Arudra nakshatra day is the only real sighting

ఓం నమః శివాయ. ...

మిళనాడు లోని  రమేశ్వరం నుండి సుమారు 75 kms. దూరంలో ఉంది "తిరుఉత్తర కోసమాంగై". మధురై వెళ్లే దార్లో వస్తుం ది ఈ ప్రదేశం.ఇ శివాలయం మొట్ట మొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. శివభక్తురాలైన మండోదరి శివుడ్ని ప్రార్ధించి "నాకు ఒక గొప్ప శివభక్తుడ్ని భర్త గా ప్రసాదించు ఈశ్వరా!" అని వేడుకుంటే తన భక్తుడైన రావణ బ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం ఙరిగింది,ఇక్క డ శివుడు శివలింగ రూపంలో, మరకతరూపంలో, స్పటిక లింగంలో దర్శనమిస్తారు. నటరాజరూపం లో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడిం ది. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ మరకతం నుండి వచ్చే Vibrations ను మనం తట్టుకోలేం కాబట్టి స్వామివార్ని ఎప్పుడూ విభూది, గంధపుపూతతో ఉంచుతారు.

కేవలం ఆరుద్ర నక్షత్రంరోజు మాత్రమే నిజరూపదర్శ నముంటుంది. అలాగే ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి స్పటికలింగానికి అభిషేకం చేసి తర్వాత Locker లో  భద్రపరుస్తారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయదర్శనం మన పూర్వ జన్మ సుకృతం. ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు వారాహిరూపంలో వెలిశారు. భక్తులు పసుపుకొమ్ములను ఆ ప్రాంగణంలోనే నూరి, ముద్దచేసి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.