మేషం: వారికి వారం కొంత ఓర్పు, సహనం వహించవలసిన సమయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా కుటుంబ పరంగా కుటుంబంలో పెద్దవారితో తగాదాలు, మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త వహించండి. మీ యొక్క మంచితనం తో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. ఎవరు ఎలా ఉన్నప్పటికీ మనం మనలాగే ఉండాలి విచక్షణ కోల్పోకూడదు అన్నటుగా ప్రవర్తిస్తారు. మాట విషయంలో ఎవరిని నమ్మవద్దు, మీ ముందు ఒకలాగ మీ వెనుక ఒకలాగా మాట్లాడే వారి వున్నారు. కాబట్టి ఎవరు ఎం చెప్పినా విని విననట్టు ఊరుకుని మీ పద్దతిలో మీరు మసలుకోవడం చెప్పదగ్గ సూచన. మీ మంచితనంతో మీరు మీ యొక్క గౌరవాన్ని కుటుంబంలో నిలబెట్టుకుంటారు. ఉద్యోగ పరంగా కూడా కొంత జాగ్రత్త అవసరం. చేసే పనులలో ఆటంకాలు వున్నాయి, బుద్ధి బలంతో ముందుకు సాగండి.
ఆలోచించి పనులు ప్రారంభించడం మంచిది. మనసును నిర్మలంగా ఉంచుకుని అభివృద్ధి బాటలు పయనించండి మంచి ఫలితాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అలసంగ్య అయినా వచ్చే సూచనలు వున్నాయి. ఆందోళన చెందకండి. పనిచేసే చోట, కార్యాలయాలలో మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి నిదానంగా ఉంటుంది. వ్యాపారస్తులకు విలాస వస్తువులు, బట్టలు, బంగారం వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన లాభములు ఉంటాయి. పెట్టుబడులకు తగిన విధంగా సంతృప్తి అనేది లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. నూతన వ్యాపారాలు పెట్టడానికి ప్రయత్నిస్తారు అవి సానుకూల ఫలితాలనిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడి చదవవలసిన సమయం అని చెప్పవచ్చు. పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు వరిస్తాయి. ఆరోగ్య పరంగా శారీరక అనారోగ్యం కంటే అలసట, అశాంతి చోటు చేసుకుంటాయి.
వృషభం: వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి ఉన్నపటికీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, వ్యవహారాలలో మీ ఆలోచన శక్తి మెరుగు పడుతుంది. సహా ఉద్యోగస్థులతో కానీ, పని చేసే చోట కానీ వైరము తెచ్చుకునే విధంగా ఉండడం, ఉద్రేకంగా మాట్లాడడం మంచిది కాదు. నిదానమే ప్రధానం అన్నట్టు వ్యవహరించండి. వ్యాపారస్తులకు, సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. పెట్టుబడులు విషయంలో జాగర్త వహించండి. భాగస్వామి వ్యాపారంలో జాగర్త వహించాలి. వ్యాపార పరంగా, ఆర్ధిక పరంగా అభివృద్ధి కనబడుతుంది. అయితే కుటుంబంలో కానీ, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్త వహించండి.
సంతాన పరంగా వారి విజయాలు మీకు ఆనందాన్ని కలుగచేస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కొంత అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాల విస్జయాలు చర్చకు వస్తాయి. అందరికంటే మీరే ఒక రూపాయి ఎక్కువ పెట్టవలసి వస్తుంది. మన కుటుంబ సభ్యులేకదా అని సర్దుకుపోతారు. విద్యార్థిని విద్యార్థులకు ఏదైనా ఒక పనిని చేయదలచుకొంటె వాయిదాలు వేయకుండా చేసుకోవడం మంచిది. వారం ప్రథమార్ధంలో అనుకూలమైన ఫలితాలుంటాయి. నిర్లక్ష్యం చేయకుండా పని చేసుకోవడం మంచిది. విదేశీయానానికి సంబందించిన విషయాలు ఫలిస్తాయి. చేసే ప్రతీ పనిలో పట్టుదలతో ఉండడం, ఒక నిర్ణయం తీసుకున్నాక అశ్రద్ధ చేయకుండా ఉండడం చెప్పదగ్గ సూచన.
