దక్షిణామూర్తి ఎవరు?

ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః



గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః

సదాశివుని విశ్వగురువుగా చూపే రూపమే దక్షిణామూర్తి. ఈయన సదా తాదాత్మైకతలో ఉంటూ తన శిష్యులకు పరావాక్కు (అనగా మాంస శ్రోత్రములకు వినబడని వాక్కు) తో బోధిస్తూ ఉంటారు.

దక్షిణామూర్తి = “దక్షిణ” + “అమూర్తి”
స్వరూపములేని /అవ్యక్తస్వరూపుడైన పరమేశ్వరుడు.

అయితే మనం చూసున్న ఈ వివిధ రూపాలలో దర్శనమిస్తున్న దక్షిణామూర్తి, యోగులు/ఋషులు తమ తమ ఉపాసనలలో దర్శించిన రూపాలు.ఈ రూపాలే వారు మనకి అందిస్తే ఆ రూపాల్లో మనం దక్షిణామూర్తిని పూజించుకొంటున్నాము.

సాధారణంగా మనకు తెలిసిన/చూసిన దక్షిణామూర్తి #స్వరూపము...
విశాలమైన వట (మర్రి) వృక్షము క్రింద ఎత్తైన శిలపై వ్యాఘ్ర (పులి) /కురగ (లేడి) చర్మము ధరించి చతుర్భుజుడై ఉంటారు.

ఈయన పైన ఉన్న కుడి చేతిలో ఢమరుకము, స్ఫటిక అక్షమాలతోను, పైన ఉన్న ఎడమ చేతిలో అగ్ని దివిటీ, క్రింద ఉన్న ఎడమ చేతిలో తాళపత్రములు/కుశాగ్రములు, క్రింద ఉన్న కుడి చేతితో చిన్ముద్ర తోనూ ఉంటారు.

మెడలో సువర్ణాభరణములు, రుద్రాక్షమాలలు మరియు ఎడమ భుజము పైనుండి యజ్ఞోపవీతము ధరించి ఉంటారు.మరియు తలపై నాగబంధముతో చుట్టబడిన కేశములు, ఆమధ్యలో గంగ, ముందు భాగంలో కిరీటము, కిరీటమునకు ఇరువైపులా సూర్య చంద్రులు ఉంటాయి.

ఆయన కుడిచెవికి కుండలము మరియు ఎడమచెవికి తాటంకము ధరించి ఉంటారు.నుదుటిపై మూడవనేత్రము, నడుము పై కటిసూత్రము, కటి బంధము ధరించి ఉంటారు.


తనకుడి మోకాలు క్రిందకు నేలపై అపస్మారుడు అనే రాక్షసుణ్ణి తొక్కుతూ ఎడమ మోకాలు కుడి తొడపై ఆనించి కూర్చొని ఉంటారు.

ఆయన ముందర ఆయన నుండి బ్రహ్మజ్ఞానం తెలుసుకొనుటకై సనకుడు, సనందుడు, సనాతనుడు, కూర్చొని ఉంటారు.

ఈ విధమైన దక్షిణామూర్తి స్వరూపము యొక్క #భావమును మనం పరిశీలించినట్లయితే ఈ క్రింది విషయములు మనకి బోధపడతాయి.

విశాలమైన వట (మర్రి) వృక్షము – విశాలంగా విస్తరించే ఆ పరమాత్ముని సృష్టిని సూచిస్తుంది. వటవృక్షమూలంలో కూర్చొని ఉన్న దక్షిణామూర్తి, ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడని సూచిస్తున్నది.

ఇక ఆయన స్వరూపము అష్టమూర్తి తత్త్వముతో కూడినది. అనగా పంచ భూతములు, సూర్య, చంద్రులు, పురుషుడు/ఆత్మ/యజమాని.

దక్షిణామూర్తిని రూపాన్ని పరిశీలిస్తే ఈ అష్టమూర్తి తత్త్వములు మనకు గోచరమవుతాయి.
అవి

ఆకాశాద్వాయుః | వాయోరగ్నిః | అగ్నేరాపః | అద్భ్యః పృథివీ |

జటాజూటములు - వాయుతత్త్వము

ఎడమ చేతిలో ఉన్న అగ్ని/జ్యోతి – అగ్ని తత్త్వము

తలపైన ఉన్న గంగ – జల తత్త్వము

మూర్తీభవించిన దక్షిణామూర్తి రూపము – పృథివి తత్త్వము.

