వార ఫలాలు 21-01-2024 నుండి 27-01-2024 వరకు

మేషం: వారికి ఈవారం  మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే గతం వారాల కంటే ఈ వారం కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కొంత అభివృద్ధితో పాటు ఆదాయం కూడా సానుకూలతగా ఉంటుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఎంతకీ అంతగానే ఉంటుంది. విలాస వస్తు వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఖర్చులు కూడా అదే విధంగా అధికం అవుతాయి. అయితే ఈ యొక్క తాత్కాలిక అభివృద్ధితో మీయొక్క పనులను, వ్యవహారాలు నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి. చేయవలసిన పనులలో నిర్లక్ష్య వైఖరి పనికి రాదు. గోమతి చక్రాలను పూజా గదిలో ఉంచి నిత్యం కుబేర కుంకుమతో పూజ చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఇతరులపై ఆధారపడి పనులను వాయిదా వేయ్యకండి,  మీ కోపములు, ఫ్రస్ట్రేషన్ వంటివి మీ కింద పని చేసే వారిపై చూపించకండి. 

అలా చేస్తే మీ యొక్క మంచి పేరుకి భంగం వాటిల్లే అవకాశములు ఉన్నాయి. మీపై వ్యతిరేకత ఏర్పడుతుంది. కుటుంబంలో సానుకూలత ఉంటుంది, పెద్దలపై ప్రేమాభిమానాలు చూపుతారు. వారి అండదండలు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. సినీ, రాజకీయ, కళాసాంస్కృతిక రంగాల వారికి అనుకూలమైన ఫలితాలుండె సమయం అని చెప్పవచ్చు. ప్రయాణాల విషయంలో కొంత అలోచనా దోరణితో నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు  పొందుతారు. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలు గోచరించే సమయం అని చెప్పవచ్చు. ఏకాగ్రత, దృష్టి పెట్టినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారి  ప్రయత్నాలు  సానుకూలపడతాయి.


వృషభం: వారికి ఈవారం  కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సాఫ్ట్ వేర్, గృహోపకరణములకు సంబంధించిన వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది.  తెలివి పెట్టుబడిగా పెట్టె కన్సల్టేషన్స్ వంటి వ్యాపారస్తులకు మంచి సదవకాశాలు అందుకుంటారు. అయితే వ్యాపారంలో పెట్టె పెట్టుబడులు విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తీసుకోవాలి కూడా. ఉద్యోగస్తులకు మాత్రం అధికారులతో కానీ సహా ఉద్యోగస్థులతో కానీ మనస్పర్థలకు తావు ఇవ్వకపోవడం మంచిది. లేనిపోని విధంగా నిందలు, ఆరోపణలు వచ్చి మానసిక ప్రశాంతతకు భంగానికి కారణమవుతాయి. తద్వారా అనుకోని విధంగా డబ్బు ఖర్చులు కూడా వృధాగా అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఉన్నాయి. 

వివాహం కానీ వారికీ ప్రయత్నాలు ముమ్మరం చేయడం మంచిది. ఆలస్యం, నిర్లక్ష్యం పనికి రాదు. విధ్యార్థులకు మంచి ఫలితాలు, ఉత్తీర్ణత శాతం పెరుగుతాయి. తదుపరి విద్యా విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యపై శ్రద్దా శక్తులు పెరుగుతాయి. ఈ రాశి వారు మంచి ఫలితాల కోసం నిత్యం జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రేష్టం. చిన్నపాటి అనారోగ్యమును సైతం పక్కకు పెట్టి స్నేహితులతో వినోదయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. ఏది ఏమైనప్పటికీ ఈవారం ఆర్ధిక పరంగా కానీ, అన్ని విధముల అంత ఇబ్బందులు ఉండవు,  సానుకూలం ఏర్పడుతుంది.


మిథునం: వారికి ఈవారం అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. అన్ని విధాలుగా ఆలస్య ఫలితములు, అనుకున్నంత ఫలితం రాకపోవడం వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున నిరాశ, నిసృహలకి లోనుకావద్దు. మీ భాధ్యతను మీరు నిర్వహించండి. ఫలితాలు నిదానంగా వస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో పని ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి పనిని అప్పుడే నిర్లక్ష్యం చేయకుండా చేసుకోవడం మంచిది. వ్యాపారస్తులు కూడా అతి నమ్మకం, ఎవర్ని అతిగా నమ్మి ఎక్కువ పెట్టుబడులు, నూతన ప్రణాళికలు చేయడం అంత మంచిది కాదు. కొంత సమయం పట్టినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమం. లాభాలు లేనప్పటికీ నష్ట పోకుండా జాగ్రత్త వహించి ముందుకు సాగండి. 

కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో తగాదాలు, మాటపట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కొంత కఠిన వైఖరి ఏర్పడుతుంది. ఇది కొంత మందికి మాత్రమే. ఆందోళన చెందవద్దు. జీవిత భాగస్వామికి కానీ, సంతానం కానీ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీ వరకు మీరు మానసిక ధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. అన్ని విధాల అధిక ఖర్చులు ఎదురవుతాయి. అయితే గురు బలం బాగున్నందున సమస్యలను అధిగమించే శక్తీ కలిగి ఉంటారు. మానసిక ధైర్యం ఉంటుంది.  అవసరాలకు తగిన విధంగా ఎదో ఒక రూపేణ సహాయ సహకారాలు అందుతాయి. పనులు యధాతధంగా సాగుతాయి.


కర్కాటకం: వారికి ఈవారం  మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంత ఆధ్యాత్మికత చోటు చేసుకుంటుంది.  ఏదైనా వ్యవహారాలు, ప్రణాళికలు అనుకున్న పనులు నెరవేరుతాయి. దేవునిపై భారం వేసి ముందుకు సాగండి. వ్యాపారస్తులకు అనుకున్న ఫలితాలు సంప్రాప్తిస్తాయి. జనాలలో ఆకర్షణ కొరకు మీరు చేసే ప్రచార విధానాలు సఫలీకృతం అవుతాయి. మంచి జనాదరణ పొందుతారు.  శత్రువులు ఉంటె వారి వలన మీరు పడే ఇబ్బందులు వంటివి కూడా కొంత తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రయాణ సంబంధమైన వ్యవహారాలు, వ్యాపారాలు కొంత నిరాశను కలిగిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారు కొంత ఓర్పు, సహనం వహించండి. ప్రయత్నాలు మాత్రం ఆపవద్దు. కొంత నిదానంగానైనా సరే ఫలితాలు పొందుతారు. 

ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయి, అప్పులకు దూరంగా ఉండడం మంచిది. గతంలో  చేసిన ఋణాల వ్యవహారంలో చిన్నపాటి చిక్కులు, తగాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ఎవరికీ హామీలు ఉండి లేనిపోని చిక్కులు తెచ్చుకోవద్దు. మీరు సహాయం చేస్తే ఒకలా, లేకపోతే ఒకలా ప్రవర్తించే మనుషుల తీరు మీకు అర్ధం అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఏది ఏమైనా కుటుంబ గౌరవం కాపాడతారు. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాల యొక్క ఫలితాలు మీరు ఇబ్బందుల పాలు చేసే విధంగా ఉండవచ్చు. కాబట్టి సామాన్యం గా ఉండడం మంచిది. కంగారు పడకండి. నిదానంగా కార్యాచరణ చేయండి. మీయొక్క  చికాకులు కుటుంబంలో  చూపించడం మంచిది కాదు. మానసిక ప్రశాంతత పోతుంది. 


సింహం: వారికి ఈవారం నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి స్థిరమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్నేహితుల అందండలు, సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకున్న ఫలితాలుంటాయి. మీ ఆలోచనలకు తగినట్టుగా ప్రతిఫలం లభిస్తుంది.  మీరు కొంత నిర్లక్ష్య ధోరణితో ఉన్నప్పటికీ దానివలన ఎక్కువ నష్టపోవలసి ఉంటుంది. మీ మంచికి చెడుకి మీరే కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చేసే పనులకు మీకు వచ్చే మాటలను, ఫలితాలను బట్టి  ముందుకు సాగడం మంచిదని చెప్పదగ్గ సూచన. ఆదాయం ఎలా ఉన్నప్పటికీ విలాసవంతమైన జీవితం గడుపుతారు. అయితే మీరు ఇంత కష్టపడినప్పటికీ కుటుంబంలో సంతానము నుండి, జీవిత భాగస్వామి నుండి కొంత వ్యతిరేఖత ఉండే అవకాశాలు ఉన్నాయి. అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

కాబట్టి ముందుగా సమస్యను పసిగట్టి సానుకూలంగా మాట్లాడడం, కోపతాపాలను నియంత్రించుకోవడం వంటివి యత్నిచండి. ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు  మధ్యస్థ ఫలితాలుంటాయి. సామాన్యంగా ముందుకు సాగుతారు. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కాకుంటే ఒకటి రెండు సార్లు తిరిగితే కానీ పనులు అవ్వని పరిస్థితి ఉంటుంది. ఓర్పు సహనం వహించండి. పోరాడే తత్వమును పెంచుకోండి. నిత్యం ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయడం అలాగే లక్ష్మీ గవ్వలతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కొంత సానుకూలత, ఆరోగ్యం మెరుగు పడడం వంటివి ఏర్పడతాయి.


