మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏమిటి ?

ప్రతినెల కృష్ణ పక్షం ఆఖరిరోజు అమావాస్య. మహాలయ అమావాస్య ఏడాదికొకసారి వస్తుంది. ఆ రోజు పితృదేవతలకు తర్పణం చేస్తే వాళ్ళకు మోక్షం కలుగుతుందని శాస్త్ర వాక్యం. కాబట్టి అమావాస్య కూడా మంచి దినమే. దక్షిణాదిలో సౌరపంచాంగం ప్రకారం దీన్ని ఒక పవిత్ర దినంగానే పరిగణిస్తారు. కాలప్రభావం వల్ల కొన్ని అపోహలు ఏర్పడి అమావాస్యకు తీరని అన్యాయం చేస్తున్నాయనే చెప్పాలి. చీకటి అంటే భయపడే మనిషి తత్వానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు. ఒకప్పుడు ఉన్నదంగా అజ్ఞానపు చీకటేనని, విజ్ఞానపుంజం ఆ చీకట్లో నుంచే బయలుదేరిందని వేదం చెబుతోంది. మరి కాస్త లోతుగా పరిశీలిస్తే, అమావాస్యకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో తెలుస్తుంది.

Book NOW :

Mahalayam Paksham Special Pitru Karmalu In Kasi From (30th Sep to 14th Oct 2023)

https://shorturl.at/ahjsZ


++వాస= అ అంటే అర్కుడు లేక సూర్యుడు. మ అంటే చంద్రుడు. అంటే, సూర్యచంద్రులు అమావాస్య రోజు చేరువై ఒకేచోట నివసించే రోజు కాబట్టి అమావాస్య అన్న పేరు సార్ధకం అయింది. కొంతమంది ఈ అపురూప సంఘటనను స్వార్థం కోసం వాడుకోవచ్చు. మంత్రతంత్రాలు ఉపయోగించి కొన్ని క్షుద్రశక్తుల్ని వశీకరణం చేసుకోవడానికి యత్నిస్తారని అంటారు. అంత మాత్రాన అమావాస్యకు దోషం ఆపాదించటం తగదు. లయం అంటే ఆలింగనం, కలిసిపోవటం, విశ్రమించటం, కరిగిపోవడం. పరమాత్మ జీవాత్మల సంయోగానికి, సంగమానికి అది సంకేతం. అమావాస్య తరువాత శుక్లపక్ష పాడ్యమినుంచి చంద్రుడు రోజురోజుకు కొత్త కళలను పుంజుకుని పౌర్ణమిరోజు షోడశ కళాపూర్ణుడవుతాడు. చైత్రమాసంలో శుక్లపాడ్యమిరోజే నూతన సంవత్సరం మొదలు కావటమూ శుభసూచకమే. ఎటుచూసినా, అమావాస్యకు అనవసరమైన ఒక భయానక ముద్ర పడటానికి ఇదివరకు చెప్పుకున్న కారణాలు తప్ప, వేరే ఎలాంటి వంక పెట్టనవసరం లేదనిపిస్తుంది.