వార ఫలాలు 12-11-2023 నుండి 18-11-2023 వరకు

మేషం: మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఎదో ఒకరకంగా ఉద్యోగం నందు, పని చేసే చోట ఆర్ధిక లాభములు ఉంటాయి. అయితే ఎక్కడైనా సరే ఇతరుల తగాదాలకు, వ్యవహారములకు  కొంత దూరంగా ఉండండి. అభిప్రాయభేదములు వచ్చే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకున్న ఫలితాలుంటాయి. కొత్త పనులు, ప్రాజెక్టులు వంటి వాటి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి.  సలహాలు, సంప్రదింపులు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ వద్దు. నిదానంగా ఆలోచించుకుని నిర్ణయములు తీసుకోండి. ఏదైనా ఒక విషయం గురించి అతిగా ఆలోచించడం కానీ. పట్టుదలకు పోవడం కానీ మంచిది కాదు. 

డబ్బు ఎంత ఖర్చు అయినప్పటికీ అనుకోని విధంగా అవసరాల మేరకు చేతికి అందుతాయి. అనుకున్న  పనులు పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త జాగర్తవహించాలి. విద్యార్థిని, విద్యార్థిని, విద్యార్థులకు మంచి అనుకున్న ఫలితములుంటాయి. పోటీ పరీక్షలు, క్రీడల యందు విజయం లభిస్తుంది. శారీరక ఆరోగ్యం  బాగుంటుంది. అయితే మీ మానసిక ఆందోళన, ఆతురత వలన అశాంతి చోటు చేసుకుంటుంది. ఏ విషయాన్ని అయినా భూతద్దం లో చూడడం మంచిది కాదు. నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండడం శ్రేయస్కరం.


వృషభం: ఉద్యోగస్తులకు సానుకూలత ఏర్పడుతుంది. పని చేసే చోట, కార్యాలయాలలో అందరితో కలయిక, స్నేహవర్గంతో సాన్నిహిత్యం లభిస్తాయి. శత్రువర్గం ఉన్నట్లైతే వారి నుండి కూడా కొంత సానుకూలత ఏర్పడుతుంది. మీరు తలపెట్టిన నూతన పని ఏదైనా సత్ఫలితాలనిస్తాయి. వ్యాపారస్తులకు వ్యవహారములు మంచి ఫలితాలు ఉండే అవకాశములు ఉన్నాయి.  వ్యవహారములు పట్ల పెద్దవారి నుండి సహాయ సహకారములు తీసుకోవడం మంచిది. లాభములు వచ్చినప్పటికీ అధికమైన ఖర్చులు, పెట్టుబడులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సర్వ దుఃఖములు తొలగిపోయినట్లు అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. 

నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి మంచి ఫలితములుంటాయియి. వివాహ ప్రయత్నములు చేసే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు బాగుంటుంది, అయితే పోటీ పరీక్షల యందు, విజయం సాధిస్తారు. మంచి ఉత్తీర్ణత లభిస్తుంది. కొత్త కోర్సులు నేర్చుకునే వారికీ, విదేశీ యానమునకు వెళ్లేవారు చేసే ప్రయత్నములు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో జీవిత భాగస్వామితో వైరములు రాకుండా జాగ్రత్త వహించండి. బయట టెన్సన్స్ కుటుంబలో చూపించక పోవడం మంచిది. మీ తెలివి తేటలతో ఏపనైనా కార్యానుకూలంగా మార్చుకోండి.


మిథునం: జాగ్రత్త వహించినట్లైతే ఉద్యోగంలో మంచి ఫలితములుంటాయి. ఉద్యోగస్తులకు కార్యాలయములలో, పని చేసే చోట శత్రువర్గం ఏదైనా ఉన్నట్లైతే కొంత జాగ్రత్త వహించాలి. మిమ్మల్ని చెడుగా ప్రచారం చేసే వాళ్ళు, మీ మీద లేనిపోని నిందలు వేసేవారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండండి. మీ గురించి కానీ, ఇతరుల గురించి కానీ ఏదైనా రహస్యములు వంటివి, వ్యవహారములు వంటివి ఎవరితో చర్చించడం అంత మంచిది కాదు. మాట్లాడేటపుడు జాగ్రత్త వహించండి. మంచి సానుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ప్రజాభిమానము, ప్రజాదరణ లభిస్తుంది. ఎప్పటి నుండో మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం కనబడుతుంది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. బంధువుల నుండి కొంత ఆందోళన కరమైన వార్తలు  వినడం వంటివి జరుగవచ్చు. 