శిరస్సుకిరువైపులాఉన్న సూర్య చంద్రులు – సూర్య చంద్రులు

ధ్యానం/మౌనంలో ఆయన స్వరూపము – యజమాని/పురుషుడు/ఆత్మ

ఈ రూపంలో ఉన్న దక్షిణామూర్తి సృష్టి, స్థితి, లయ కారుడైన పరమేశ్వరుడుగా గోచరిస్తాడు.

కుడిచేతిలో ఉన్న ఢమరుకము సృష్టికారకత్వాన్ని తెలియజేస్తుంది.

మద్యలో ఉన్న సూర్య చంద్రులు స్థితికారకత్వాన్ని తెలియజేస్తుంది.

ఎడమ చేతిలో ఉన్న అగ్ని/జ్యోతి – లయకారకత్వాన్ని తెలియజేస్తుంది.

ఇక మిగిలిన రూపవిశేషాలు పరిశీలించినట్లయితే-

పైన ఉన్న కుడి చేతిలో ఢమరుకము, స్ఫటిక అక్షమాల – ఈ సర్వసృష్టికి మూలాధారమైన శబ్ధస్వరూపము, అ నుండి క్ష వరకు సూచించే అక్షమాల.


పైన ఉన్న ఎడమ చేతిలో అగ్ని దివిటీ – అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టే జ్ఞానము. పరమేశ్వరుని సంహార క్రియను సూచించును.


క్రింద ఉన్న ఎడమ చేతిలో తాళపత్రములు/కుశాగ్రములు – జ్ఞాన సంపద, వేదములు సూచిస్తాయి
క్రింద ఉన్న కుడి చేతితో చిన్ముద్ర – అభయముద్ర, జ్ఞానముద్ర,అనుగ్రహము సూచిస్తుంది.



మెడలో సువర్ణాభరణములు, రుద్రాక్షమాలలు – ఇవి వీర్యము, క్షమత, దానము, శీలము, జ్ఞానము మొదలగు గుణములు సూచిస్తాయి.

కుడిచెవికి కుండలము మరియు ఎడమచెవికి తాటంకము – కుడిచెవి కుండలము పురుష తత్త్వము తెలుపగా ఎడమచెవి తాటంకము ప్రకృతి తత్త్వము తెలుపుతున్నది. ఇదియే అర్థనారీశ్వర తత్త్వము.

నుదుటిపై మూడవనేత్రము - జ్ఞానము సూచిస్తుంది

కుడికాలు క్రిందకు వంచి, ఎడమకాలిని కుడి తొడపై ఉంచి కూర్చొనడం – వీరాసనం అంటారు. వీరత్వం, సామర్థ్యత (దక్షత) తెలుపుతున్నది.

తనకుడి మోకాలు క్రిందకు వంచి (లంబక పాదమ్) అపస్మారుడు అనే రాక్షసుణ్ణి తొక్కుతూ ఎడమ మోకాలు కుడి తొడపై ఆనించి (కుంచిత పాదము) కూర్చొని ఉంటారు – అపస్మారుడు అనగా ఆసురీశక్తులు, అజ్ఞానము సూచిస్తుంది.

ఆయన ముందర బ్రహ్మజ్ఞానం తెలుసుకొనుటకై కూర్చొని ఉన్న ఋషులు –

సనక, సనందన, సనాతన, సనత్కుమారులు.

అయితే కొన్ని గ్రంధాలలో ఈ ఋషులను ఈ క్రింది విధంగా కూడా చెప్తారు.

అగస్త్యుడు, పులస్త్యుడు,విశ్వామిత్రుడు, అంగీరసుడు
కౌశిక, కశ్యప, భరద్వాజ, అత్రినారద, వశిష్ఠ, జమదగ్ని, భృగు

Products related to this article

Medha Dakshinamurthi Rupu (Pure Silver)

Medha Dakshinamurthi Rupu (Pure Silver)

మేధా దక్షిణామూర్తి రూపు రూపును మెడలో ధరించాలి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. విద్యాభివృద్ధి కలుగుతుంది. మనశ్శాంతి ఏర్పడుతుంది. విద్యార్థినీ, విద్యార్థులకు ఉత్తమమైనది. Medhadakshinamurthi Rupu (Pu..

₹1,201.00

Medhadhakshinamurthy

Medhadhakshinamurthy

Medhadhakshinamurthy ..

₹540.00

Dakshinavrutha Shankh

Dakshinavrutha Shankh

..

₹199.00