ఏ రాశివారు శనిత్రయోదశి నాడు తప్పక పూజించాలి
శ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం తంనమామి శనైశ్చరం
అర్థం: నీలం రంగులో ఉండే కాటుక కొండలాంటి ఆకారంలో కాంతితో ఉండేవాడు, సూర్యకుమారుడు, యముని సోదరుడు, ఛాయాదేవికి సూర్యభగవానునికి పుట్టిన వాడు ఐన ఓ శనీశ్వరా! నీకు నమస్కారము.
ప్రతీదైవానికీ ఒక తిథిని, ఒక నక్షత్రాన్ని, ఒకవారాన్ని, ఒక హోరాకాలన్ని ,కొన్ని ప్రీతికర వస్తువులని పెద్దలు నిర్దేశించారు. ఆయా సమయాలలో ఆయాగ్రహాలకి పూజ చేసినా దానం ఇచ్చినా జపంచేసినా ఆయా గ్రహాలా పీడ పరిహరించ తగ్గుతుంది. అలాగే శని గ్రహానికి కూడా కొన్ని చెప్పబడ్డాయి. శనికి త్రయోదశి తిథి, శనిహోరాకాలం, తిలాతైలాదుల దానం, ఇలాంటివి చెప్పబడ్డాయి.
శనిపీడాఫలాలు డబ్బుదుబారా, అపనింద, నపుంసకత్వం, మాటవిలువ తగ్గటం,జీర్ణ సంబంధరోగాలు, వెన్నినొప్పు, పొట్టరావడం, కొవ్వుబద్దకం, అలసట, అతినిద్ర, పైవారిఒత్తిడి, నీచస్త్రీపురుషులతో సాంగత్యం, వ్యసనాల అలవాటుపడటం, ఉద్యోగం పోవటం, ఉద్యోగం దొరకకపోవటం, అందం తగ్గటం, వంటివి ముఖ్య ఫలాలు.
పుణ్యకాలం ప్రతీ శనివారం శని హోరాకాలలలో చేస్తేమంచిది. ఉదయం 6-7మధ్యకాలం, మధ్యాహ్నం 1-2 మధ్యకాలం, రాత్రి 8-9 మధ్యకాలంమంచిది. ఐతే శనిత్రయోదశి నాడు
రోజంతా పుణ్యకాలమే.
శనిత్రయోదశి నాడు మనం చేయదగ్గవి నూనె ఒంటికి అంటుకొని, తలస్నానంచేయడం, ప్రాణాయమం చేయడం, శనికోసం చెప్పిన మంత్రాలు, శ్లోకాలు చదవటం. ఉపవాసం. శనికి చేయదగ్గపూజలు శనికి తైలాభిశేకం, శనికిరుద్రాభిశేకం, నవగ్రహాలలో శనికి అష్టోత్తరనామాలు చదువుతూ పూలతో పూజించడం. శని ప్రదక్షిణలు చేయడం.
చదవదగ్గవి శని అష్టోత్తర శతనామాలు, దశరథకృత శనిస్తోత్రం, విష్ణు సహస్రనామస్తోత్రం, శివపురాణం నలున్ని శని పీడించిన కథ మంచివి.
శనికి ప్రీతిగా ఇవ్వదగ్గదానాలు నువ్వులు, నువ్వుల ఉండలు, అన్నిరకాల నూనెలు నీలంరంగు పంచెలు (బ్రాహ్మణులకి) ఇనుప వస్తువులు, పనివారికి, యాచకులకి - పాతబట్టలు దానంచేయాలి. నేరేడు పండ్లు, సిమెంట్ ఇనుము వంటివి, తగినవారికి తగినరీతిలో శక్తి వంచనలేకుండా చేయడం మంచిది.
శనికి సంబంధించి శాంతి చేసుకోవలసినవారు మామూలుగా మిథున కర్కాటక, తుల వృశ్చిక రాశులవారు చేసుకోవాలి విశేషంగా జాతకంలో శని పాప సంబంధంగా ఉన్నవారు, పాప స్థానాలలో ఉండేవారు, శనిదశ నడుస్తున్నవారు, చేయాలి.
Special Pujas To Resolve Your Shani Dosha On This Shani Trayodashi