కన్య: వారికీ ఈవారం ఉద్యోగపరమైన ఇబ్బందులు, పని యందు ఒత్తిడి వంటివి ఇబ్బంది పెడతాయి. ప్రయివేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగస్తులకు కొంత పోటీ తత్వం అలవడుతుంది. తద్వారా పని బారం వలన మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి.  శారిక ఆరోగ్య పరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా కాంపిటీషన్ వంటివి ఎక్కువ ఆలోచింప చేస్తాయి. తెలివి తేటలకు సంబంధించిన విషయాలలో, సలహాలు ఇవ్వడంలో  మీయొక్క ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది.  బిజినెస్ చేసే వారికి, సాఫ్ట్ వేర్ రంగాల వారికి, అలాగే షేర్లు మార్కెట్ వంటివి అనుకూలిస్తాయి. అయితే మీ అభివృద్ధిని మీ బంధు వర్గంలోని వారు, సొంతవారే తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. 

ద్వేషం, అసూయతో కూడినటువంటి వారి నుండి విమర్శలు కానీ, మాటలు కానీ పట్టించుకోకండి. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది.  చేసే పని యందు, కార్యాలయాలలో ప్రశంసలు అందుకుంటారు. అధికారం పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వ్యవసాయ దారులుకు, పాడి, పంటలు వృద్ధి అవుతాయి. అన్ని విధాల బాగున్నప్పటికీ అష్టమ గురుని కారణంగా కొంత లేనిపోని నిందలు, తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండండి. వివాహం కానీ వారికి చేసే ప్రయత్నాలు కొంత ప్రతికూలమైన ఫలితాలను ఇవ్వవచ్చు. ఆందోళన చెందకండి. ప్రయత్నాలు ఆపవద్దు. ఇంకా ముమ్మరం చేయండి.


తుల: వారికి ఈవారం ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కుటుంబ పరంగా అన్ని విధాల సానుకూలమైన  ఫలితాలు ఉంటాయి. బంధువులతో చిన్నపాటి విభేధాలున్నప్పటికీ, కుటుంబ పరంగా మంచి నిర్ణయాలు తీసుకొనుటకు మంచి సమయం అని చెప్పవచ్చు. కుటుంబంలో ఎప్పటి నుండో అనుకుంటున్న శుభకార్యాలు  జరపడానికి చర్చలు చేస్తారు. వివాహం కానీ వారికి వివాహ పరంగా అనుకూల ఫలితాలను పొందడానికి కొంత సమయం పడుతుంది. అయితే వ్యవహారాలు పూర్తిగా అవ్వక పోయినప్పటికీ ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు పనిచేసే చోట గౌరవం పెరుగుతుంది. 

నలుగురిలో మాట చెలామణి అవుతుంది.  అయితే  కొంత పని అధికం అవుతుంది. అయినా పట్టుదలతో అభివృద్ధి సాధిస్తారు. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి.  ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. కొంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నాం అనే భావనకు వస్తారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు, వారి సహాయ సహకారములు కూడా ఎప్పుడూ అందుతాయి. అయితే ఆర్ధిక పరంగా ఋణాలు, లోన్లు వంటి వాటి నుండి ఇబ్బందులు ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేయాల్సిన ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉత్పన్నమవుతాయి. వారంతంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. సంతాన పరంగా కానీ, వివాహా పరంగా కానీ మంచి శుభ వార్తలు వినే మంచి సమయం అని చెప్పవచ్చు.


వృశ్చికం: వారికి ఈవారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మంచి సానుకూలత ఉంటుంది. తాత్కలికంగా ఉద్యోగంలో కొంత ఆటుపోట్లు ఉన్నవారికి  ఉద్యోగ స్థిరత్వం  ఏర్పడుతుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికీ, నూతన విద్యాకోర్సులు చేయాలనుకునే వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగ, వ్యాపార, కార్యాలయాలలో మీ ముక్కుసూటి తనం, ఖచ్చితమైన మాట తీరు వలన కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. మీ ఎదురుగా ఏమి అనలేని వారు మీ వెనుక గోతులు తవ్వుతూ, మిమ్మల్ని విమర్శించే అవకాశాలు ఉంటాయి. 