సంతానం యొక్క ఆరోగ్య విషయములలో శ్రద్ద వహించండి.  కుటుంబ పరంగా కొంత మనస్పర్థలు, మెంటల్ టెన్సన్స్ ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యవహారములు విషయంలో కొంత నిరాశ ఏర్పడే అవకాశములు ఉన్నాయి. స్నేహితులతో వినోద యాత్రలు, పుణ్య క్షేత్ర సందర్శనములు జరుగవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితములుండె సమయం అని చెప్పవచ్చు. ప్రశంసలు అందుకుంటారు.  నూతన విద్య ప్రయత్నములు చేసేవారికి, కొత్త కోర్సులలో చేరుటకు  మంచి సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నములు వాయిదా పడే అవకాశములు ఉన్నాయి. పట్టుదలతో ముందుకు సాగండి.


కర్కాటకం: బంధు మిత్రులతో భిన్నాభిప్రాయములు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఇబ్బంది పెట్టె అవకాశములు ఉన్నాయి. ఋణములు, లోన్లు వంటి వాటి విషయంలో ఒత్తిడిలు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు అధికారులనుండి పని ఒత్తిడి, చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చు. పని విషయంలో చాలా ముందు చూపు కలిగి ఉండడం మంచిది. నూతన వస్తువులు కొనుగోళ్లు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దైవానుగ్రహం కలిగి వుంటారు. వ్యాపారస్తులకు కొంత అనవసరమైన శ్రమ ఉండే అవకాశములు ఉన్నాయి. పలుకుబడి పెరుగుతుంది. నలుగురిలో మాట గౌరవం పెరుగుతుంది. ఆర్ధికాభివృది ఎలా ఉన్నప్పటికీ గౌరవం పెరిగిందనే ఆనందం కలుగుతుంది. 

కుటుంబంలో జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ అభిప్రాయభేదములు ఉండే అవకాశములు ఉన్నాయి. ఏదైనా అనుకున్న ప్రయాణములు అనుకోని విధంగా మారడం కానీ, ఎదో ఒక కారణంగా వాయిదా పడడం కానీ జరగవచ్చు. వివాహం కానీ వారికి వివాహ ప్రయత్నములు చేయడం మంచిది. అనుకూలమైన ఫలితములుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగర్త వహించండి. ఉదరమునకు సంబంధించిన చిన్న పాటి ఇబ్బందులు ఉండవచ్చు. ఆహార నియమాల విషయంలో జాగర్త వహించాలి. విద్యార్థిని విద్యార్థులకు సామాన్య ఫలితములు గోచరిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకుండా పట్టుదలతో ముందుకు సాగండి.


సింహం: అన్ని విధముల అనుకూలమైన ఫలితములుంటాయని చెప్పవచ్చు. అలాగే ట్రాన్సుఫర్లు, ప్రమోషన్లు వంటి ప్రయత్నములకు మంచి సమయం అని చెప్పవచ్చు. అధికారులనుండి ప్రశంసలు అందుకుంటారు. అలాగే నూతన  ఉద్యోగ ప్రయత్నములు అనుకూలిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.  సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. 

వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు.  ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఏదైనా ఒక కొత్త పని మొదలు పెట్టుటకు అనుకూలం. వివాహ ప్రయత్నములకు కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. సంతాన పరముగా కూడా అనుకూలత ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి లాభములు ఉంటాయి. బంధువర్గంలో శుభకార్యక్రమములకు వెళ్లే అవకాశములు ఉన్నాయి. అయితే ఎన్ని విధములుగా బాగున్నప్పటికీ అంతర్గత విమర్శలు తప్పవు. మాట్లాడేటప్పుడు తగాదాలు వచ్చే విధంగా, కోపంగా మాట్లాడడం మంచిది కాదు. మీరు ఆత్మ విశ్వాసంతో మాట్లాడినప్పటికీ, ఎదుటి వారికి అహంకారంగా అర్ధమయ్యే అవకాశములు ఉన్నాయి. కాబట్టి సాఫీగా ముందుకుసాగడం చెప్పదగ్గ సూచన.