మిథునం: వారికి ఈవారం అన్ని విధాలా కొంత ఇబ్బందులు, చికాకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంటా బయటా కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ లేనిపోని ఆటంకములు మిమ్మలను ఆలోచింపచేస్తాయి. అయితే కుటుంబ పరంగా కూడా జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఉండవచ్చు. కుటుంబ పరంగా వారు కోరే కోర్కెలు, చేసే ఖర్చులు మీకు వృధాగా అనిపిస్తాయి. ఋణములు విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. మాటలో కఠినత్వం అంత మంచిది కాదు. ఆలోచించి నిదానంగా మాట్లాడడం మంచిది. అలాగే ప్రయాణముల విషయంలో కూడా వృధా ఖర్చులుగా భావిస్తారు. అయితే ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఖర్చులు తప్పవు అనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఈవారం సామాన్యంగా ఉంటుంది. సానుకూలమైన ఫలితములుంటాయి.
నూతన ప్రణాళికలు, ప్రయత్నములు వాయిదాలు పడే అవకాశములు గోచరిస్తోంది. డబ్బును వృధా చేయకుండా భవిషత్తు కార్యాచరణం కోసం చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవి భవిషత్తు లో మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారస్తులకు లాభములు సామాన్యంగా ఉంటాయి, లాభముల కంటే పెట్టుబడులు అధికంగా ఉండే అవకాశములు ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు కార్యాచరణ చేస్తారు. స్థిరాస్తి వ్యవహారములు విషయంలో స్వల్ప ఆటంకములు ఎదురయ్యే అవకాశములు ఉన్నాయి. వ్యవహారముల పట్ల కంగారు పడకండి, ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయములు తర్వాత ఇబ్బంది పెట్టవచ్చు, కాబట్టి స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి, శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోండి. విద్యార్థిని విద్యార్థులు ఆలోచన శక్తి తో ముందుకు సాగండి. ఈరోజు మనం చదువుకంటే భవిష్యత్తు కార్యాచరణ బాగుంటుంది అని మరచిపోవద్దు.
కర్కాటకం: వారికి ఈవారం అత్యంత శుభదాయకమైన ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నవారికి కొంత ఊరట లభిస్తుంది. ఉద్యోగ పరంగా అభివృద్ధి ఉంటుంది. గతంలో మీకు ఇబ్బంది కలిగించిన వారిపై ఆధిక్యత, విజయం సాధించామన్న తృప్తి మీకు లభిస్తుంది. ధనాభి వృద్ధి బాగుంటుంది. నూతన వస్తువులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోళ్లు చేసే అవకాశం వుంది. వ్యాపారస్తులకు ప్రజాభిమానం లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా సానుకూలమైన ఫలితాలుంటాయి. వ్యవహారముల పట్ల మంచి కీర్తి, గౌరవం ఏర్పడతాయి. సానుకూలమైన ఫలితాలుంటాయి.
వివాహ ప్రయత్నములు చేసే వారికి అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. స్నేహితులతో, బంధువర్గంతో శుభకార్యములలో పాల్గొంటారు. ఎదో సాధించామన్న ఆనందం కలుగుతుంది. విద్యార్థినీవిద్యార్థులకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొంత విద్య యందు నిదానం ఏర్పడుతుంది. మొత్తం మీద కర్కాటకరాశి వారికి అన్ని విధముల బాగున్నప్పటికీ కొంత నిర్లక్ష్యం, అశ్రద్ధ వలన పనులు ఆలస్యం అవుతాయి, కాబట్టి మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి చేయడం ఉత్తమం. కొంత బద్దకమును తగ్గించుకోవడం చెప్పదగ్గ సూచన.
