Shani trayodashi 2023: శని త్రయోదశి 01-07-2023 శనివారం రోజు వస్తోంది. శనిత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం, నవగ్రహ ఆలయ దర్శనం, శివాలయ దర్శనం చేసుకోవడం మంచిది. శని త్రయోదశి రోజున చేయాల్సినవి, చేయకూడనివి వివరించారు.
శని త్రయోదశి రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించిన వారికి శని దోషాలు తొలగుతాయి. 2023వ సంవత్సరంలో శని కుంభరాశిలో సంచరించుట వలన శనికి తైలాభిషేకం ఈ రాశులు వారు ఆచరించాలి. మకర, కుంభ, మీన రాశుల వారు (ఏలినాటి శని ప్రభావం వలన), కర్కాటక రాశి వారు (అష్టమశని ప్రభావం వలన), వృశ్చిక రాశి వారు (అర్ధాష్టమ శని ప్రభావం వలన) శనికి తైలాభిషేకం చేయించుకోవడం వలన శని దోషాలు తొలగుతాయి. అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు చెబుతారు.
శని జన్మించిన తిథి కూడా త్రయోదశి. అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈరోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమశని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
Special Pujas To Resolve Your Shani Dosha On This Shani Trayodashi
శని బాధలు తీరేందుకు చేయాల్సిన స్తోత్రం
‘నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్..
ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్’
అనే శ్లోకాన్ని పఠిస్తే మంచి శుభఫలితాలు కలుగుతాయి