కాలభైరవుడు మహాశివుని 64రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి. అన్ని శివాలయాల్లో భైరవుడు కొలువైవుంటాడు. ఇంకా చెప్పాలంటే.. భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై వుంటాడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే..? బుధవారం పూట చేయాలి.
కాలభైరవుడిని
పూజించడం
ద్వారా
దారిద్ర్యం
తొలగిపోతుంది.
రుణబాధలు
తీరిపోతాయి.
న్యాయమైన
కోరికలు
తక్షణమే
నెరవేరుతాయి.
కోరిన
కోరికలను
నెరవేర్చేందుకు
కాలాన్ని
అనుగుణంగా
మలిచే
శక్తి
కాలభైరవునికి
ఉందంటున్నారు
ఆధ్యాత్మిక
పండితులు.
ఇక కాలభైరవుని పూజ ఎలా చేయాలంటే.. వరుసగా ఐదు బుధవారాలు నిష్ఠగా పూజించాలి. మాంసాహారం ముట్టకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. బుధవారం రోజున సమీపంలోని కాలభైరవుడు లేదా స్వర్ణ ఆకర్షణ భైరవుని సన్నిధికి వెళ్లాలి. రెండు నేతి దీపాలను ఆలయంలో వెలిగించి, తక్కువ కాకుండా పావు కేజీ కలకండను సమర్పించుకోవాలి. తర్వాత కాలభైరవుని వద్దే కూర్చుని ప్రార్థన చేయాలి.
Lord Kalabhairva Abhishekam To Get Rid Of Evil And Negative Energies
కాలభైరవుని
తలచి
ధ్యానించాలి.
తర్వాత
కలకండలోని
సగభాగాన్ని
ఆలయంలోని
భక్తులకు
పంచి
పెట్టాలి.
మిగిలిన
సగభాగాన్ని
ఇంటికి
తీసుకెళ్లాలి.
కుటుంబ
సభ్యులకు
పంచిపెట్టాలి.
ఇంకా
శుక్లపక్షంలో
వచ్చే
అష్టమి
రోజున
కాలభైరవుని
పూజించడం
ద్వారా
కూడా
ఆయన
అనుగ్రహం
పొందవచ్చు.
కాలభైరవునికి అటుకుల పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తున్నారు.