మేషం: పనులలో విజయం సాధిస్తారు. అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఋణ వత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. శుభవార్తలు తెలియవస్తాయి.
వృషభం: కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహన సౌఖ్యం గోచరిస్తున్నది.
మిథునం: సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ సంకల్పంతో అనుకోని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు.
కర్కాటకం: నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. సహోదరి వర్గంతో ఆనందంగా గడుపుతారు. గృహ, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.
సింహం: ఆరోగ్య, వాహన విషయాలలో నిర్లక్ష్యం తగదు. నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. తగాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. విద్యార్ధులకి చదువుపై శ్రద్ద అవసరం. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులను కొనితెచ్చున్నవారు అవుతారు.
కన్య: జీవితభాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల నుండి వచ్చిన ఆహ్వనాలు ఆశ్చర్యపరుస్తాయి. అనుకోని విధంగా ధన, వస్తు లాభాలు పొందుతారు. భూవివాదాలు తీరి లబ్ధిపొందుతారు.
తుల: ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక. ఋణ బాధలు తీరి ఊరట చెందుతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. సన్నిహితులకి సహాయసహకరాలు అందిస్తారు. క్రయవిక్రయాలలో లాభాల బాట పడతాయి.
వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. దూరపు బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు.
ధనస్సు: ఉద్యోగస్తులు పదోన్నతులు పొందుతారు. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కొత్త పనులు చేపట్టిన సకాలంలో పూర్తి చేస్తారు. అధికారుల మెప్పు పొందుతారు. ఋణాలు బాధలు తీరుతాయి. సంతానానికి కార్య జయం లభిస్తుంది.
మకరం: ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి. అలసట ఎక్కువై అనుకున్న పనులలో జాప్యం జరుగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. స్వల్ప ధన లాభం ఉంటుంది.
కుంభం: ముఖ్యమైన నిర్ణయాలలో పెద్దలు, జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి. కోపతాపాలకు దూరంగా ఉండండి. భూవివాదాలు తీరుతాయి. నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువుల నుండి ఆదరణ అంతగా అందదు. స్వల్ప జాగ్రత్తలు అవసరం.
మీనం: మంచి పనులు చేయాలని సంకల్పించుకుంటారు. కానీ కార్యాచరణలోకి రావు. అదే మీ పరపతిని తగ్గిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. ప్రముఖుల కలయిక. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121