మేషం: పట్టుదలతో ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటాబయటా అనుకూలంగా వుండును. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు.
వృషభం: అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా వుండును. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది.
మిథునం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.
కర్కాటకం: వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. శ్రమకు తగిన ఫలితం కష్టమే. సన్నిహితుల నుండి సహాయసహకారాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.
సింహం: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు, వినోదాలు. శుభకార్యాల్లో చురుకుగా పాల్గొరటు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి.
కన్య: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. సోదరుల నుండి సహాయం అందిస్తారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. వస్తు లాభం.
తుల: మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.
వృశ్చికం: బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. భూముల క్రయవిక్రయాలు అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.
ధనస్సు: పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. సంఘంలో గౌరవం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి.
మకరం: రుణాలు తీరుస్తారు. బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలు. వాహన యోగం. నూతన మిత్రులు పరిచయమైన కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్తు, వస్త్రాలు నుగోలు చేస్తారు.
కుంభం: ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.
మీనం: ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు ఏర్పడిన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. శ్రమకు తగిన ఫలితం. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121