కన్య: విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. విద్యయందు శ్రద్ధాసక్తులు పెరిగే అవకాశములు ఉన్నాయి. అలాగే నూతన విద్యా ప్రణాళికలు  అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కార్యాలయములలో, పని చేసే చోట కొంత వంచనకు గురి అయ్యే అవకాశములు ఉన్నాయి.  అధికారులతో పని ఒత్తిడి కూడా ఉండవచ్చు. కాబట్టి ఎవరిని పడితే వారిని నమ్మడం మంచిది కాదు. ఏదైనా విషయమునకు పట్టుదలకు పోవడం, అతిగా ఆలోచించడం మంచిది కాదు. వ్యాపారస్తులకు కొంత  ఉన్నప్పటికీ మాట విషయంలో నిదానంగా ఉండడం మంచిది.  

ఖర్చులు అనుకున్న దాని కంటే ఎక్కువ అవ్వడం మనస్థాపానికి కారణమవుతుంది. ఐతే ఆర్ధికంగా డబ్బు రూపంలో కనబడకపోయినా వ్యాపార అభివృద్ధి కనబడుతుంది. నూతన వస్తూ, వాహనాలు కొనుగోలు చేసే అవకాశములు ఉన్నాయి.  బయట ఎన్ని వ్యవహారములు, సమస్యలు ఉన్న కుటుంబ పరంగా సంతోషం లభిస్తుంది. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారములు అందుతాయి. మీ టెన్షన్లు, ఆఫీసులలో ఉండే సమస్యలు ఇంటిలో కుటుంబ సభ్యుల మీద చూపించడం మంచిది కాదు. ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోండి. ఖర్చులు అధికం అవుతాయి. స్నేహితుల పట్ల కూడా కొంత జాగ్రత్త వహించండి. లేనిపోని హామీలకు పోవద్దు. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. 


తుల: కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. వ్యాపారము నందు ప్రతికూలమైన ఫలితాలు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఆర్ధికంగా కొంత నష్టములు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. సొంత వారి వలన ఇబ్బందులు, చిన్న పాటి నష్టములుండవచ్చు. ఏదైనా ఒక వ్యవహారము విషయంలో అనుకున్న దాని కంటే  ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పైఅధికారులతో ఇబ్బందులు, అనుకున్న పనులు నెరవేరక పోవుట జరుగవచ్చు. కాబట్టి కొత్త ప్రయత్నములు చేయకుండా నిదానంగా వృత్తి నిర్వహణ  చేసుకొనుట మంచిది.  మార్పులకు మంచి సమయం కాదు. 

అతికష్టం మీద పనులు నెరవేరుతాయి. కొంత శ్రద్ద ఎక్కువ పెట్టడం మంచిది. అయితే వారం ద్వితీయార్థంలో సానుకూలత ఏర్పడుతుంది. కుటుంబ పరంగా చిన్న పాటి విరోధములు, మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు కోపాన్ని ప్రదర్శించడం మంచిది కాదు. అవమానములు ఎదుర్కొనే అవకాశములు ఉన్నాయి.  లేనిపోని ఆందోళనలు మంచిది కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. విద్యార్థిని విద్యార్థులకు వృధా ప్రయాసలు పడే అవకాశములు ఉన్నాయి. అనుకున్న ఫలితములు గురించి ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది.


వృశ్చికం: ఎన్ని అడ్డంకులు, చిక్కులు ఎదురైనప్పటికీ కుటుంబం యొక్క అండదండలు ఉన్నాయన్న తృప్తి లభిస్తుంది.  మన కోపంతో సరిగా అర్ధం చేసుకోలేకపోయామే అన్న విచారం ఏర్పడుతుంది. కోపమును నియంత్రించుకోండి. ఏదైనా కష్టం వచ్చినపుడు, ఇప్పుడు అసలు మనవారెవరు, పరాయివారెవరు అనే విషయం ఖచ్చితంగా తెలుసుకుంటారు. కుటుంబ పరంగా ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట శత్రువర్గం నుండి వ్యతిరేఖారోపణలు వంటివి ఎదురయ్యే అవకాశములు ఉన్నాయి. మీరు కోపం చూపించే సమయం కాదని గుర్తు పెట్టుకోండి. తన కోపమే తనకు శత్రువు అన్నట్టు జరుగవచ్చు. 

