నేడు
బుధవారం పుత్ర గణపతి వ్రతం
పాల్గుణ
మాసం లో వచ్చే శుక్ల పక్ష
చతుర్థి నాడు పుత్ర గణపతి
వ్రతం జరుపుకుంటారు.వినాయక
చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని
ఆచరించవలసి ఉంటుంది.
చతుర్థి
నాడు గణపతి కి చేసే పూజ
కార్యక్రమాల వలన సంతానం
కలుగుతుంది అని నమ్మకం.
ఫాల్గుణ
శుద్ధ చవితి రోజున ఉదయాన్నే
తలస్నానం చేసి పరిశుభ్రమైన
వస్త్రాలను ధరించాలి.
వాకిట్లో
ముగ్గులు పెట్టి … గడపకి
పసుపురాసి కుంకుమ దిద్ది ..
గుమ్మానికి
తోరణాలుకట్టి ..
పూజామందిరాన్ని
అలంకరించాలి.
ఈ
రోజున ఉపవాస దీక్షను చేపట్టి,
స్వామివారిని
షోడశ ఉపచారాలతో పూజించాలి.
ఆయనకి
ఇష్టమైన పండ్లను … పిండివంటలను
నైవేద్యంగా సమర్పించాలి.
సాయంత్రం
వేళలో కూడా స్వామిని పూజించి
ఆ తరువాత ఉపవాస దీక్షను
విరమించాలి.
ఈ విధంగా
నియమనిష్టలను ఆచరిస్తూ
అంకితభావంతో ఈ వ్రతాన్ని
ఆచరించడం వలన మనోభీష్టం
నెరవేరుతుందని చెప్పబడుతోంది.
భక్తి
శ్రద్ధలతో ఈ వ్రతం చేయడం వలన
వంశ దోషములు తొలగి శక్తి
యుక్తలు కలిగిన పుత్రులు
జన్మించునని వరాహపురాణ వచనము.