శ్రీ
గురుభ్యోన్నమః |
శ్రీ
మహాగణాధిపతయే నమః |
శివాయ
గురవే నమః
కార్తీకమాసం
ఎప్పటి నుంచి ప్రారంభం,
కార్తీకమాసంలో
ముఖ్యమైన పర్వదినాలు మరియు
కార్తీక మాసం విశిష్టత గురుంచి
తెలుసుకుందాం
"న
కార్తీక నమో మాసః
న
దేవం కేశవాత్పరం!
నచవేద
సమం శాస్త్రం
న
తీర్థం గంగాయాస్థమమ్"
అని
స్కంద పురాణంలో పేర్కొనబడింది.
అంటే
కార్తీక మాసానికి సమానమైన
మాసము లేదు.
శ్రీ
మహావిష్ణువుకు సమానమైన దేవుడు
లేడు.
వేదముతో
సమానమైన శాస్త్రము లేదు గంగతో
సమానమైన తీర్థము లేదు.”
అని
అర్ధం.
కార్తీకమాసం
శివ,కేశవులిద్దరికీ
అత్యంత ప్రీతికరమైన మాసం.
ఏటా
దీపావళి మర్నాడే కార్తీకమాసం
ప్రారంభమవుతుంది.
కానీ
ఈ ఏడాది దీపావళి మర్నాడు
కాకుండా రెండో రోజు నుంచి
కార్తీకమాసం మొదలవుతోంది.
సూర్యోదయానికి
పాడ్యమి ఉన్న తిథే నెల
ప్రారంభానికి సూచన.
ఎందుకంటే
కార్తీక స్నానాలు చేసేది
బ్రహ్మమూహూర్తంలోనే.
అందుకే
నవంబరు 12
దీపావళి
మర్నాడు నవంబరు 13
సోమవారం
సూర్యోదయానికి అమావాస్య
ఉంది.
అందుకే
నవంబరు 14
మంగళవారం
సూర్యోదయం సమయానికి పాడ్యమి
ఉండడంతో ఆ రోజు నుంచి ఆకాశదీపం
ప్రారంభమవుతోంది.
అంటే
నవంబరు 14
మంగళవారం
నుంచి కార్తీక మాసం మొదలవుతోంది.
•
నవంబరు
17
శుక్రవారం
నాగుల చవితి
•
నవంబరు
20
కార్తీకమాసం
మొదటి సోమవారం,
కార్తావీర్య
జయంతి
•
నవంబరు
24
శుక్రవారం
క్షీరాబ్ది ద్వాదశి
•
నవంబరు
26
ఆదివారం
జ్వాలా తోరణం
•
నవంబరు
27
సోమవారం
-
కార్తీకమాసం
రెండో సోమవారం,
కార్తీకపూర్ణిమ
•
డిసెంబరు
13
బుధవారం
పోలి స్వర్గం
మన
భారతీయ సంస్కృతిలో కార్తీకమాసం
వచ్చింది అంటే ఆ నెల రోజులు
పండుగదినాలే!
అందులోను
కార్తీకమాసం ఈశ్వరారాధనకు
చాలా ముఖ్యమైనది.
దేశం
నలుమూలలా ఉన్న వివిధ
ఆలయాలలో
రుద్రాభిషేకాలు,
హోమాలు,
లక్ష
బిల్వదళాలతో పూజలు,
అమ్మవారికి
లక్షకుంకుమార్చనలు,
విశేషంగా
జరుపుతూ ఉంటారు.
అలా
విశేషార్చనలు జరిపే భక్తులకు
సదాశివుడు ప్రసన్నుడై
కొంగుబంగారంలా సంతోషం
కలిగిస్తాడు.
కాబట్టి
ఆ స్వామికి ‘ఆశుతోషుడు’ అనే
బిరుదు వచ్చింది.అందుకే
మన హిందువులు కార్తీకమాసం
నెలరోజులూ అత్యంత నియమనిష్టలతో
ఉంటారు.
ఈ
పరమ పవిత్రమైన కార్తీక మాసంలో
ప్రతిరోజు లక్ష్మి ప్రమిదలలో
(లక్ష్మి
ప్రమీద అంటే ఆవు పేడతో చేసిన
ప్రమిద అని అర్థం).
ఈ
లక్ష్మి ప్రమీదను అర నిమషం
పాటు నీటిలో ఉంచి తీయాలి
తరువాత ఆవు నేయి వేసి ఓం నమశివాయ
వత్తులతో ఉదయం సూర్యోదయం కి
ముందు మరియు సూర్యాస్తమం
తరువాత వెలిగించినట్లైతే
ఆయురారోగ్యాలు,
సిరి
సంపదలతో అష్టఐశ్వర్యాలతో
తులతూగుతారని మన శాస్త్రవచనం.
ప్రతి
రోజు కుదరని పక్షంలో నిత్యం
మమయులుగా ఉదయం సాయంత్రం
వెలిగించండి.
అయితే
కార్తీక సోమవారాలు,
కార్తీక
పౌర్ణమి,
క్షీరాబ్ది
ద్వాదశి మొదలైన పర్వదినాలలో
తప్పని సరిగా
సూర్యోదయంకి
ముందు మరియు సూర్యాస్తమం
తరువాత వెలిగించడం వలన మంచి
పొందగలుగుతారు.
సర్వేజనా
సుఖినో భవంతు,
!
లోకాసమస్తా సుఖినోభవంతు..!
ఓం
శాంతి శాంతి శాంతిః