ఫాల్గుణ మాసం విశిష్టత

ఈ రోజు (సోమవారం 11-03-2024) నుంచి ఏప్రిల్ 8-2024 వరకూ ఫాల్గుణమాసం.


ఫాల్గుణ మాసం సర్వదేవతా సమాహారం. తిథుల్లో ద్వాదశి మణిపూస లాంటిది. సంఖ్యాపరంగా పన్నెండుకు ఒక ప్రత్యేకత ఉంది. సూర్యుడికి 12 పేర్లున్నాయి. సంవత్సరానికి 12 మాసాలు. ఫాల్గుణం పన్నెండోది. దాని తర్వాత కొత్త ఏడాది మొదలవుతుంది. ప్రకృతికంగా స్త్రీలకు పన్నెండో ఏడు, సమాజపరంగా విద్యార్థులకు పన్నెండో తరగతి ప్రధానం.ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నృసింహ ద్వాదశిగా ప్రసిద్ధం. ఈ ద్వాదశిని గోవింద ద్వాదశి అని, విష్ణుమూర్తికి ప్రియమైన ఉసిరి పేరుతో అమలక ద్వాదశి అని పిలుస్తారు. 


ఫాల్గుణ బహుళ పాఢ్యమి రోజున రావణుడితో యుద్ధం కోసం శ్రీరామచంద్రుడు లంకకు బయల్దేరాడని రామాయణం చెబుతోంది. ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడి మధ్య సమరం ప్రారంభమైనట్టు పేర్కొంది. హరిహర సుతుడైన అయ్యప్పస్వామి, పాల కడలి నుంచి లక్ష్మీదేవి ఈ మాసంలోనే జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అర్జునుడి జన్మ నక్షత్రంలో ఫల్గుణి అనే పేరు ఉండటం ఫాల్గుణ మాసం విశేషాన్ని వెల్లడిస్తోంది. మహాభారతంలో ఫాల్గుణ బహుళ అష్టమినాడు ధర్మరాజు, శుద్ధ త్రయోదశి రోజు భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ మాసంలో గోవింద వ్రతాలు విరివిగా చేయాలి. విష్ణు పూజకు ప్రాధాన్యం ఇవ్వాలి.


ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైనది ఫాల్గుణ పౌర్ణమి. దీన్ని హోళీ పౌర్ణమి, మదన పౌర్ణమి, వసంతోత్సవంగా వ్యవహరిస్తారు.ఆధ్యాత్మిక చింతనే జీవిత పరమార్థం. ఆచారాల్లో ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసుకుని పాటించాలి. అదే మోక్షసాధన...

Products related to this article

Vishnumurthy Lakshmi Devi Brass Idol (2.5 Inches)

Vishnumurthy Lakshmi Devi Brass Idol (2.5 Inches)

                                                        &nbs..

₹350.00