సింహం: వారికి ఈవారం వ్యవసాయదారులకు, వినోద రంగం వారికి అనుకూలమైన ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. స్నేహితులతో, బంధువులతో కలయిక ఏర్పడుతుంది. అయితే కుటుంబ పరంగా మాత్రం కొంత మాట పట్టింపులు ఏర్పడవచ్చు. జీవితభాగస్వామి నుండి కానీ, సంతానం నుండి కానీ మనస్పర్థలు వచ్చే అవకాశములు ఉన్నాయి. కొంత జాగ్రత్త వహించండి. కోపమును నియంత్రించుకోండి. ఆవేశం ఆలోచనని తప్పు తోవ పట్టిస్తుందనే విషయం గమనించండి, కొంత నిదానంగా ఆలోచించి మాట్లాడడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారాభివృద్ది ఉన్నప్పటికీ ఆర్థికాభివృద్ధి మీకు అసంతృప్తిని కలుగ చేస్తుంది. ఆదాయం ఎలా ఉన్నప్పటికీ అధికారం, విలువ పెరిగిందనే సంతోషిస్తారు. ఉద్యోగంలో మార్పులకు ఇది అంత మంచి సమయం కాదు.
కుటుంబంలో వారి అనారోగ్యముల కారణంగా మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి. శత్రువర్గం ఉన్నట్లైతే వారి నుండి విమర్శలు, ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. విలాస వస్తువుల, వాహనముల వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన సమయం. లాభములు బాగుంటాయి. వ్యాపారస్తులకు లాభములు అనుకున్నంత స్థాయిలో లేకపోయినప్పటికీ నష్టములు ఉండవు, పూర్తి మిశ్రమ ఫలితములుంటాయని చెప్పవచ్చు. ఆరోగ్య పరంగా శారీరక అనారోగ్యం కంటే మానసిక ఆందోళనలు, ఆత్రుత వంటివి ఉంటాయి. టెన్సన్స్ ఎక్కువ వలన శారీరక బలహీనత అనేది ఏర్పడుతుంది. నూతన విద్యా విషయములు, కోర్సులు వాటి గురించి స్నేహితుల సహాయ సహకారములు అందుతాయి. ప్రతి విషయాన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
కన్య: వారికి ఆర్ధికంగా అన్ని విధముల అభివృద్ధి ఉండే అవకాశములు ఉన్నాయి. స్నేహితులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మిత్రులతో లాభదాయకమైన సందర్భములు లభిస్తాయి. బంధువులతో వర్గంలో మీ మాట విలువ పెరుగుతుంది. మీరు మాట్లాడే సందర్భములలో శత్రు వర్గం వారు ఉన్నప్పటికీ వారి సైతం మెచ్చుకునే విధంగా మాట్లాడతారు. ఇంటా బయట పలుకుబడి పెరుగుతుంది. అయితే అన్ని వ్యవహారముల విషయంలో బాగున్నప్పటికీ కొన్ని చోట్ల మాటపట్టింపులు, విమర్శలు వచ్చే అవకాశములు ఉన్నాయి. వాటిని పట్టించుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఈవారం ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, అయితే ఎంత ఆర్ధికాభివృద్ధి ఉన్నప్పటికీ గతంలో ఉన్న రుణాలు, లోన్లు వంటి వాటి వలన కొంత ఖర్చులు అధికంగా కనిపిస్తాయి. అయితే అనుకున్న సమయానికి ఎదో ఒకరకంగా డబ్బు చేతిలో ఉండడం వలన అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు.
వ్యాపారస్తులకు సంగంలో గౌరవం పెరుగుతుంది. లాభనష్టముల విషయం పక్కకు పెట్టి ముందుకు సాగుతారు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన కలం. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందులేర్పడవచ్చు. కడుపు నొప్పి వంటివి, గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లైతే అవి ఇబ్బంది పెట్టె అవకాశములు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆహార నియమములు పాటించండి. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశములు ఉన్నాయి. విద్యార్థినీ విద్యార్థులకు ఈవారం బాగుంది, వీసా కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అయితే అన్ని విషయాలలో ఆచి తూచి అడుగులువేయాలి. పెద్దలు చెప్పింది మన మంచికే అని గ్రహించాలి.
