశాయ నమః 

ఓం ఛాయాపుత్త్రాయ నమః 

ఓం శర్వాయ నమః

ఓం శ్రతూణీరధారిణే నమః 

ఓం చరస్థిరస్వభావాయ నమః 

ఓం చంచలాయ నమః


ఓం శాంతాయ నమః    

ఓం శరణ్యాయ నమః 

ఓం వరేణ్యాయ నమః 

ఓం సర్వేశాయ నమః

ఓం సౌమ్యాయ నమః 

ఓం సురవంద్యాయ నమః 

ఓం సురలోక విహారిణే నమః

ఓం సుఖాననోవిష్టాయ నమః 

ఓం నీలవర్ణాయ నమః 

ఓం నిత్యాయ నమః 

ఓం నీలాంబసనిభాయ నమః

ఓం నీలాంబరవిభూషాయ నమః 

ఓం నిశ్చలాయ నమః 

ఓం వేద్యాయ నమః

ఓం విధిరూపాయ నమః 

ఓం విరోధాధార భూమయే నమః

ఓం వేదాస్పదస్వాభావాయ నమః 

ఓం వజ్రదేహాయ నమః 

ఓం వైరాగ్యదాయ నమః

ఓం వీరాయ నమః 

ఓం వీతరోగభయాయ నమః 

ఓం విపత్పరంపరేశాయ నమః

ఓం విశ్వనంద్యాయ నమః 

ఓం గృద్రహహాయ నమః 

ఓం గుధాయ నమః

ఓం కూర్మాంగాయ నమః 

ఓం కురూపిణే నమః 

ఓం కుత్సితాయ నమః

ఓం గుణాధ్యాయ నమః 

ఓం గోచరాయ నమః 

ఓం అవిద్యామూలనాశాయ నమః

ఓం విద్యావిద్యాస్వరూపిణే నమః 

ఓం ఆయుష్యకారణాయ నమః 

ఓం ఆపదుద్దర్త్రే నమః

ఓం విష్ణుభక్తాయ నమః 

ఓం వశినే నమః 

ఓం వివిధాగమనేదినే నమః

ఓం విధిస్తుత్యాయ నమః 

ఓం వంద్యాయ నమః 

ఓం విరూపాక్షాయ నమః

ఓం వరిష్టాయ నమః 

ఓం వజ్రాంకుశధరాయ నమః 

ఓం వరదాయ నమః

ఓం అభయహస్తాయ నమః 

ఓం వామనాయ నమః 

ఓం జేష్టాపత్నీసమేతాయ నమః

ఓం శ్రేష్టాయ నమః 

ఓం అమితభాషిణే నమః 

ఓం కస్టౌఘనాశకాయ నమః

ఓం ఆర్యపుష్టిదాయ నమః 

ఓం స్తుత్యాయ నమః 

ఓం స్తోత్రగమ్యాయ నమః

ఓం భక్తివశ్యాయ నమః 

ఓం భానవే నమః 

ఓం భానుపుత్త్రాయ నమః

ఓం భావ్యాయ నమః 

ఓం పావనాయ నమః

ఓం ధనుర్మందల సంస్థాయ నమః

ఓం ధనదాయ నమః 

ఓం ధనుష్మతే నమః 

ఓం తనుప్రకాశ దేహాయ నమః

ఓం తామసాయ నమః 

ఓం అశేషజనవంద్యాయ నమః 

ఓం విశేషఫలదాయినే నమః

ఓం వశీకృతజనిశాయ నమః 

ఓం పశూనాంపతయే నమః 

ఓం ఖేచరాయ నమః

ఓం ఖగేశాయ నమః 

ఓం ఘననీలాంబరాయ నమః 

ఓం కాఠిన్యమానసాయ నమః

ఓం అరణ్యగణస్తుత్యాయ నమః 

ఓం నీలచ్చత్రాయ నమః 

ఓం నిత్యాయ నమః

ఓం నిర్గుణాయ నమః 

ఓం గుణాత్మనే నమః 

ఓం నిరామయాయ నమః 

ఓం నింద్యాయ నమః

ఓం వందనీయాయ నమః 

ఓం ధీరాయ నమః 

ఓం దివ్యదేహాయ నమః 

ఓం దీనార్తి హరణాయ నమః

ఓం దైన్య నాశకరాయ నమః 

ఓం ఆర్యజనగణణ్యాయ నమః 

ఓం క్రూరాయ నమః

ఓం క్రూరచేష్టాయ నమః 

ఓం కామక్రోధకరాయ నమః 

ఓం కళత్రపుత్త్రశత్రుత్వ కారణాయ నమః

ఓం పరిపోషితభక్తాయ నమః 

ఓం భక్త సంఘమనోభీష్ట ఫలదాయ నమః  

ఓం శ్రీమచ్ఛనైశ్చరాయ నమః

Special Pujas To Resolve Your Shani Dosha On This Shani Trayodashi

https://bit.ly/42UGkC3

శని మంగళాష్టకమ్

శని మంగళాష్టకమ్ మందః కృష్ణవిభస్తు పశ్చిమ ముఖః సౌరాష్టవో కాస్యవః |

నక్రేశో ఘటన సుహృద్భుధ భ్రుగుర్వైరీంద్వ వక్ష్యాసుతః ||

స్థానం పశ్చిమ దిక్ర్పజాపతిర్యమౌదేవౌ ధనస్త్వాసనం |

షట్రష్ట స్శుభకృచ్ఛమీ రవిసుతః కూర్యాత్సదా మంగళం ||

శనైశ్చరుని జపం మంత్రాలు

నీలాంజన సమాభాసం 

రవి పుత్రం యమాగ్రజం 

ఛాయా మార్తాండ సంభూతం 

తమ్ నమామి శనైశ్చరం ||

|| ఓం శం శనయేనమ:|| 

|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||

|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||

శని గాయత్రీ మంత్రం

ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.

