మేషం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా వుంటుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. వివాహ సంబంధం కుదురుతుంది.
వృషభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రత్యర్ధులు మీపై చేసే దుష్ప్రచారాల్ని తిప్పి కొడతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మిథునం: ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులు స్వల్ప లాభాలు పొందుతారు. వివాహ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మానసికంగా ఆనందంగా ఉంటారు.
కర్కాటకం: రుణాలు కొంత వరకు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. వస్తు లాభం.
సింహం: చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగాలలో మీదే పై చేయిగా ఉంటుంది.
కన్య: అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
తుల: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. పనులు మందకోడిగా సాగుతాయి. అనవసరపు విషయాలలో జోక్యం వద్దు. దైవ చింతన కలిగి ఉండండి.
వృశ్చికం: వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఆకస్మిక ధన లాభం.
ధనస్సు: రుణ వత్తిడుల నుండి బయటపడతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. క్రయ, విక్రయాలలో లాభాలు గడిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు.
మకరం: జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును.
కుంభం: ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మానసికంగా ఆనందంగా ఉంటారు.
మీనం: రుణ వత్తిడులు కొంత వరకు తీరుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. విందు, వినోదాలు.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121