వర్క్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి కొంత సహనం ఓర్పు వహించడం మంచిది. వ్యాపారస్తులకు లాభములు ఉన్నప్పటికీ అనేక విధములుగా ఖర్చు అయ్యే అవకాశములు ఉన్నాయి, ఇంత కష్టపడి చేస్తున్నాం ఫలితములు మీరు ఆశించినంత లేకపోవడం వలన అసహనమునకు గురి అవుతారు. ఆరోగ్య పరంగా చిన్నపాటి సమస్యలు వంటివి ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. విద్యార్థినీ విద్యార్థులకు కొంత జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా చదుకోవలసిన సమయం అని చెప్పవచ్చు. నిర్లక్ష్యం చేయవద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. మేధాదక్షిణా మూర్తి రూపు ధరించడం శ్రేయస్కరం.


ధనస్సు: ఉద్యోగస్తులకు అన్ని విధముల సాఫీగా ముందుకు సాగే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగ పరంగా ఇబ్బందులు ఉన్నట్లైతే అవికూడా తొలగిపోతాయి. ప్రశంసలు అందుకునే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు సానుకూలత ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, టెక్నీకల్  రంగం వారికి అభివృద్ధి బాగుంటుంది.  స్వల్ప ఒడిదుడుకులు చిన్నపాటి మాటలు తప్పవు, అవి ఈర్ష్యా అసూయాల్తో అవిచే మాటలు అవుతాయి, కాబట్టి పట్టించుకోకండి. మానసిక ధైర్యం పెంచుకోండి. ఆర్ధిక లాభములుంటాయి. స్థిరాస్తి వృద్ధి చేయాలనుకునే వారికి, నూతన గృహమునకు ప్రయత్నములు చేసే వారికి అనుకూల ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి. నూతనంగా ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి మంచి అవకాశములు ఎదురవుతాయి. 

ముక్యంగా యువత చేడు వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అవి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంది. అరె ఎంతో బాగున్న మనం ఇలా ఎందుకు ట్రాప్ లో పడ్డామే అని బాధపడతారు. చేడు సావాసాలు తగ్గించుకోవాలి. మీరు నిదానంగా   ఉన్నప్పటికీ స్నేహితుల వలన మొహమాట పడి లేనిపోని అవమానములు తెచ్చుకోకండి.  మంచిచెడు విచక్షణ కలిగి, భవిష్యత్తు ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగడం చెప్పదగ్గ సూచన. విద్యార్థినీవిద్యార్థులకు పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న విజయాలు సంప్రాప్తిస్తాయి. ఏకాగ్రతే మీకు మంచి అభివృద్ధికి కారణమవుతుంది. ఆరోగ్య పరంగా   గతంలో పెద్ద సమస్యలు ఉన్నవారికి కొంత ఊరట లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. 


మకరం: కోపాన్ని, నిర్లక్ష్యమును విడిచి పెట్టి  ముందుకు సాగితే అనుకున్న ఫలితాలను పొందగలరు. శ్రమ అధికం అవుతుంది. వ్యాపారస్తులకు మంచి ఆర్ధిక లాభములు గోచరిస్తున్నాయి. ఆర్ధిక లాభములతో పాటు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్నది సాధించాం అనే ఆనందం ఏర్పడుతుంది. చిన్నపాటి సమస్యలు ఎప్పుడు ఉండేవే అని పట్టించుకోకండి. మొత్తం మీద ఒక దానిలో కాకపోతే ఇంకొక దానిలో అన్నట్టుగా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. విలాసవస్తువులు, అలంకరణకు సంబంధించిన జ్యుయలరీ వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆదాయం పట్ల స్థిరమైన నమ్మకం ఏర్పడుతుంది. 