తుల: వారికి స్వల్ప ఒడిదుడుకులు తప్ప అన్ని విషయములలో అనుకూలమైన ఫలితాలుంటాయనడంలో సందేహం లేదు. ఉద్యోగ పరంగా అభివృద్ధి, ఆదాయం అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా ఇంక్రెమెంట్స్, ప్రమోషన్స్ కూడా అందుకునే అవకాశములు ఉన్నాయి. అయితే ఉద్యోగ పరంగా అన్ని విధాలా బాగున్నప్పటికీ అధికారుల వలన భయం, పని ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు అనుకున్న ప్రాజెక్టులు రావడం, అలాగే వ్యవహారములు పట్ల మంచి ఫలితాలు ఉంటాయి. లాభములు బాగుంటాయి. ఈ ఉత్సాహాన్ని చూసి మరింత ధైర్యంతో ముందుకు సాగడానికి ఆలోచిస్తారు. కొంత రిస్క్ చేసినా అభివృద్ధి ఉండాలి అని తాపత్రయపడతారు. అన్ని కార్యక్రమములలో హుషారుగా పాల్గొంటారు.
అయితే ఖర్చులు అధికంగా అయినప్పటికీ లెక్క చేయకుండా ముందుకు సాగుతారు. అయితే ఇంత కష్టపడి అభివృద్ధి చెందినప్పటికీ కుటుంబం, సంసారం బాగున్నప్పటికీ బంధువులు, అయినవాళ్లే చిన్న చిన్న విషయాలకు మాట పట్టింపులు, విమర్శలు కొంత ఆందోళనకు గురిచేస్తాయి. ఇంత అధికారం, అన్ని విధాలా అభివృద్ధి ఉంది కూడా మాటలు పడుతున్నాం అనే వేదనకు కారణమవుతుంది. అయితే కుటుంబం, జీవిత భాగస్వామి అండదండలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, సంతాన సౌఖ్యం బాగుంటుంది. అలా వచ్చే విమర్శలకు అక్కర్లేని వాదనలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితులతో సాన్నిహిత్యం, వినోద యాత్రలు వంటివి ఆనందాన్ని ఇస్తాయి. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి, వివాహం కుదురుతుంది. విద్యార్థులకు కూడా మంచి ఫలితాలుండే సమయం అని చెప్పవచ్చు. ఏదైనా నూతన విద్యా, ఉద్యోగ ప్రయత్నములకు ధైర్యంగా ముందుకు సాగడం మంచిది.
వృశ్చికం: వారికి ఈవారం పూర్తి మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు ఆర్ధికంగా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి, ద్వితీయార్థంలో వ్యవహారములు అనుకూలంగా మారే అవకాశములు ఉన్నాయి. వ్యవహారములు, విషయములలో కొంత ధైర్యంతో ఉండండి. కోపం, కఠినమైన మాటలు ప్రదర్శించడం మంచిది కాదు. ఓర్పు సహనం చాలా అవసరం. ఉద్యోగస్తులకు కూడా అధికారులతో కొంత అసంతృప్తి ఏర్పడవచ్చు, మీ టెన్షన్ తో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగర్త వహించాలి, మీ యొక్క అంతర్గత విషయములు, ఉద్యోగ విషయములు కానీ, అలాగే వ్యాపార, ఆర్ధిక లావాదేవీ విషయములు, రహస్యములు వంటివి ఎవరితో పడితే వారితో చర్చించడం అంత మంచిది కాదు.
మీ ముందు బాగా మాట్లాడినప్పటికీ మీ వెనుక గోతులు తీసేవారు ఉంటారని గమనించండి. అలా అని అందరిని అనుమానించమని కాదు. జాగ్రత్తగా , కొంత గోప్యంగా ఉండడం మంచిది. ఎందుకంటే కొంత నమ్మక ద్రోహం అనేది ఏర్పడవచ్చు. మీకు ఇబ్బంది అనిపించిన వారి గురించి వేరొకరి దగ్గర మాట్లాడినప్పుడు వారు మీ గురించి తప్పుగా అనుకునే సందర్భములు ఏర్పడవచ్చు. ఆర్ధికంగా బాగుంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంసారంలో భద్రత ఏర్పడుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాలలో ఎక్కువ జోక్యం చేసుకోకపోవడం మంచిది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం, సాఫ్ట్ వేర్ రంగంలో నూతన ఉద్యోగావకాశములు కొరకు ఎదురు చూసే వారికి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్య పరంగా బాగుంటుంది, కొంత టెన్సన్స్ వలన భయం, తలనొప్పి వంటివి ఉండవచ్చు, శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.
