ఆషాఢ మాసం వారాహి దేవి నవరాత్రం మొదలు.. June 19 Monday to June 28th Wednesday.
సంవత్సరంలో ప్రధానంగా రెండు నవరాత్రులు చెప్తున్నారు – వసంత నవరాత్రులు, శారదా నవరాత్రులు. ఇవి కాకుండా శ్రీవిద్యా సంప్రదాయంలో మరో రెండు అధికమైన నవరాత్రులు కనపడుతున్నాయి. వాటిలో ఆషాఢమాసం పాడ్యమి నుంచి వచ్చే నవరాత్రులు. ఈ నవరాత్రులకి వారాహీ నవరాత్రులు అని చెప్పడం ఉన్నది.
Vana Durgamba Homa
యజ్ఞవరాహ
రూపంగా భూమిని ఉద్ధరించిన
దైవీ శక్తికి ప్రతీక గనుక
భూమినే ఆధారం చేసుకుని
జీవిస్తున్న వారందరికీ
ఆరాధ్యమైన దేవత శ్రీ వారాహీ
దేవి.
ఈ
శక్తికి సంబంధించిన మంత్రాలకు
గురూపదేశం వంటివి ఉండాలి.
కానీ
తల్లిగా కొలుచుకునేటపుడు
ఆమె యొక్క స్తోత్రాదులు,
“శ్రీవారాహీ
దేవ్యై నమః” మొదలైన నామములతో
ఈ తొమ్మిది రోజులు పూజించడానికి
ఇతర దేవతా పూజలకు పాటించే
సాధారణ నియమములు సరిపోతాయి.
ఇచ్ఛ,
జ్ఞాన
క్రియా శక్తులలో,
క్రియా
శక్తికి ప్రతీక వారాహీదేవి.
కిరాత
వారాహి,
భైరవి,
స్వప్న
వారాహి ఈ విధంగా ఎన్నో రూపాలతో,
నామాలతో
అనుగ్రహించే తల్లి.
ఈ
తొమ్మిది రోజులూ వారాహీ దేవి
ప్రీతికి శ్రీ లలితా సహస్రనామ,
లలితాష్టోత్తర
శతనామ స్తోత్ర పారాయణాదులు
చేసి దేవియొక్క అనుగ్రహమును
పొందవచ్చును.