అధికారుల నుండి ప్రశంసలు అందుకున్నప్పటికీ సహా ఉద్యోగులతో కానీ, కుటుంబంలో వారితో కానీ చిన్నపాటి అపోహలు, అపవాదులు భరించాల్సి వస్తుంది. కాబట్టి మీరు అంత ఖచ్చితంగా మాట్లాడడం కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యధార్థ వాది బంధు విరోధి అన్నట్టుగా ఉంటుంది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారస్తులకు కూడా ఆర్థికాభివృద్ధితో పాటు ప్రశంసలు, జనాదరణ లభిస్తుంది. కుటుంబ పరంగా అనుకోని విధంగా ఆనందకరమైన శుభ వార్తలు వింటారు. ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితములుండె సమయం అని చెప్పవచ్చు. అనుకున్న ఉత్తీర్ణత సాధిస్తారు. మానసిక సంతోషం లభిస్తుంది.


ధనస్సు: వారికి ఈవారం విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకున్న ఫలితాలు ఉంటాయి. విద్య పట్ల శ్రద్ద, పట్టుదల పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షల యందు మంచి విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్థులకు స్దాన చలనం కానీ, పని భారం కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అధికారులతో వ్యవహారాలు, మంతనాలు అంతగా ఫలించక పోవచ్చు. వ్యాపారస్తులకు కూడా మీ యొక్క చంచలత్వం వలన, నా అనుకున్న వారిని నమ్మడం వలన వస్తు నష్టం కానీ, కానీ ఆర్ధిక పరమైన నష్టాలు ఏర్పడే అవకాశాలు ఎదురవుతాయి. ఇతరుల వలన ఎటువంటివైన విమర్శలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కుటుంబం యొక్క అండదండలు పుష్కలంగా ఉంటాయి.  అయితే బంధువర్గంతో విభేధములు, చిన్నపాటి విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  

నూతన వస్తువులు కోనుగోలు చేస్తారు. ఏదైనా ముఖ్యమైన పనులు, వ్యవహారాలు మొదలు పెట్టినట్లయితే కొంత ఆటంకాలు ఏర్పడవచ్చును. నిత్యం నాగ సింధూరం ధరించండి. దగ్గరలో ఉన్న శివాలయం దర్శించి, శివ పంచాక్షరీ పఠించడం మంచిది.  ఏది ఏమైనప్పటికీ మీయొక్క విల్ పవర్ అనేది ఎక్కువగా ఉండడం వలన సమస్యలను అధిగమిస్తారు. అలాగే  వివాదాలు వచ్చే విషయాలను, మనుషులను ఏది పట్టించుకోకుండా కొంత మౌనాన్ని వహించడం వలన భవిష్యత్తులో తగాదాలకు దారితీయకుండా ఉంటుంది. వివాహప్రయత్నాలు చేసే వారికి సంబంధాలు దగ్గరగా వచ్చి వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కంగారు పడకండి. మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఆపవద్దు.


మకరం: వారికి ఈవారం అత్యంత మానసిక ఒత్తిడి తర్వాత కొంత సానుకూలమైన ఫలితాలుండె అవకాశాలు ఉన్నాయి.  మీరు ఎంత శాంతంగా ఉన్నప్పటికీ అనుకోని విధంగా సమస్యలు వచ్చిపడే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగ పరంగా కొంత ప్రతికూలమైన ఫలితాలుంటాయి. అనుకున్న పనులు కొంత జాప్యం అవుతుంటాయి. ముఖ్యంగా మాట విషయంలో ఎక్కువగా స్త్రీలతో వివాదాలు, విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా కూడా కొన్ని మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. పెద్ద పెద్ద కారణాలు కాకపోయినా చిన్నచిన్న మాటలకు అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆందోళన చెందకండి. నిదానంగా సర్దుకుంటాయి. 