ధనస్సు: వారికీ కొంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పవచ్చు. ధన నష్టంతో పాటు కొంత మీ కీర్తికి భంగం వాటిల్లే అవకాశములు ఉన్నాయి. అనుకున్న పనులలో కొద్దిపాటి అడ్డంకులు, కొంత ఆర్ధిక పరంగా అధిక ఖర్చులు అయ్యే అవకాశములు ఉన్నాయి. అంటే ఒక పది రూపాయలు ఖర్చు అయితే ఆ పని అవుతుంది అన్న చోట యాభై రూపాయలు ఖర్చు అవ్వవచ్చు. నిరాశ చెందకండి. సొంత వారు, బంధువులు మీకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నవారు కూడా ఏమీ చేయకపోవడం, పైగా మీ మీద విమర్శలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అయితే మీకంటే తక్కువ స్థాయి వారితో, లేదా మీ కింద పని చేసే వారి సహాయ సహకారములు అందుతాయి. కొత్త ప్రణాళికలు ఏదైనా ఉంటె వాయిదా వేసుకోవడం మంచిది, ప్రతికూలమైన ఫలితాలు ఎదుర్కొనవచ్చు. తప్పనిసరి అనుకున్న పనులు, ప్రయాణములు తప్ప చిన్న విషయాలకు కంగారు పడడం ముందుకు వెళ్లడం అంత మంచిది కాదు.
ఉద్యోగస్తులకు పైఅధికారులనుండి పని ఒత్తిడితో పాటు ఆలస్య ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. వివాహ ప్రయత్నములు చేసే వారికి సంబంధములు చాల వరకు దగ్గరదాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్లే అవకాశములు ఉన్నాయి. తాత్కాలికంగా పనులు అయిపోయినట్టు అనిపిస్తుంది. అయిపోయింది అనే సమయానికి వాయిదా పడుతుంది. ధైర్యయే సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు సాగండి. ఆరోగ్య పరంగా దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నట్లైతే కొంత జాగ్రత్త వహించండి. ఆరోగ్యము పట్ల శ్రద్ద వహించండి. వీసా కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి, ఏదైనా తప్పులు ఉంటే సర్దుకుకోవాలి తప్ప బయట పడకూడదు. దాని వలన ఇతరులకు చనువు ఇచిన్నవాళ్ళు అవుతారు. వ్యాపారస్తులకు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది, ఖర్చు విషయంలో జాగర్త వహించాలి, అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మకరం: ఈ వారం కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఏలినాటి శని ప్రభావం చేత ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ అనవసరమైన తగాదాలలోకి వివాదములలోకి వెళ్లడం మంచిది కాదు. ఎదో ఒక విధముగా వివాదములు తో పాటు మీ పేరు ప్రతిష్టలకు కూడా భంగం వాటిల్లే అవకాశములు ఉన్నాయి. కాబట్టి కోపం, ఫ్రస్ట్రేషన్ వంటి వాటిని అదుపులో ఉంచుకుని మసలుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కొంత మానసిక అశాంతి చోటు చేసుకుంటాయి. కుటుంబ పరంగా చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సౌఖ్యం ఉంటాయి. పెట్టుబడులలో, కానీ బయట నుండి మీకు రావాల్సిన అమౌంట్ విషయాలలో కొంత ఆలస్యం జరుగవచ్చు.
అయితే ఖర్చులు మాత్రం యధాతధంగా ఉండటమే కాకుండా మరింత పెరిగే అవకాశములు ఉన్నాయి. అవసరానికి డబ్బు చేతికి అందడంతో అనుకున్న పనులు అతికష్టం మీద నెరవేరుతాయి. యువత కూడా ప్రయాణములు చేసేటప్పుడు, వాహనములు నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నములు ఒక కొలిక్కి వస్తాయి. అయితే విపరీతమైన ఒత్తిడి ఉంటుంది తరువాత పనులు ఆకస్మికంగా నెరవేరుతాయి. అనవసరమైన ఆందోళనలు చెందకండి. ఓర్పు, సహనం తో ముందుకు సాగండి. దైవానుగ్రహం తోడువుంటుంది.
