మేషం: కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు, వినోదాలు, సంతానంనకు యత్న కార్యసిద్ధి పొందుతారు.
వృషభం: ప్రయాణాలలో తొందరపాటు వద్దు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు.
మిథునం: ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. సంతానంనకు విద్యా, ఉద్యోగవకాశాలు పొందుతారు.
కర్కాటకం: కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుండి ధన, వస్తులాభం.
సింహం: కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల మెలుకవ అవసరం.
కన్య: బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కారం. సంతానంనకు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం వస్తు లాభం.
తుల: మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వాహన యోగం.
వృశ్చికం: నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. భూవివాదాలు తీరీ నూతన ఒప్పందాలు కుదురుతాయి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. శుభవార్తలు.
ధనస్సు: ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగాలలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి. నూతన వస్తు సేకరణ.
మకరం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనులో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన ఒత్తిడులు తొలుగుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం.
కుంభం: ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు.
మీనం: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. తండ్రి నుండి ధనలాభం పొందుతారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121