నేడు
పరివర్తన ఏకాదశి ,
పార్శ్వ
ఏకాదశి ,
వామన
ఏకాదశి
భాద్రపద
శుక్ల ఏకాదశిని పరివర్తన
ఏకాదశి అని పిలుస్తారు.
పరివర్తన
ఏకాదశికి మన ప్రకృతి లో వచ్చే
మార్పులకు సంబదించినదిగా
పరిగణిస్తారు కావున ఈ ఏకాదశికి
పరివర్తన ఏకాదశి అని పేరు
వచ్చింది అని అంటారు.
ఈ
రోజునే శ్రీ మహా విష్ణువు
వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని
పాతాల లోకానికి పంపిస్తాడు.
పరివర్తన
ఏకాదశి రోజు వామన అవతరాన్ని
పూజించడం వలన బ్రహ్మ -
విష్ణు
-
మహేశ్వరులని
సేవేస్తే కలుగు ఫలం లబిస్తుందని
పురాణాలూ చెబుతున్నాయి.
పరివర్తన
ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశే
వామన జయంతి.
ఈ
ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం
వలన తెలియక చేసిన పాపాలు అన్ని
నశిస్తాయని ,
కోరిన
కోరికలు ఫలిస్తాయని అని
నమ్మకం.
Worship Lord Ganesha on Sankatahara Chaturthi and Remove all obstacles in life
శ్రీ మహా విష్ణువు అది శేషు పైన శయనించి (దక్షిణాయనం లో) విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకో వైపు శాయనిస్తాడు అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది.
పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు.
ఇంద్రుని
పరిస్థితిని చూసిన అదితి
దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము
చేసింది.
ఆ వ్రత
చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై
అదితితో "దేవీ..
చింతించవద్దు
నీకు నేను పుత్రునిగా జన్మించి
,
ఇంద్రునికి
చిన్న తమ్మునిగా ఉండి వానికి
శుభము చేకూర్చెదనని"
పలికి
అదృశ్యమవుతాడు.
ఇలా
అదితి గర్భమున భగవానుడు వామన
రూపమును జన్మించెను.
భగవానుని
పుత్రునిగా పొందిన అదితి
సంతోషమునకు అంతులేదు.
భగవానుని
వామనుడగు బ్రహ్మచారి రూపమున
దర్శించిన మహర్షులు ,
దేవతలు
ఎంతో ఆనందించిరి.
వామనమూర్తికి
ఉపనయన సంస్కారములు గావించారు.
ఒకసారి
బలి చక్రవర్తి భృగుకచ్ఛమను
చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని
వామనభగవానుడు విని అచ్చటికి
వెళ్లెను.
ఒక
విధమైన రెల్లుగడ్డితో
మొలత్రాడును ,
యజ్ఞోపవీతమును
ధరించి ,
శరీరముపై
మృగచర్మము ,
శిరస్సున
జడలు ధరించిన వామనుడిని
బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము
నందు ప్రవేశించాడు.
అట్టి
మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ
రూపమున చూసిన బలి హృదయము
గద్గదమై...
వామన
భగవానుడిని ఉత్తమ ఆసనముపై
కూర్చొండబెట్టి పూజించెను.
ఆ
తర్వాత బలి వామనుని ఏదైనా
కోరమని అడుగగా..
"వామనుడు
మూడు పాదముల భూమి"
ని
అడిగెను.
శుక్రాచార్యుడు
భగవానుని లీలలను గ్రహించి
, దానము
వద్దని బలిని ఎంత వారించినా
బలి గురువు మాటను వినలేదు.
అంతేగాకుండా
దానమొసగుటకు సంకల్పము చేసేందుకు
జలపాత్రను ఎత్తెను.
శుక్రాచార్యుడు
తన శిష్యుని మేలుకోరి జలపాత్ర
మందు ప్రవేశించి జలము వచ్చు
దారిని ఆపెను.
కానీ
వామన భగవానుడు ఒక దర్భను
తీసుకుని పాత్రలో నీరు వచ్చే
దారిని చేధించెను.
దీంతో
శుక్రాచార్యునకు ఒక కన్ను
పోయెను.
సంకల్పము
పూర్తి అయిన వెంటనే వామన
భగవానుడు ఒక పాదమును పృథ్విని
, రెండవ
పాదముతో స్వర్గలోకమును
కొలిచెను.
మూడవ
పాదమునకు బలి తనకు తానే
సమర్పితుడయ్యెను.