కుంభం: వారికి ఈ వారం అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు పూర్తి చేయడానికి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అభివృద్ధి, ఆదాయం బాగుంటుంది. రావాల్సిన బాకీలు వసూలు అవ్వడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఎప్పటి నుండో ఉండిపోయిన వ్యవహారములు వంటివి, ఇంక రావు అనుకున్న డబ్బు విషయములలో కొంత ప్రయత్నములు చేయడం మంచిది. అలాగే స్థిరాస్తి సంబంధించిన తగాదాలు, అడ్డంకుల విషయంలో కూడా కొంత సానుకూలత ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి సానుకూలమైన లాభములు, స్థిరాస్తి వృద్ధి అయ్యే అవకాశములు ఉన్నాయి.
అలాగే ఉద్యోగంలో ఇబ్బందులు, నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి ప్రయత్నములు సఫలీకృతం అవుతాయి. ప్రయత్నములు చేయండి. సాఫ్ట్ వేర్ రంగం వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యసనములు, విలాసముల కారణంగా ఇబ్బందులలోకి వెళ్లే అవకాశములు ఉన్నాయి. కాబట్టి వ్యసనములు ఉన్నవారు కొంత మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎంత కష్టపడినప్పటికీ, ఎంత అభివృద్ధి చెందినప్పటికీ అలవాట్లకు బానిస అయిన వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. యువత కూడా తస్మాత్ జాగ్రత్త వహించండి. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతాన పరంగా వారి అభివృద్ధి మీకు సంతోషాన్ని కలుగ చేస్తుంది. గౌరవం, తృప్తి లభిస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలుంటాయి. ఏది ఏమైనా అన్నిటా కొంత అభివృద్ధి కనబడుతుంది.
మీనం: వారికి శ్రమ అధికమయినప్పటికీ ఫలితములు అనుకూలంగా ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు గతంలో ఏర్పడిన చికాకులు, తగాదాలు, ఆర్ధిక ఇబ్బందులు కూడా తొలగినట్టు అనిపిస్తాయి. కొంత అభివృద్ధి అనేది ఆనందాన్ని కలుగ చేస్తుంది. భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. అదృష్టం కంటే కష్టే ఫలి అన్నట్టుకష్టం తర్వాత వచ్చే విజయం ఆనందం కలుగ చేస్తుంది. శత్రువర్గం గురించి మరచిపోయి ఇతరులతో పోటీ అనేది పెట్టుకోకుండా మీ అభివృద్ధి గురించి కార్యాచరణ చేయండి. మీగురించి మాత్రమే మీరు పోరాడండి. అటువంటి వారికి ఆ దేవుని అండదండలు తప్పక ఉంటాయి. ఇతరులతో పోటీ పెట్టుకుని మన పనులు అశ్రద్ధ చేసుకుని లేనిపోని చిక్కులు కొని తెచ్చుకోవద్దు. శుభ కార్యములలో పాల్గొన్న విషయములు సంతోషాన్ని ఇస్తాయి. కుటుంబ పరంగా, సంతాన పరంగా కూడా అన్ని విధముల అభివృద్ధి, సంతోషం ఏర్పడతాయి.
ఆరోగ్య విషయములు కొంత బాగుంటాయి. గతంలో ఏర్పడినవి, కుటుంబ పరంగా కూడా ఆరోగ్యములు బాగుంటాయి. నూతన ప్రణాళికలు, ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి మంచి ఫలితాలుంటాయి. అయితే ప్రయత్నములు అధికం చేయండి. వివాహ ప్రయత్నములు చేసేవారు వివాహ విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయమును తీసుకోవడం మంచిది. నిర్లక్ష్యం చేశామనే ఆలోచన ఏర్పడుతుంది. నిదానం మంచిదే కానీ ఆలస్యం అమృతమే కాదు అప్పుడప్పుడు విషం కూడా అవుతుంది. కొంత జాప్యం, అశ్రద్ధ చేయకండి. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగండి, అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించే అవకాశములు ఉన్నాయి. విద్యార్థులకు, నూతన విద్యా ప్రణాళికలకు మంచి సమయం, ప్రయత్నిస్తే అన్ని మంచి ఫలితాలుంటాయి. వీసా కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద ఈవారం ఆశాజనకంగా వుంది.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121