పద్మనాభ మాసము(ఆశ్వయుజ శుద్ధ "పాశాంకుశ" ఏకాదశీ )
బ్రహ్మవైవర్తపురాణములోని
శ్రీకృష్ణ -
యుధిష్ఠిర
సంవాదము
ఒకనాడు
ధర్మరాజు ఆశ్వయుజ శుధ్ధ
ఏకాదశికి మరియొక పేరు ఏమికలదో
!
దాని
ఫలితమెట్టిదో ?
దయతోనాకు
చెప్పుమని శ్రీ కృష్ణుని
ప్రార్ధించెను.
శ్రీ కృష్ణుడు మిక్కిలి సంతోషముతో చెప్పసాగెను . ఓ ధర్మరాజా ! ఈ ఏకాదశిని " పాశాంకుశ" లేక ' పాపాంకుశ'ఏకాదశి యని పిలిచెదరు దీనిని పాటించిన సర్వశుభములు కలిగి సమస్త పాపములు నశించును . ఈ తిథి యందు యథాప్రకారముగా భగవానుడు శ్రీపద్మనాభుని అర్చించవలెను.
ఈ వ్రతాచరణవల్ల ధర్మార్ధకామమోక్షములు సంప్రాప్తమగును. భూమండలములో నున్న సకల తీర్థములలో స్నాన ఫలమును ఒసంగును. సంసారమున యున్న మానవులు ఏ కారణము వలననైనను మోహవశులై ఎట్టి దుష్కర్మములు చేసివారైనను నరకయాతన అనుభవించుచున్ననూ
ఈ వ్రతాచరణవలన ఆ కష్టముల నుండి విముక్తి పొందుదురు. ఎవరు భగవంతునినిందించుచు భగవద్భక్తులను అవమానించుదురో వారికి తప్పక నరకము ప్రాప్తించును. అట్టివారు ఎన్ని వ్రతములు ఆచరించినను సత్ఫలితమును పొందజాలరు. మనుష్యజన్మమును పొంది ఈ ఆశ్వయుజ శుద్ధ ఏకాదశిని పాటించని వారు ఎందులకూ పనికిరానివారై జీవితము వ్యర్ధమగును. అట్టి వారు యజ్ఞయాగములు చేసినను నిష్ఫలమేయగును. కనుక ఈఏకాదశిని మించిన వ్రతము లేదని శాస్త్రములు మఱల మఱల ఘోషించుచున్నవి.
ఈ తిథియందు ఉపవాసముండి, కృష్ణసేవ, కృష్ణనామము చేయుట, కృష్ణకథాశ్రవణము చేయుట అత్యావశ్యకములు. రాత్రియందు జాగరణ చేయవలెను. ఈ వ్రతమును ఆచరించిన వారి వంశములలో మూలమున పితృ మాతృ పదితరములవారు ఉద్ధరింపబడుదురు. - బాలకులు,యువకులు,వృద్ధులు ఎవ్వరైనను యీ వ్రతమును పాటించవచ్చు. దురాచార సంపన్నులైన మానవులు యీ ఏకాదశీ ఉపవాసము చేసి ఊర్ధ్వలోకములు పొందుటకు అవకాశము గలదు.
తిల-
సువర్ణ
-
భూ-
జల
-
ఛత్ర(గొడుగు)
మఱియు
పాదుకలు దానము చేసినచో వారికి
యమలోక నరకబాధలు కలగవు.
సత్యర్మములు
చేయనివాని జీవితం నిష్ఫలము.
అంతేకాక
ఓ ధర్మరాజా !
ఈ
వ్రతమాచరించిన వారు దీర్ఘాయుస్సు
కలిగి యుండి ధనధాన్యములతో
సుఖముగా నుందురు.
మఱియు
సర్వదోషముల నుండి విముక్తి
పొంది భగవద్ ల్లోకమునకు
వెళ్లుదురు.
జై శ్రీమన్నారాయణ