దశావతారాలలో సంపూర్ణ అవతారమూర్తి శ్రీ కృష్ణుడు. తల్లిదండ్రుల పన్నెండు వేల సంవత్సరాల తపస్సు ఫలితంగా తనను తాను వారికి జన్మించిన దివ్య మూర్తి. మొదటి జన్మలో పృశ్నిగర్భుడుగా, రెండో జన్మలో వామనుడుగా, మూడవది ఆఖరుదైన జన్మలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు. పుట్టిన వెంటనే శంఖం చక్రం గద మొదలైన వానితో దర్శనం ఇచ్చి నా లీలలు మననం చెయ్యండి అని మీకు ఇదే ఆఖరి జన్మ అని అనుగ్రహాన్ని కురిపించాడు.
కళ్ళు పూర్తిగా విప్పకుండానే పూతన సంహారం చేసి కంసుడు పంపిన రాక్షస వధ చేసి తాను సామాన్య మానవుడు కాదని తన లీలల ద్వారా ప్రకటించాడు.
కంసవధ చేసి, తాత గారికి తిరిగి మధుర రాజ్య పట్టాభిషేకం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు.
Shop Now For Ganesh Chaturthi : https://www.epoojastore.in/special-items/ganesha-chaturthi-special
తన జీవితం మొత్తం కష్టాలు, బాధలే ఉన్నా, ఎప్పుడూ ధర్మం వైపు నిలబడి పాండవుల్ని కాపాడాడు. అనేక అపనిందలు చిన్నప్పటి నుండి భరించాడు. కురుక్షేత్ర యుద్ధానంతరం గాంధారి శాపాన్ని నవ్వుతూ స్వీకరించిన వాడు. వాలివధ కర్మ ఫలం తన నిర్యాణ రూపంలో అనుభవించాడే గాని నా పాపాల నుండి ఎవరైనా కాపాడండి అని వేడుకోలేదు.
తన సంతతి కోసం తపస్సు చేసి శివుని అనుగ్రహంతో పిల్లల్ని పొందాడు. పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ఉన్నా బ్రహ్మచారియై నిలిచాడు. కర్మ ఫలాలను, కాల మహిమను అడ్డుకోలేదు. తన లీలగా శరీరం గ్రహించి లీలగా శరీరం త్యజించిన సంపూర్ణ అవతార మూర్తి శ్రీ కృష్ణుడు. తన లీలామననం, శ్రవణం చేత అనుగ్రహిస్తాడు. అందరూ శ్రీరాముడి మార్గంలో పయనించి కృష్ణుని ఉపదేశాలు పాటించాలి. జన్మాష్టమి శుభాకాంక్షలు