ధర్మసందేహాలు-సమాధానం
ప్ర
:
గణపతి
విగ్రహానికి పూజ చేసి,
ఎంతోచక్కగా
అలంకరించి తిరిగి నీటిలో
కలిపేయడం ఎందుకు?
పైగా
నీటిలో
కరగని పెద్ద పెద్ద విగ్రహాలను అలా కలపడం కాలుష్యమే కదా? అలాగే అమ్మవారి నవరాత్రులయ్యాక కూడా నిమజ్జనం చేస్తారు కదా! మరో ప్రక్క గణపతికినవరాత్రులు లేవని, బాలగంగాధర్ తిలక్ దీనిని ప్రవేశపెట్టాడని ఒకపెద్దాయన ఒక పత్రికలో వ్రాశారు? అది నిజమేనా?
జ
:
గణపతి
విగ్రహాన్ని పూజించితిరిగి
నీటిలో కలపడంలోనే-
మన
విగ్రహారాధన తత్త్వం అర్థమౌతుంది.
విగ్రహాన్ని
మాత్రమే దేవుడనుకోరు
హిందువులు.
ఇంట్లో నిత్యం పూజించే ఇత్తడి, వెండి, బంగారు ప్రతిమలు నిమజ్జన చేయనవసరం లేదు. కానీ, వినాయక, దేవీ మొదలైన విగ్రహాలకు ఆయా పర్వదినాలలో ప్రత్యేకించి - మట్టితో చేసి అందులో మంత్ర సహితంగా సంస్కారం చేసి, 'ఆవాహన' మొదలైనవి ఆచరించి, ఆరాధిస్తారు. విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యాన్ని ఆ విధంగా కేంద్రీకృతం చేసి, ఆరాధించి, ఆ తరువాత యధావిధి పూజలన్నీ సమాప్తమయ్యాక, తిరిగి 'ఉద్వాసన' చేస్తాం. అంటే ఆరాధింపబడిన మహాశక్తిని మన అంతరంగంలో నిక్షిప్తం చేసుకోవాలి. తద్వారా ఆ దేవతా శక్తి మనల్ని అనుగ్రహిస్తుంది.
Worship Lord Ganesha on Sankatahara Chaturthi and Remove all obstacles in life
ఈ విగ్రహాన్నే కలకాలం ఉంచితే నిత్యమూ తగిన శాంతి జరపడం సాధ్యం కాదు.అలా ఉద్వాసన చేసిన తరువాత ఆ విగ్రహం కేవలం మృణ్మయమే. దానిని తిరిగి జలతత్వంలో లీనం చేయాలి. పృథ్వీతత్వాన్ని జలతత్త్వంలో లయింపజేయడం ఒక యోగప్రక్రియ కూడా.
అయితే
కరగని విధంగా విగ్రహాల్ని
చేయడం శాస్త్రం కాదు.
కేవలం
నీటిలో కరిగే మట్టితోనే
ప్రతిమను చేసి,
దానిని పత్రాలతో అర్చించడం సంప్రదాయం. తిలక్ మహాశయుడు సామూహికంగా గణపతి పూజల్ని ప్రాచుర్యం చేసిన మాట వాస్తవమే. కానీ గణపతినవరాత్రులు ఆయన కల్పితం కాదు. గాణపత్యంలో నవరాత్రి విధానం ఉంది. గణపతినే పరదైవంగా భావించి కొలిచే మతం గాణపత్యం.
శక్తి నవరాత్రులు,రామ నవరాత్రులు వలె గణపతి ఉపాసకులకు నవరాత్ర దీక్ష ఉంది. ఆ దీక్షతో గణపతిని పూజించడం సంప్రదాయ సిద్ధమే. మహారాష్ట్రలో గాణపత్యం ఎక్కువగా వ్యాప్తిలో ఉంది కనుక, అక్కడ అధికంగా ఈ నవరాత్రులు కనిపిస్తాయి. గణపతిఉపాసకులు, భక్తులు ఎక్కడివారైనా, శాస్త్ర సిద్ధంగా భాద్రపద నవరాత్రులు చేయవచ్చు.