మేషం: అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించు కొంటారు. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వృతి -ఉద్యోగాలలో ఎదురైనా చికాకులు తొలగి ఊరట చెందే వార్తలు వింటారు.
వృషభం: పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. సంతాన పరంగా తీసుకోవాల్సిన జాగర్తలు చర్చకి వస్తాయి.
మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఎప్పటి నుండో పెండింగ్ ఉన్న ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయాలని సంకల్పానికి వస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. వాహన యోగం గోచరిస్తున్నది.
కర్కాటకం: శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనం అమితంగా ఖర్చు అవుతుంది.
సింహం: పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోనిఅవకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వృత్తి-వ్యాపారాలలో లభాల బాట పడతాయి.
కన్య: కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు నాంది పలుకుతారు. ఆర్థిక వరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. విద్యార్దులు భవిష్యత్తు కొరకు నూతన ఆలోచనలు చేస్తారు.
తుల: కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. కాంట్రాక్టు దక్కించుకొనుటకు ప్రణాళికలు రచిస్తారు. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.
వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు, విస్తరిస్తారు. విలువైన వన్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
ధనస్సు: ఇంటా బయటా ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలలో ఆశించినంత లాభాలు దక్కవు.
మకరం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వన్తు, వస్త్రాలు కొనుగోలు. మితిమీరిన ఆలోచనలని అదుపు చేసుకోవడం ఉత్తమమం.
కుంభం: ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనాలు, గృహాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. సోదరులను కలిసి ఆనందంగా గడపుతారు.
మీనం: రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. భూములు క్రయ విక్రయాల విషయాలు సేకరిస్తారు.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121