|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||

బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం"::

||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: || 

||ఓం శం శనైస్కర్యయే నమః|| 

||ఓం శం శనైశ్వరాయ నమః|| 

||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||

||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||

ఓం నమో శనైశ్వరా పాహిమాం, ఓం నమో మందగమనా పాహిమాం, ఓం నమో సూర్య పుత్రా పాహిమాం, ఓం నమో చాయాసుతా పాహిమాం, ఓం నమో జేష్టపత్ని సమేత 


పాహిమాం, ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం, ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం 

శనిగ్రహ దోష జపం

అస్యశ్రీ శనిగ్రహ మహా మంత్రస్య హిళింభి ఋషిః శనైశ్చర

గ్రహోదేవతా! ఉష్టిక్ చంధః! శనైశ్చర గ్రహ ప్రసాద సిద్దర్ధ్యే

శనిపీడా నివారణార్ధే శనిమంత్ర జపే వినియోగః

::కరన్యాసం::

ఓం శమగ్ని - అంగుష్టాభ్యాసం నమః

ఓం అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః

ఓం విష్ణుశంనస్తపతుసూర్యః - మధ్యమాభ్యాం నమః

ఓం శంవాతః - అనామికాభ్యాం నమః

ఓం వాత్వరపాః - కనిష్ఠికాభ్యాసం నమః

ఓం అపశ్రిధః - కరతల కరపృష్టాభ్యాసం నమః 

::అంగన్యాసము::

ఓం శమగ్ని: - హృదయాయ నమః

ఓం అగ్నిభిస్కరత్ - శివసేస్వాహ

ఓం శంనస్తపతుసూర్యః - శిఖాయైవషట్

ఓం శంవాతః - కవచాయహు

ఓం వాత్వరపాః - నేత్రత్రయాయ వౌషట్

ఓం అపశ్రిధ్ర - అస్త్రాయఫట్

ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధం

ఆదిదేవతాః

ఇమం యమ ప్రస్తరమాహి సీదాంగి రోభి: పితృభిప్సం విధానః |

అత్వా మంత్రాః కవిసహస్త్వా వహ న్వైనారాజన్ హవిషామదయస్వ ||

ప్రత్యథి దేవతా: ప్రజాపతే సత్వ దేవతాన్యోన్యో విశ్వాజాతాని పరితాబభూవ |

యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తువయగ్గౌ శ్యామ పతయోరయీణాం ||

::వేదమంత్రం::

ఓం శమగ్ని రాజ్ఞి భిస్క రచ్చన్న స్తపతు సూర్యః శం వాతో వాత్వరపా అపశ్రిధః |

శని కవచ స్తోత్రము శనైశ్చరశ్శిరో రక్షేత్ | 

ముఖం భక్తార్తి నాశనః కర్ణౌకృష్ణాంబరః పాతు |

నేత్రే సర్వ భయంకరః |

కృష్ణాంగో నాసికాం రక్షేత్ |

కర్ణౌ మేచ శిఖండిజ: |

భుజౌమే సుభుజః పాతు |

హస్తా నీలోత్పల ప్రభః |

పాతుమే హృదయం కృష్ణ: |

కృక్షిం శుష్కోధర స్తధాః |

కటిం మే వికటః పాతు |

ఊరూ మే ఘోర రూపవాన్ |

జానునీ పాతు దీర్ఘోమే | 

జంఘేమే మంగళ ప్రభః |

గల్పౌ గణాకరః పాతు |

పాదౌ మే మంగుపాదకః |

సర్వాణిచ మామాచంగాని |

తు భాస్కరనందనః ||

ఫలశ్రుతి

య ఇదం కవచం దివ్యం సర్వ పీదాహరం ణాం పఠతి శ్రద్ధయా యుక్తః! సర్వాన్ కామానవాప్నుయాత్ ||

శనైశ్చరుడు ప్రసన్నుడవాలంటే, చేయవలిసినవి


కంటక శని

(చాంద్రయానాన్ని అనుసరించి జన్మరాశి నుండి ఎనిమిదవ ఇంటిలోనికి శని ప్రవేశించినప్పుడు) లేదా, 

ఏలినాటి శని

(చాంద్రయనాన్ని అనుసరించి జన్మరాశి నుండి పన్నెండు, మొదటి మరియు రెండవ ఇంటిలోనికి శని యొక్క గమన సమయంలో) ఉన్నా శని ప్రస్సనుడవాలంటే, 

అమావాస్య రోజున కాళీ మాత పూజ చేయాలి. 

విష్ణువును, కృష్ణుని రూపంలో ధ్యాన్నిస్తూ 'ఓం నమో నారాయణాయ', 'హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే' అని జపించాలి. 


హనుమంతుడిని సర్వోత్కృష్టమైన (అనంతమైన) రూపంలో ధ్యానించాలి. శని, హనుమంతుని వీపుపై, చేరి అతన్ని పట్టి పీడించాలని ప్రయత్నించినప్పుడు, తన బలం అంతా 


ఉపయోగించి, ఒక్క విదిలింపుతో శనిని, విసిరి పారేసినప్పుడు సూర్య భగవానుడు, హనుమంతుడిని మెచ్చుకొనెను