మిమ్మల్ని తప్పుగా అనుకున్నవారే మీ గురించి నిజానిజాలు తెలుసుకుంటారు. మళ్ళీ యధావిధిగా మీతో ఉండే రోజు వస్తుంది. చింతించాల్సిన అవసరం లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి  మీరు ఆశించిన జీతం రాక పోయినా వచ్చిన ఉద్యోగంలో నిలదొక్కుకోవడం మంచిది. అభివృద్ధి నిదానంగా ఉంటుంది. ప్రమోషన్స్, బదిలీలు వంటి వాటికి ప్రయత్నాలు అనుకూలించక పోవచ్చు. ఏది ఏమైనా మీ ఇంటి ఇలవేల్పు అందండలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నవగ్రహ వత్తులతో దీపారాధన చేయండి. జవాదు కుంకుమతో మీ ఇష్టదైవాన్ని, ఇలవేల్పుని పూజించండి. కుటుంబంలో శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. ఏది ఏమైనప్పటికీ ఒకటికి రెండు సార్లు ఆలోచించి, కొంత జాగ్రత్త వహించినట్లైతే మంచి అభివృద్ధి ఉంటుంది.


కుంభం: వారికీ ఈవారం మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి సమయం అని చెప్పవచ్చు. సాఫ్ట్ వేర్ రంగం వారికి, టెక్నీకల్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, చిరు వ్యాపారస్తులకు సైతం కొంత అభివృద్ధి బాగుంటుంది. గతంలో మీరు పడిన ఇబ్బందులకు, కష్టాలకు ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కూడా అన్ని విధాల బాగున్నప్పటికీ కొంత ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఉండవచ్చు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి పని ఒత్తిడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి ఫలితాలుంటాయి. ఒకవేళ వివాహం చేసుకోదలచక పోయినప్పటికీ మంచి సంబంధాలు వస్తున్నట్లైతే ఒక్క సారి ఆలోచించండి. వివాహా ప్రయత్నాలకు మంచి సమయం. 

ఆర్థిక పరంగా ఒడిదుడుకులు వస్తుంటాయి-పోతుంటాయి. పెళ్లి అనేది నూరేళ్ళ పంట కాబట్టి మంచి అవకాశాలు వచ్చినప్పుడు జరవిడవద్దు, ఆలస్యం చేయవద్దని సూచన. విద్యా పరంగా విదేశాలకు వెళ్ళడానికి  చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఒక్కోసారి వీసా రిజెక్టులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ మరల ప్రయత్నాలు చేయండి. విలాసాలు, వ్యసనాల విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా వ్యవహారాలు మొదలు పెట్టుటకు, ఎప్పటి నుండో స్థిరాస్తి వ్యవహారాలు, తగాదాలు ఉన్నట్లైతే పరిష్కరించుకోవడానికి మంచి అనువైన కాలం అని చెప్పవచ్చు. కోర్ట్ వ్యవహారములు చక్కబడతాయి.


మీనం: వారికి ఈవారం ఉద్యోగాభివృద్ది, ఆర్థికాభివృద్ధి పుంజుకొని, ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలం. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి లాభసాటిగా నడుస్తుంది.  అయితే ఆర్ధిక స్థిరత్వం ఏర్పరచుకోండి. వివాహ  ప్రయత్నాలు చేసే వారు అశ్రద్ధ చేయకండి. శని, రాహువులు అనుకూలంగా లేకపోయినప్పటికీ గురు గ్రహ బలం  వలన ఈ సంవత్సరంలో అంటే  శోభకృత్  నామ సంవత్సరంలో వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆలస్యం చేయవద్దు. గురు సంచారం మారినట్లైతే మళ్ళీ కొంత ఆలస్యం అయ్యే  అవకాశాలు ఉన్నాయి. 

ఆర్ధిక ఇబ్బందులు, విద్యా సంబంధమైన కారణాలు, కెరీర్ వంటి ఎంత ముఖ్యమో వివాహం అనేది అంత కంటే ముఖ్యమైన విషయం అని గ్రహించండి. వ్యాపారస్తులుకు  ఆర్ధిక పరంగా, కోర్ట్ వ్యవహారాలు చక్కబడతాయి.  ఆర్ధిక లాభాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ నష్టాలు ఉండవు. కుటుంబంలో తలపెట్టిన శుభకార్యాల గురించి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే స్థిరాస్తి వృద్ధి చేయాలనుకునే వారికీ, నూతన గృహము కల ఉన్నవారికి నెరవేరడానికి చేసే  ప్రయత్నాలు  మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ద వహించడం మంచిది. వృధా ప్రయాణాలు అలసటకు కారణమవుతాయి.


                                            


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121