శని..శని..శని అని పిలువకూడదు... శనైశ్చరుడు అనే పిలవాలి.. ఎందుకు?
శనైశ్చరుడు ప్రభావం వద్దే వద్దు అనుకునే వారే అధికంగా ఉంటారు.
ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికి పోతారు. కానీ శనైశ్చరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే.. శనిప్రభావంతో ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం. శనైశ్చరుడిని ఆరాధిస్తాం.
అదెలాగంటే? ''నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం'' అంటారు.
నీలాంజనం- అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడని,
రవిపుత్రం అంటే.. సూర్యుని పుత్రుడని,
యమాగ్రజం-అంటే యమునికి సోదరుడని,
ఛాయా మార్తాండ సంభూతం- ఛాయాదేవికి మార్తాండుడికి అంటే
సూర్యునికి జన్మించిన వాడైన శనీకి నమస్కరిస్తున్నానని అర్థం.
ఈ
శ్లోకాన్ని స్మరిస్తే శనైశ్చరుడు
మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శనైశ్చరుడిని
మనం ఎప్పుడు శని శని శని అని
పిలవకూడదు.
"శనైశ్చరుడు"
అని
మాత్రమే అనాలి.
ఈశ్వర శబ్ధం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. శివుడిని ఈశ్వరుడు అంటాం. మహేశ్వరుడు అని కూడా అంటాం.
అలాగే వేంకటేశ్వర స్వామి వారి పేరులో కూడా వెంకట ఈశ్వరుడు అని వుంది. ఈశ్వర శబ్ధం ఉండబట్టే వెంకన్న కలియుగ దైవంగా మారాడు. కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు.
అలాగే శనినామధేయంలోనూ ఈశ్వరుడు (శనైశ్చరుడు) అనే శబ్ధం రావడంతో శనైశ్చరుడు కూడా శివునిలా, వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం.
శనైశ్చరుడంటే భయపడాల్సిన అవసరం లేదు.
నవగ్రహాలను పూజించేటప్పుడు శనైశ్చరుడిని భక్తిగా నమస్కరించుకుంటే సరిపోతుంది. అలాగే ఆయనకు నీలం రంగు, నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించడం.. శనైశ్చరునికి ప్రీతికరమైన చిమ్మిలి నివేదనం చేయడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా శనైశ్చరుని అనుగ్రహం పొందవచ్చు.
తద్వారా శనిగ్రహ ప్రభావంతో ఏర్పడే దోషాలు.. యోగ ఫలితాలను ఇస్తాయి. శనైశ్చరుని ప్రభావంతో కొన్ని కష్టాలు కలిగినా.. ఆయనను పూజించడం, గౌరవించడం ద్వారా ఆయన అనుగ్రహం లభిస్తుంది.
కానీ శనిప్రభావం రావాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే శనైశ్చరుడు మిమ్మల్ని కొద్దిగా పీడించాంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించి వెళ్తాడు. శనైశ్చరుడి ప్రభావం వద్దనుకుంటే.. యోగం, ఐశ్వర్యం కూడా వద్దనుకోవాల్సిందే. శనైశ్చరుడిని చక్కగా నీలిరంగు పుష్పాలతో అలంకరణ చేయించి.. పూజించండి.
శివారాధన చేయాలి. హనుమంతారాధన, అయ్యప్ప స్వామి ఆరాధన చేయడం ద్వారా శనైశ్చరుని అనుగ్రహం పొందవచ్చునని మన శాస్త్రవచనం.
ఓం శనైశ్చర స్వామియే నమః