శబరిమల మాలికపురత్తమ్మ గుడిలో టెంకాయ దొర్లించి వదిలేయడం ఎందుకు ?
ఇందులోని పరమార్థం ఏమిటి ?
కేరళలోని శబరిమల గురించి తెలియని వారు బహుశా ఉండరు. మండల దీక్షలో ఉండి , ఇరుముడి కట్టుకొని , అందులో నెయ్యి నింపిన ముద్రకాయ , పీచు తీసిన కొబ్బరికాయలు శబరిమలకు అయ్యప్పలు తీసుకవెళ్లటం ఆచారం.
ముద్రకాయను గురుస్వామి గుడి బయట పగులకొట్టి , అందులోని నెయ్యిని అయ్యప్పకు అభిషేకం చేయిస్తారు. గుడిలో కాయను కొట్టరు ఆ కొబ్బరికాయను కాల్చేస్తారు. మరొక కొబ్బరికాయ అమ్మవారి గుడిలో అమ్మ గుడి చుట్టూ దొర్లించి , కొట్టక ఒక మూలకు విడిచి వస్తారు. ఎందుకు?
మాలికాపురత్తమ్మ గుడిలో కొబ్బరి కాయలు దొర్లించుటలో పరమార్తము , ఆధ్యాత్మిక భావన దాగి ఉన్నది. నెయ్యి నింపని కొబ్బరికాయను అనగా మూడు కన్నులు కల నారికేళము లో స్వచ్ఛమైన భగవత్ప్రసాదిత జలము ఉండును. ఈ కాయను పగులకొట్టరాదు. మనలో దాగి ఉన్న 18 భావనలను ఈ కొబ్బరికాయలో ఇమిడ్చి అమ్మవారి సన్నిధిలో వదిలివేయడమే ఈ చర్యలోని భావన.
Shop Now For Sravana Masam Special : https://rb.gy/8i7ad
మాలికాపురత్తమ్మ దేవి సాక్షిగా నా లోని కామ , క్రోధ , లోభ , మోహ , మధ మాత్సర్యాలను సదరు కాయలో భందించి , ఇక్కడే వదిలి పెట్టివెళుతున్నానని , చెప్పి భక్తులు ఇక్కడ టెంకాయను దొర్లించి నిర్గుణులై , పరిశుద్ధులై వెళ్లడం అనేది అంతరార్థం.
నారికేళము ఈశ్వర , విష్ణు సంభంధమైనది. టెంకాయ పై నిలువు చారలు విష్ణు రూపమైతే , కొబ్బరికాయ పై ఉన్న మూడు కన్నులు శివరూపం.
కొబ్బరికాయలోని "అహం" అనే నీటిని తీసి , హరి హరుల కిష్టమైన నెయ్యిని అందులో నింపి , స్వామికి ఆ నెయ్యే నా జీవమని అభిషేకమునకు ఇస్తారు. ఆయన తృప్తితో మన జీవాన్ని తిరిగి ప్రసాద రూపంలో (నెయ్యి) మనకిస్తాడు. పిదప జీవత్సవమైన కాయ (కాయము , అనగా మన శరీరం) ను మంటల్లో వేసి కాలుస్తారు.
శబరి యాత్ర చేసి వచ్చువారు పుణ్యజీవులై , పరిశుద్ద శరీరంతో , లోన దుర్గుణాలన్నియు పోగొట్టుకొని సత్సీలురై పరమ పావన రూపులై వస్తారని అర్థం.