కుటుంబ పరంగా పెద్దవారి నుండి సహాయ సహకారములు లభిస్తాయి. స్నేహితులతో సాన్నిహిత్యం లభిస్తుంది. కుటుంబంలో అనుకున్న పనులు నెరవేరుస్తారు. వివాహ ప్రయత్నములు చేసే వారికి అనుకూలం. కుటుంబంలో శుభకార్యక్రమముల విషయంలో ఒక నిర్ణయమునకు వస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కష్టమునకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.


కుంభం: కొంత సానుకూలత ఏర్పడి, మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా కూడా అభివృద్ది  తక్కువగా ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలున్నట్లైతే పరిష్కారం అవుతాయి. అయితే పెద్ద వారితో మాటాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు  జాగ్రత్త  వహించండి. తగాదాలకు దూరంగా ఉండండి. సహనం, ఓర్పు అవసరము. వ్యాపారస్తులకు అనుకున్న పనులు నెరవేరుతాయి. అయితే ఏదైనా ప్రాజెక్ట్, కాంట్రాక్టు విషయములలో ప్రయాణములు చేయవలసి వచ్చినట్లైతే కొంత ఆలోచించి ప్రయాణములు చేయడం మంచిది. దూర ప్రయాణముల విషయంలో జాగ్రత్త వహించండి. ఏలినాటి  శని నడుస్తున్నది వలన, 8 శని వారలు శని కి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన.

వ్యవహారములు కొంత మానసిక ఒత్తిడి తరువాత నెరవేరుతాయి.  కుటుంబ పరంగా కూడా మిశ్రమ ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. కుటుంబంలో పెద్దవారితో కానీ, బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. మీరు మాట్లాడే మాటలు ఎదుటి వారు తప్పుగా ఆరోపణలు చేసే అవకాశములు ఉన్నాయి.  అలాగే ఖర్చులు అధికం అయ్యే అవకాశములు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. కొత్త వ్యవహారములు, పెట్టుబడుల విషయంలో తొందరపడి నిర్ణయములు  తీసుకోవడం మంచిది. విద్యార్థినీ విద్యార్థులకు మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. కష్టపడిన దానికి ఫలితములు ఉంటాయి.


మీనం: అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పైఅధికారులతో పని ఒత్తిడిలు, విరోధములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులుకు, బదిలీలకు మంచి సమయం కాదు. వ్యాపారస్తులకు అనాలోచిత పెట్టుబడులు పెడితే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశములు ఉన్నాయి. పేరు ప్రతిష్టలకు కూడా భంగం వాటిల్లే అవకాశములు ఉన్నాయి. అయితే ఆందోళన చెందకండి. మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని, మీ  లబ్ధిపొందిన వారే  మిమ్మల్ని దుష్ప్రచారం చేసే అవకాశములు ఉన్నాయి. అయితే ఈ ఈర్ష్యా అసూయలతో చేసే పనులు శాశ్వతం కాదు.  

మీ కోపాన్ని ప్రదర్శించడం మంచిది కాదు. తగాదాలకు, వివాదాలకు దూరంగా వుండండి. ఆర్ధిక పరమైన నష్టములు ఉండే అవకాశములు ఉన్నాయి. కాబట్టి కొత్త వారి పట్ల కూడా అతినమ్మకమును ఉంచుకోవడం మంచిది కాదు. జీవిత భాగస్వామి తో చిన్న పాటి మాట పట్టింపు వచ్చే అవకాశము ఉంది. మీ ఆరోగ్యం, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. అయితే మానసిక ధైర్యంతో ముందుకు సాగండి. విజయములు నిదానంగా ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి ఎదో ఒక విధంగా డబ్బు చేతికి అందడం వలన అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. విద్యార్థిని విద్యార్థులకు సోమరితనం పక్కకు పెట్టి కష్టపడి కాకుండా ఇష్టపడి చదవడం చెప్పదగ్గ సూచన. ఏదైనా ఒక కోర్స్ చేసేటప్పుడు ఆది పూర్తి కాకుండా వేరే దానిమీదకు ధ్యాస మళ్లడం వంటివి ఏర్పడతాయి. ముందు ఒక సబ్జెక్టు ఎంచుకున్నాక  దాని పట్ల శ్రద్ద వహించండి.


                                            


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121